(Naveen Kumar, News18, Nagarkurnool)
నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లా కోడేరు మండలం ఎత్తము గ్రామంలో శుక్రవారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం (Lovers suicide) చేసింది. ఈ ఘటనలో యువకుడు మృతిచెందగా యువతి ప్రాణాలతో బయటపడింది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన గొల్ల గంట సాయికుమార్ (22), యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు వివిధ కారణాలు అడ్డున్నాయని, పెళ్లి (Marriage) కాదేమోనని బెంగతో యువతి తన ఇంటి వద్ద పురుగుల మందు తాగింది. దాంతో కుటుంబ సభ్యులు సదరు యువతిని కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సాయికుమార్ కూడా అతని ఇంటి వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరాడు. యువకుడిని కుటుంబ సభ్యులు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో సాయికుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువతికి ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు.
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి:
నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కొల్లాపూర్ మండలంలోని అమరగిరి సమీపంలో కృష్ణానది బ్యాక్ వాటర్‌లో చేపల వేటకు వెళ్లి కాక కురుమయ్య (25) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి చెందిన కురుమయ్య గురువారం అమరగిరిలో ఉంటున్న తన బావ వెంకటేష్ ఇంటికి వచ్చాడు. వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్‌తో కలిసి కురుమయ్య శుక్రవారం ఉదయం పుట్టితో నదిలో చేపల వేటకు వెళ్లారు.చేపలు పడుతుండగా కురుమయ్య ప్రమాదవశాత్తు పుట్టిలోంచి జారిపడ్డాడు. అక్కడే ఉన్న శ్రీకాంత్.. రక్షించే ప్రయత్నం చేసినా వీలుకాలేదు.దీంతో శ్రీకాంత్ విషయాన్ని తోటి మత్స్యకారులకు తెలపడంతో.. వారు అక్కడికి చేరుకొని కురుమయ్యను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మృతి చెంది ఉన్నాడు.పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
లారీ బైక్ ఢీకొని యువకుడు మృతి;
లారీ బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికీ గాయాలు అయ్యాయి. వికారాబాద్ (Vikarabad) జిల్లా కొడంగల్ మండలంలోని రావులపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం చింతల దీన్నేకు చెందిన భూమి మల్లేష్ (22) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో మల్లేష్ తన స్నేహితులు జోగు గణేష్, మహేష్‌తో కలిసి బైక్ పై హైదరాబాద్ నుంచి చింతలవీణకు గురువారం సాయంత్రం బయలుదేరారు.
Bhadradri Kothagudem: నొప్పులతో బాధపడుతున్న ఆ గర్భిణీని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించడమే శాపమైందా?
కొడంగల్ మండలం రావులపల్లి సమీపంలోని 163 రహదారిలో ఉన్న దాబా వద్ద ఓ లారీ వెనక్కి తీసుకుంటుండగా వేగంగా వస్తున్న వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో మల్లేష్ అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Local News, Lovers suicide, Mahbubnagar, Nagarkurnool