హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: తెలంగాణలో ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు.. ఆ నీటిని ఎలా శుద్ది చేస్తారో తెలుసా ?

Nagarkurnool: తెలంగాణలో ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు.. ఆ నీటిని ఎలా శుద్ది చేస్తారో తెలుసా ?

X
మిషన్​

మిషన్​ భగీరథ

ఇంటింటికి తాగు నీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ (Mission Bhagiratha) పథకాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నీటిని ఎవరు ఎలా శుద్ధి చేస్తారో తెలుసా..? న్యూస్​ 18 ప్రత్యేక కథనం..

(N. Naveen Kumar, News18, Nagarkurnool)

ఇంటింటికి తాగు నీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ (Mission Bhagiratha) పథకాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా నదులు, చెరువుల నీటిని సేకరించి శుద్ధిచేసి ప్రజలకు స్వచ్చమైన నీటిని అందిస్తున్నారు. నాగర్‍‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని గౌరీదేవిపల్లి గ్రామం సమీపంలో మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌లో 3 దశల్లో నీటిని శుద్ధిచేసి సమీప గ్రామాలకు తాగు నీరు సరఫరా చేస్తున్నారు.

మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు..

ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ ప్లాంట్లను (Mission Bhagiratha Plants) ఏర్పాటు చేసింది. ప్రజలంతా ఆర్ఓ ప్లాంట్ల ద్వారా ఫిల్టర్ చేసిన నీటిని కొనుగోలు చేస్తున్న సందర్బంలో ప్రభుత్వం స్వచ్చమైన నీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేస్తుంది. ఆర్ఓ ప్లాంట్ల ద్వారా కొనుగోలు చేసిన నీటిలో లేనటువంటి మినరల్స్, పోషక విలువలు అందేలా మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని గౌరీదేవిపల్లి గ్రామం దగ్గర ఏర్పాటు చేసి ప్లాంట్ ద్వారా నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలోని 409 గ్రామాలకు తాగునీటిని (Drinking Water) సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి స్ధానికంగా ఉండే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ల ద్వారా ఇంటింటికి నీటిని సరఫరా చేస్తున్నారు.

3 దశల్లో నీటిని శుద్ధిచేస్తున్న అధికారులు..

ఈ ప్లాంట్‌లో 3 దశల్లో నీటిని శుద్ధిచేస్తారు (Water purification). కెఎల్ఐ ప్రాజెక్ట్‌లోని అంతర్బగమైన ఎల్లూరు రిజర్వాయర్ నుంచి నదీ నీటిని సేకరిస్తారు. ఈ నీటిని శుద్ధిచేసేందుకు మొదటగా గాలిలోకి నీటిని విడుదల చేసి ఆక్సిజన్ కలిసేలా ఆక్సినేషన్ చర్యలు చేపడుతారు. ఇందు కోసం ప్రత్యేకంగా వృత్తాకార నిర్మాణం చేపట్టి నీరు గాలిలోకి వెళ్లేలా అధిక పీడనంతో విడుదల చేస్తారు. ఆ తరువాత నీటికి ప్రీక్లోరినేషన్ చేపడుతారు. ఈ ప్రక్రిలోని నీటిలోని ఆల్గే (నాచు) పేరు కోకుండా ఫెర్రిక్ ఆలమ్ లవణాలను నీటిలో కలుపుతారు.

ఈ లవణాలు నీటిలో కలిసేందుకు ప్రత్యేక మోటర్ ఫ్లాష్ మిక్చర్ ద్వారా నీటిని కలియతిప్పుతారు. నీటిని మొత్తం కలియతిప్పి లవణాలు కలిసేలా చేస్తారు. అక్కడి నుంచి రెండవ దశలో క్లారిఫ్లాక్యూలేటర్‌లోని నీటిని విడుదల చేస్తారు. ఆలమ్ కలిపిన నీటిలో మడ్డి శాతం లేకుండా చేసేందుకు క్లారిఫ్లాక్యూలేటర్ సిస్టంలోని నీటిని పంప్ చేస్తారు. దీని ద్వారా నీటిలోని చిన్న చిన్న కణాలు ఒకే చోట చేరి మొత్తం క్లారిఫ్లాక్యూలేటర్ కింద బాగంలోకి చేరుతుంది.

నలకలు లేని శుద్ధమైన నీరు పైకి వస్తుంది. 3వ దశలో ఫిల్టర్ బెడ్‌లోకి శుద్ధి చేసిన నీటిని పంపింగ్ చేస్తారు. వీటిలో ఫిల్టర్ మీడియా గ్రావెల్స్, సాండ్‌తో కూడిన ఫిల్టర్ బెడ్‌లు ఉంటాయి. వీటిలోకి నీటిని పంపించి మరింత శుద్ధిచేస్తారు. ఈ నీటిని పోస్ట్ క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టి సంప్‌లో నీటిని నిల్వ చేస్తారు. శుద్ధిచేసిన నీటిలో ఏ మేరకు మినరల్స్ ఉన్నాయనే అంశాన్ని తేల్చేందుకు ల్యాబ్‌లో పరీక్షలు కూడా నిర్వహిస్తారు. స్వచ్చమైన నీరుగా నిర్ధారణ చేసుకున్న తరువాతే ప్రజల అవసరాలకు తగినట్టుగా నీటిని సరఫరా చేస్తారు.

గద్వాలలో మిషన్ భగీరథ నీటిపై అనుమానాలు:

జులై మొదటి వారంలో గద్వాల పట్టణంలో సరఫరా చేసిన మిషన్ భగీరథ నీటిపై ప్రజలు పలు అనుమాలు వ్యక్తం చేశారు. కలుషిత నీటిని సరఫరా చేశారని పట్టణంలోని వేదానగర్, మోహిన్ మల్లా, గంటవీదిలో, రాఘవేంద్రకాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటి పైప్ నుంచి మురుగు నీరు వచ్చినట్లు స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. దీంతో మూడు రోజుల్లో పట్టణంలో 50 మంది అస్వస్థకు గురికాగా, ముగ్గురు మృతి చెందారు. కొత్తగా నిర్మించిన ట్యాంక్‌లను వినియోగించకుండా పాత ట్యాంక్‌ల ద్వారా నీటిని సరఫరా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై స్పందించిన అధికార యంత్రాంగం విచారణలు చేపట్టి, మిషన్ భగీరథ నీటిలో ఎలాంటి లోపాలు లేవని నిర్ధారణ చేసి ప్రకటించారు. అతిసార వ్యాది ప్రబలడం ద్వారా చనిపోయారని చెప్పుకొచ్చారు. ఈ అంశంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ నీటిపై అనుమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నీటిని తాగేందుకు ప్రజలు సుముఖత చూపడం లేదు.

ల్యాబ్‌లో పరీక్షించిన తరువాతే విడుదల చేస్తాం:

"నది నుంచి సేకరించిన నీటిని 3 దశల్లో శుద్ధిచేపడుతాము. ఈ ప్రక్రియల్లో నీటిలో సరైన మోతాదులో మినరల్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాము. పూర్తిగా శుద్ధిచేసిన నీటిని పోస్ట్ క్లోరినేషన్ చేసిన తరువాత ల్యాబ్‌లో పరీక్షలు చేపడుతాము. మినరల్స్, మడ్డి శాతం ఏమేరకు ఉందనే అంశాలను పరీక్షించిన తరువాతే ప్రజల అవసరాల కోసం గ్రామాలకు సరఫరా చేస్తాం" అని మిషన్ భగీరథ ఏఈఈ జిలానీ న్యూస్ 18తో చెప్పుకొచ్చారు.

మహ్మద్ జిలానీ, మిషన్ భగీరథ ఏఈఈ, నాగర్‌కర్నూల్, ఫోన్: 7995660245

ట్యాంక్‌లు శుభ్రంచేసి సరఫరా చేస్తాం:

"మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి వచ్చిన నీటిని పట్టణంలోని బ్యాలెన్సింగ్ ట్యాంక్‌లో మొదటగా నిల్వచేస్తాము. అక్కడి నుంచి అన్ని వార్డుల్లోని ట్యాంక్‌లకు సరఫరా చేసి ఇంటింటికి నల్లా ద్వారా నీటిని అందిస్తాము. ప్రతి ట్యాంక్‌‌ను 15 రోజులకు ఒక సారి పూర్తిగా శుభ్రం చేస్తాం. వీటితో పాటు నీటిలో ఇంజనీర్లు చెప్పిన ప్రకారం తగినంత బ్లీచింగ్ పౌడర్ కలిపి పంపింగ్ చేస్తాము. కాలనీల్లో ఎక్కడైన వాటర్ పైప్ లైన్ లీకేజీలు ఏర్పడితే వెంటనే మరమ్మత్తులు చేపడుతాము\" అని నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ వివరించారు.

అన్వేష్, నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్, ఫోన్: 7036684716

First published:

Tags: Drinking water, Local News, Mission Bhagiratha, Nagarkurnool

ఉత్తమ కథలు