హోమ్ /వార్తలు /తెలంగాణ /

అట్లుంటది మనతోని..! కొత్త ఏడాది ఎక్కడా తగ్గని మందుబాబులు

అట్లుంటది మనతోని..! కొత్త ఏడాది ఎక్కడా తగ్గని మందుబాబులు

నాగర్ కర్నూల్ జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు

డిసెంబర్ 31 వేడుకలు అంటే మామూలుగా ఉండదని మరోసారి నిరూపించారు మందు బాబులు. ఈ వేడుకల కోసం వ్యాపారులు ఇటు మందుబాబులు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar (Mahabubnagar) | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

డిసెంబర్ 31 వేడుకలు అంటే మామూలుగా ఉండదని మరోసారి నిరూపించారు మందు బాబులు. ఈ వేడుకల కోసం వ్యాపారులు ఇటు మందుబాబులు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది రెండు రోజుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. చలి ఉన్న నేపథ్యంలో మందు బాబులు పార్టీలకు అంతే లేకుండా పోయింది. శనివారం జరిగిన డిసెంబర్ 31 వేడుకల్లో ఆదివారం జరిగిన న్యూఇయర్వేడుకల్లో మద్యం జోష్ కనిపించింది. గతంలో కంటే ఈసారి మద్యం అమ్మకాలు కొంత పెరిగాయి. మూడు బీర్లు ఆరు కోటర్లు అన్నట్టుగా మద్యం అమ్మకాలు కొనసాగాయి. ఫలితంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డిసెంబర్ 31 తో పాటు జనవరి 1 ఆదివారంతో కలిపి 40 కోట్ల 30 లక్షల రూపాయల మద్యం విక్రయించారు. అమ్మకాలు భారీగా ఉండడంతో శనివారం రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఒంటిగంట వరకు బార్లు కొనసాగాయి.

అయితే గత ఏడాది ఈసారి కంటే ఐఎంఎల్ 14% తగ్గిన ఆదాయం మాత్రం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్, జడ్చర్ల, నారాయణపేట, కొత్తకోట,గద్వాల, నాగర్కర్నూల్ లో మద్యం అమ్మకాలు అధికంగా జరిగాయి. 2022 ఏడాది డిసెంబర్ 31న శనివారం ఒకరోజు రాత్రి ఐఎంఎల్ 19.104 కేసులు, బీర్లు 12,685 కేసులుమొత్తం 17.84 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి.మహబూబ్నగర్ పట్టణంలో 3.1 కోట్ల మధ్య అమ్మకాలు తర్వాత జడ్చర్లలో 2.5 కోట్లు కల్వకుర్తిలో 1.8 కోట్లు, వనపర్తిలో 1.58 కోట్లు నారాయణపేటలో 1.34 కోట్లు నాగర్కర్నూల్ లో 1.0 కోట్లు అమ్మకాలు జరిగాయి. ఆదివారం 22.18 కోట్ల మద్యం విక్రయించారు.

ఇది చదవండి: తెలంగాణాలో ఎక్కడాలేని విదంగా సైన్స్ సెంటర్.. ఎక్కడో తెలుసా?

మద్యం డిపో నుంచి కొనుగోలు చేసిన మద్యంతో పాటు దుకాణాల్లో స్టాక్ ఉన్న మద్యం కూడా భారీ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో బార్లు మద్యం దుకాణాల్లోపెరిగిన కొనుగోలుతో కిటకిటలాడయి. ఒంటిగంట వరకు బార్లను అనుమతించేయడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి.

గత మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే 2020లో ఐఎంఎల్ 22,366,బీర్లు 1,90,130 అమ్ముడుపోగా వీటి ద్వారా 207.74 కోట్ల ఆదాయం వచ్చింది. 2021 ఏడాదిలో 2,98,154 ఐఎంఎల్ అమ్ముడుపోగా 2,46, 0 77 బీర్లు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా 241. 69 కోట్ల ఆదాయం వచ్చింది. 2022లో 2,55,087 ఐఎంఎల్ అమ్ముడు పోగా 2,79,793 బీర్లు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా 245.5 0 కోట్లు ఆదాయం లభించింది.

First published:

Tags: Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు