Naveen Kumar, News18, Nagarkurnool
ఆత్మీయుల, బంధుమిత్రుల, మనసును దోచుకునే బహుమతులు ఇవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాస్త డిఫరెంట్‌గా ఉండి ఆకట్టుకునేలా ఉండే గిఫ్టుని వాళ్లకు అందించి జీవితాంతం వాళ్లకు గుర్తు ఉండిపోయేలా చేయాలని యువత ఎక్కువగా తాపత్రయపడుతుంటారు. ఈ ఆలోచనతో యువత చాలామంది మ్యాజిక్ కప్పులను గిఫ్ట్ గా అందిస్తున్నారు. మ్యాజిక్ కప్పులపై ఫొటోలను ప్రింట్ చేసి.. వారికి విషెస్ చెప్తూ అందిస్తారు. ఈ మ్యాజిక్ కప్ లో హాట్ వాటర్ పోస్తేనే ఫొటోస్ కనిపించేలా టెక్నాలజీని రూపొందించారు. వీటిని నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) కేంద్రంలోని వాసవి లేడీస్ కార్నర్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్ షాపులో విక్రయిస్తున్నారు. ఈ తరహా గిఫ్టలను యువతకు అందిస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ప్రజెంట్ ట్రెండింగ్ ఇలాంటి గిఫ్టులే నడుస్తున్నాయని షాప్ యజమాని శ్రీనివాసులు చెప్పారు.
ఈ గిఫ్ట్ లను తయారు చేయడానికి తాను హైదరాబాద్ (Hyedarabad) నుంచి ప్రత్యేకంగా ఒక మిషను తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. ఈ మిషన్ ద్వారా మనం కావాల్సిన వారి ఫొటోస్ ను కావాల్సిన డిజైన్స్‌ను కంప్యూటర్లో సెట్ చేసుకొని వాటిని ప్రింట్ తీసుకొని హీటర్ ద్వారా మ్యాజిక్ కప్ పై ప్రింట్ చేయొచ్చని తెలిపారు. వీటితోపాటు నార్మల్ కప్స్ కూడా ఉంటాయని ఈ నార్మల్ కప్‌పై ఫొటోస్ను ప్రింట్ చేస్తే ఎప్పటికీ అలానే ఉండిపోతుంది.
ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్‌ను చాలామంది యువత అడుగుతుండడం వలన తాము ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. గత మూడు సంవత్సరాలుగా ఇలాంటి గిఫ్ట్‌ను యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని షాప్ యజమాని శ్రీనివాసులు చెప్పారు. తమకు ఆర్డర్ అందించిన అరగంట సమయంలోపే మ్యాజిక్ కప్ ను తయారుచేసి అందిస్తామని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న, వాట్సాప్ లో ఆర్డర్ పెట్టిన తాము రెడీ చేసి అందిస్తామని వివరించారు.
ఒకసారి హాట్ వాటర్‌ను కప్పులో పోయగానే కప్‌పై ఉన్నటువంటి ఇమేజెస్ ఆ వేడికి కనిపిస్తాయని మళ్లీ కప్పు చల్లారిన తర్వాత కప్ యదావిధిగా నలుపు రంగులోకి మారిపోతుంది. వీటితో పాటుగా టీ షర్టుల పైన గ్లాస్‌ల పైన రకరకాల గిఫ్ట్ ఆర్టికల్ పైన తాము ఫొటోస్ను డిజైన్స్‌ను ప్రింట్ చేసి అందిస్తామని చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana