Naveen Kumar, News18, Nagarkurnool
ఆపత్కాలంలో రోగులకు రక్తం అమృతంలా పనిచేస్తుంది. ఇలాంటి రక్త దానాలు చేయాలని చాలామంది చెప్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి (MLA Marri Janardhan Reddy) అభిమానులు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా నాగర్ కర్నూల్ (Nagar Kurnool) నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యకర్తలు, మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని భారీగా రక్తదానం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్లో ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చి దాదాపుగా 2000 మంది కార్యకర్తలు రక్తదానం చేసినట్టుగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.
గతంలో కరోనా సమయంలో ఎంతోమంది రక్త నిల్వలు లేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కళ్లారా చూసామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తమ వంతు సాయం చేసేందుకు నాగర్కర్నూల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, తమ అభిమాన నాయకుడికి ఫ్లెక్సీలు కట్టడం, ఇతర హంగామాలు చేయడం ఇలాంటి కార్యక్రమాల కంటే రక్తదానం చేసి అభిమానం చాటుకోవడం చాలా గొప్ప విషయమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తన పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలు భారీగా రక్తదానం చేయడం తనకు సంతృప్తిని అందిస్తుందని వివరించారు. ఈ రక్తదాన శిబిరానికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రక్తాన్ని సేకరించి వాటిని భద్రపరిచి అవసరం ఉన్నవారికి రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తారని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana