మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 14 పోలింగ్ కేంద్రాలలో ప్రారంభమైనది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. 14 పోలింగ్ కేంద్రాల వారిగా 1822 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లకు గాను ఉదయం 10 గంటల వరకు 350 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుండి సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఉపాధ్యాయులందరినీ కూడా ఓటు హక్కు వినియోగించేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో ఓటింగ్ నిర్వహణ అంకెల ప్రాధాన్యత ప్రకారము ఉండడంతో ఇందుకు సంబంధించి మొదటిసారిగా ఓటును వినియోగించుకునే కొంతమంది ఉపాధ్యాయులు తడబడినట్టుగా తెలుస్తుంది. ముందస్తుగా ప్రభుత్వం తరపున ఈ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ విధానాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలన్న అవగాహన కార్యక్రమం చేపట్టకపోవడం వల్ల నూతనంగా ఎమ్మెల్సీ ఓటు నమోదైన ఉపాధ్యాయులు కాస్త అయోమయానికి గురయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 1822 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం 12 గంటలకు 30 శాతం మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు కట్టుదిద్ధమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఉపాధ్యాయులు కానీ ఎన్నికల నిర్వహణ అధికారులు కానీ ఎవరైనా అస్వస్థతకు గురవుతే వెంటనే ప్రథమ చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల తర్వాత ఎండ తీవ్రత పెరగడంతో ఓటర్ల రాక కాస్త తగ్గింది. సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఓటర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఉదయ్ కుమార్ ఎస్పీ మనోహర్లు సందర్శించి పోలింగ్ విధానాన్ని పరిశీలించారు.ఏ విధంగా పోలింగ్ సర్వే జరుగుతుందని అధికారులు ఎలాంటి చర్యలు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిడ్డమైన భద్రతను ఏర్పాటు చేయాలనికలెక్టర్ ఉదయ్ అధికారులను ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana