Naveen Kumar, News18, Nagarkurnool
మన ఊరు - మన బడి కార్యక్రమం వనపర్తి జిల్లా (Vanaparthy District) లో అన్ని మండలాల్లో విజయవంతంగా చేపట్టడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Ministe Niranjan Reddy) ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న వనపర్తి జిల్లాలో అద్భుతమైన ప్రగతిని పాఠశాలలు సాధిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు సరిపడా నిధులను కేటాయించి పాఠశాలలను ఆధునికరించి ప్రారంభంలో చేపట్టారు. నేటి బాలలకు నాణ్యమైన విద్యను అందించగలిగితేనే రేపటి సమాజానికి సమర్థమైతన పౌరులను అందించగలుగుతామని మంత్రి నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
వనపర్తి జిల్లా ఖిలా ఘనపురం మండలంలో ఆధునీకరణ చేపట్టిన పాఠశాలను ఆయన ప్రారంభం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య , వైద్యం ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు అందించడం రాజ్యాంగ విధి అని తెలిపారు. అనేక కారణాల చేత దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమయ్యాని ఆరోపించారు. భవిష్యత్ సంపద భావి పౌరులు.. వీరు జ్ఞానవంతులైతే ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన సమాజం నిర్మాణమవుతుంది అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆలోచనని తెలిపారు. తెలివి, ప్రతిభ కలిగిన వారు ఉంటే భౌతిక సంపదను వారి మేధస్సు నుండి వారే సృష్టిస్తారని చెప్పుకొచ్చారు. మంచి పాఠశాలలు, మంచి విద్యాబోధన, మంచి వసతులు, మంచి ఆహారం ఉంటే విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటారని వివరించారు.
ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ కరువవడంతో తల్లితండ్రులు కష్టపడి పిల్లలను ప్రైవేటుకు పంపాలనే ఆలోచనతో అటువైపు మొగ్గారని చెప్పారు. తల్లిదండ్రులు కష్టపడిన సంపాదన అంతా వారి పిల్లల విద్యకు, వైద్యానికి ధారపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దుస్థితి నుండి విముక్తి కల్పిస్తే ప్రజలకు ఖర్చులు ఆదా కావడంతో పాటు వారి ఆదాయం పెరుగుతుందన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షని తెలిపారు. ఈ అంశంపై సుధీర్ఘ కసరత్తు అనంతరం మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు.
ప్రజాప్రతినిధులు ప్రజలు ఆశించిన దారిలో మళ్లించే దిశగా పనిచేయాలి. పాఠశాలల బలోపేతానికి కృషిచేయాలిని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల బలోపేతం ద్వారా కార్పోరేట్ విద్యాసంస్థలకు చెక్ పెట్టవచని సూచించారు. అందరికీ ఆదర్శంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామాల విద్యార్థులను విధిగా ప్రభుత్వ పాఠశాలలలో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana