హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: గద్వాలలో పెరుగుతున్న యువతుల మిస్సింగ్ కేసులు

Nagar Kurnool: గద్వాలలో పెరుగుతున్న యువతుల మిస్సింగ్ కేసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా కానీ ఈ దాడులు ఎక్కడా కూడా ఆగడం లేదు. ముఖ్యంగా యువతలను టార్గెట్ చేసుకొని కొంతమంది మోసగాళ్లు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా కానీ ఈ దాడులు ఎక్కడా కూడా ఆగడం లేదు. ముఖ్యంగా యువతలను టార్గెట్ చేసుకొని కొంతమంది మోసగాళ్లు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు. ప్రేమ అనే మత్తును జల్లి అమాయకమైన యువతులను తల్లిదండ్రులకు దూరం చేస్తున్నారు.

మాయగాల్ల మాటలు నమ్ముతున్న యువతులు తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సంఘటనలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరగడంతో అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ విషయాలను అటు తల్లిదండ్రులు గాని ఇటు పోలీసులు గాని బహిరంగంగా ప్రకటించేందుకు సంకోచిస్తున్నారు.

తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బహిరంగంగా వచ్చి చెప్పేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మిస్సింగ్ కేసుల్లో ఎక్కువగా అమ్మాయిలు అపరిచిత వ్యక్తులతో ఏర్పడినటువంటి సంబంధాల వలన జరిగినట్టుగా తెలుస్తుంది. సెల్ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అపరిచితుల వ్యక్తులతో ఏర్పడిన సంబంధాలు లైంగిక సంబంధాలకు దారితీస్తున్నాయి.

ఇలాంటి కేసులతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ సంఘటనను పరిశీలిస్తే మా అమ్మాయి గత రెండు మూడు రోజుల నుంచి కనిపించడం లేదు.. ఓ యువకుడి మీద అనుమానం ఉందని ఓ తండ్రి, కూతురిని ప్రేమ పేరుతో ఓ యువకుడు విధిస్తున్నారంటూ ఓ తల్లి. ఇలా గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు అందుతున్నాయి. తమ పిల్లలను కళాశాలలకు, ఉద్యోగాలకు పంపించాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి.

వీటిని సవాలుగా స్వీకరించిన గద్వాల జిల్లా పోలీసులు విచారణలను ముమ్మరం చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ అమ్మాయి, అబ్బాయి వరుసగా ఫోన్లో మాట్లాడుకోవడం గమనించిన తల్లిదండ్రులు ఇద్దరికి నచ్చ చెప్పారు. కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ అబ్బాయి మళ్ళీ ఫోన్లు చేయడాన్ని గమనించిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 26న ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అన్నిచోట్ల వెతికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థిని గద్వాల జిల్లా కేంద్రంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఈ క్రమంలో హాస్టల్ ఓనర్ బంధువుల అబ్బాయి ఆ విద్యార్థిని ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి తన బంధువులతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సొకేసు నమోదయింది.

గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఓ యువతి పనిచేస్తుంది. ఈనెల 27న తండ్రి తన మోటార్ సైకిల్ పై తీసుకొచ్చి దించి వెళ్లారు. సాయంత్రానికి ఆమె తిరిగి రాకపోవడంతో వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

మతిస్థిమితం లేని ఓ యువతి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతీ యువకులు, విద్యార్థులు ప్రేమ అనే ముసుగులో.. ఆ ప్రేమకు పూర్తిస్థాయి అర్థం తెలియకుండా చాలామంది ఆకర్షణకులోనై ఇలా మోసపోతూ ఉన్నారు. అరచేతిలో ఉన్న ఫోన్లు కొంతమంది వ్యవహార శైలి పెడదోవ పట్టడానికి కారణం అవుతున్నాయి. యుక్త వయసులో ఆలోచనల విధానాలకు హద్దు అదుపు లేకపోవడంతో మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి.

చాలామంది యువతి యువకులు జీవితం పట్ల పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం.. తాము నిర్ణయించుకున్నట్టే సరైన నిర్ణయం అని భావించడం.. కొంతమంది ఇంట్లోంచి వెళ్లిపోయి వివాహాలు చేసుకుని కుటుంబాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. మరి కొంతమంది కొన్ని రోజులు సహజీవనం చేసే తిరిగి ఇంటికి చేరుకుంటున్నారు.

ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి వయస్సును బట్టి హై స్కూల్ కళాశాల స్థాయిలో అవగాహన తరగతులను నిర్వహించడం.. అవసరమైన చోట్ల గట్టిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం.. తదితర చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు పరిస్థితులను చక్కదిద్దే అవకాశం ఉంటుంది. వీటితో పాటు తల్లిదండ్రులదే ప్రధానమైన బాధ్యత ఉంటుంది. ఇంట్లో పిల్లలు సెల్ఫోన్లో ఏం చూస్తున్నారు.. ఎలాంటి సమాచారాన్ని ఎక్కువగా వెతుకుతున్నారు. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారు, వీడియో కాల్స్ మాట్లాడుతున్నారా అనే అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ పిల్లలను అదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు