(నవీన్, న్యూస్18 తెలుగు, నాగర్ కర్నూల్)
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని, బడి పిల్లల భవితకు బంగారు బాటలు వేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామీణ స్థాయిలోని పాఠశాలల్లో ఆ పాఠశాల కావలసిన మౌలిక సదుపాయాలన్నింటిని ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ తరహా పరిపాలన కూడా కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే నాగర్ కర్నూల్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 30 పాఠశాలలను ఎంపిక చేసి వాటిలో మొదటి విడతలు పనులను పూర్తి చేశారు. వీటిని ప్రజా ప్రతినిదులచే ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దారు.
Peddapalli: స్థలం ఉంది.. నిధులున్నాయి.. కానీ ఫంక్షన్ హాల్‌కి ఇటుక కూడా పడలే..
నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో 26 లక్షల రూపాయలతో చేపట్టిన పనులు పూర్తవడంతో ప్రజాప్రతినిధులు ప్రారంభం చేపట్టారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన నూతన ఫర్నిచర్ ను వారు తిలకించారు. అనంతరం జెడ్పి ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మౌలిక వసతుల కల్పనలో దేశంలో మన రాష్ట్రం ముందంజల్లో ఉందన్నారు. విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.విద్యకు అధిక ప్రాధాన్య ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆమె వెల్లడించారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైనవిద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు.
ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ప్రతిరోజు ఓ అరగంట మెడిటేషన్ తో పాటు క్రీడలను నిర్వహించాలన్నారు. తద్వారా విద్యార్థులకు మేధాశక్తిని పెంపొందుతుందన్నారు. ఒత్తిడి లేకుండా విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు యోగ ఒక మంచి సాధన అని ప్రతిరోజు విద్యార్థులకు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆమె కోరారు. మన ఊరు – మన బడి పథకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289 కోట్లతో 12 రకాల మౌళిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. పాఠశాల విద్యలో విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని వసతులు కల్పిస్తుందన్నారు జెడ్పీ ఛైర్ పర్సన్.
ఇలా అన్ని సౌకర్యాలు కల్పించడంతో ఉపాధ్యాయులు కూడా ప్రశాంత వాతావరణంలో పాఠాలు బోధించే అవకాశం కలిగిందని జెడ్పీ ఛైర్ పర్సన్ చెప్పారు. గ్రామాలలోని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన చేపట్టి, దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool