హోమ్ /వార్తలు /తెలంగాణ /

NagarKurnool: ఈ లిక్కర్ లో వాటర్ కలపాల్సిన పనిలేదు.. మాయగాళ్ల అతితెలివి అంతే మరి..

NagarKurnool: ఈ లిక్కర్ లో వాటర్ కలపాల్సిన పనిలేదు.. మాయగాళ్ల అతితెలివి అంతే మరి..

లిక్కర్‌ బాటిల్‌లో వాటర్‌ కలిపి అమ్ముతున్నారు.!

లిక్కర్‌ బాటిల్‌లో వాటర్‌ కలిపి అమ్ముతున్నారు.!

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఓ వైన్‌ షాపులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కల్తీ మద్యాన్ని గుర్తించారు. విచ్చలవిడిగా మద్యాన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  N.Naveen kumar, News 18, NagarKurnool


  NagarKurnool: వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఓ వైన్‌ షాపులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కల్తీ మద్యాన్ని గుర్తించారు. విచ్చలవిడిగా మద్యాన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో యదేచ్ఛగా బెల్ట్ షాపులు కొనసాగుతుండటంతో అక్కడికి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లా (vanaparthi jilla) కేంద్రం దగ్గరలో జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లో ఈ ఘటన వెలుగు చూసింది.


  కల్తీ మద్యం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో సోమవారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) నుంచి వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ చిరంజీవి ఆధ్వర్యంలో పోలీసు బృందం పెబ్బేర్‌లోని రఘు వైన్స్‌లో తనిఖీలు చేశారు. లిక్కర్‌ బాటిల్‌ ఓపెన్‌ చేసి అందులో నీళ్లు కలిపి పోసినట్లు గుర్తించారు. ఓసి 750 ఎమ్మెల్ 33, బీపీ విస్కీ 375 ml 75, ఐబీ 180 ఎంఎల్ 61, శాంపిల్‌గా తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా.. అన్నిటిలోనూ కల్తీ ఉన్నట్లు నిర్ధరించారు. దీంతో వైన్ షాప్ నిర్వాహకులు మేకల ఎల్లస్వామి, శివకుమార్లపై కేసు నమోదు చేశారు. మొత్తం సీసాలు, సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకొని కొత్తకోట ఎక్సైజ్ స్టేషన్‌లో డిపాజిట్‌ చేశారు.


  Read this also ; Nagar Kurnool: మెడికల్ కాలేజీ సరే.. మా గోడు వినరా.. సర్కార్ పై రైతుల ఫైర్.. కారణం ఇదే..!


  44 జాతీయ రహదారి మద్యాన్ని కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. పెబ్బేరు ఉమ్మడి మండలంలో మొత్తం 26 గ్రామపంచాయతీలు ఉండగా… దాదాపు 110 దాకా బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో ప్రత్యేకంగా పెద్ద దేవర పండుగలు జరుగుతుంటాయి. ఈ సమయంలో బెల్ట్ షాపుల కోసం వేలంపాట నిర్వహిస్తున్నారంటే…ఈ ప్రాంతంలో ఏ రేంజ్ లో గిరాకీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ప్రజలు ఏపీలోని కర్నూలుతో పాటు ఎక్కువ సంబంధాలు ఉంటాయి. అక్కడ మద్యం రేట్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి నుంచి అక్కడికి అక్రమంగా మద్యం తరలిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.


  Read this also ; Nagarkurnool: కోరుకున్న యువతిని పెళ్లి చేసుకున్నాడు: కానీ, పెళ్ళైన 40 రోజులకే ఊహించని ఘటన


  పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో..!
  నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని చనిపోయింది. కుమ్మర గ్రామానికి చెందిన అనురాధ (18) ఇంటర్మీడియట్ ఫెయిల్ కావడంతో ఇటీవల సప్లమెంటరీ పరీక్షలు రాసింది. ఈ సారి కూడా ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఈ నెల 16న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని (hyderabad) ఉస్మానియా (osmania) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తల్లి బంగారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  Read this also ; Nagarkurnool: తెలంగాణ రాబిన్​హుడ్​ ; పండగ సాయన్న: ఆయన చరిత్ర ఇదే..


  వివాహిత ఆత్మహత్య;

  మహబూబ్‌నగర్ జిల్లా  కేంద్రంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళ చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మార్లుకు చెందిన ఉష (23) తన భర్త ముగ్గురు పిల్లలతో సంతోషంగా ఉండేది. కానీ ఇలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఉష అన్నయ్య దాసరి రంగనాథ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Liquor, Liquor shops, Local News, Nagarkurnool, Telangana

  ఉత్తమ కథలు