(N.Naveen Kumar,News18,Nagarkurnool)
కర్ణాటక(Karnataka)రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని గద్వాల (Gadwal) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)రాష్ట్రంలోని నంద్యాల(Nandyala)జిల్లా డోన్ మండలం వెంకటాపురానికి చెందిన బోయ రామాంజనేయులు (Boya Ramanjaneyulu) ...కర్ణాటకలోని రాయచూర్(Raichur)నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి స్వగ్రామంలో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈక్రమంలో ఆదివారం(Sunday) నాడు 30 కార్టన్లలో మద్యం సీసాల(Liquor bottles)ను రామాంజనేయులు కారులో తరలిస్తుండగా ఆబ్కారీశాఖ(Excise Department) అధికారులు పట్టుకున్నారు. మద్యాన్ని, కారు(Car)ను సీజ్ చేసిన అధికారులు వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం విలువ కర్ణాటక రాష్ట్రంలో రూ. 1,20,000 ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
నిమజ్జనానికి వెళ్లిన యువకుడు దుర్మరణం:
వినాయక నిమజ్జనానికి వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట మండలం హాజీపూర్‌కు చెందిన కొందరు యువకులు వినాయక నిమజ్జనం నిమిత్తం డిండి నదికి బయలుదేరారు. చిర్రా భరత్ రెడ్డి (28) తన స్నేహితులతో కలిసి బైక్ పై వెళ్తుండగా చెన్నారం గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ప్రమాదంలో భరత్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
శిశువు మృతి:
ప్రసవించిన కొన్ని క్షణాల్లోని శిశువు కళ్ళు తెరవకముందే ప్రాణం పోయినా సంఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మరికల్ హరిజనవాడకు చెందిన కవిత ఇంటి వద్దనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని క్షణాల్లో శిశువు మృతి చెందడంతో భార్యాభర్తలు కన్నీరుమున్నీరు అయ్యారు. గర్భం దాల్చిన నాటి నుంచి తమ గ్రామ పరిధిలో ఆశా వర్కర్ కార్యకర్త లేకపోవడంతో సరైన వైద్యం అందలేదని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాలింతను చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పరిధిలోని ప్రశాంతి కాలనీ గ్రామపంచాయతీకి చెందిన ముక్కాపూరం తిరుపతమ్మ (56) అనే మహిళ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతమ్మ గత కొన్ని సంవత్సరాలుగా కల్వకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల బాలికల విద్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో వంట మనిషిగా పనిచేస్తుంది. ఆరోగ్యం సరిగా లేక గత 2 నెలలుగా ఇంటివద్దనే ఉన్న తిరుపతమ్మ శుక్రవారం విధులకు వెళ్ళింది. అయితే రెండు నెలల పాటు పనికి ఎందుకు రాలేదంటూ అధికారులు మెమో ఇవ్వడంతో శనివారం ఇంటికి చేరుకుంది. ఆదివారం ఉదయం మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై మృతురాలి కూతురు మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై విలేకరులకు తెలిపారు. విద్యాలయంలో వేదించడం వల్లనే తీవ్ర అనారోగ్యానికి గురైన తన తల్లి రెండు నెలల నుంచి వెళ్లలేకపోయిందని, సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేసి వేధించడం వల్లనే మనస్థాపానికి గురైందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana News