హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: పేద ఖైదీలకు అండగా లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్..!

Nagar Kurnool: పేద ఖైదీలకు అండగా లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్..!

X
council

council

రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా16 కోర్టుల్లో నేడు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రారంభించుకోగా అందులో నాగర్ కర్నూల్ ఉండటం సంతోషకరమైన విషయమన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

విచారణ ఎదుర్కొంటూ జైల్లో మగ్గుతున్న ఖైదీలు, తాము క్రిమినల్ లాయర్ ను పెట్టుకోలేని స్థితిలో ఉన్న ఖైదీలు న్యాయం పొందేందుకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ను నాగర్ కర్నూల్ లో ప్రారంభించారు.ప్రయివేట్ లాయర్ ను నియమించుకొనే స్థోమత లేని ఖైదీలకు ఈ కౌన్సిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు జడ్జి ఆధ్వర్యంలో నూతన కార్యాలయాన్ని ప్రారంభించి ఈ కౌన్సిల్ సేవలు మొదలు పెట్టారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన 16 జిల్లాల్లో ఒకేసారి ఈ కార్యక్తమాన్ని ప్రారంభోత్సవం చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద నాగర్ కర్నూల్ జిల్లాలో సైతంప్రారంభం చేశారు.

నిరుపేదలకు లీగల్ సర్వీసెస్ ద్వారా ఉచితన్యాయం చేసేందుకు జాతీయ న్యాయ సేవా సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి న్యాయ సేవాధికార సంస్థలు పని చేస్తున్నప్పటికీ క్రిమినల్ కేసుల విషయంలో పేదలకు సత్వర న్యాయం జరగటం లేదనే తలంపుతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. 1987 యాక్టుప్రకారం జస్టిస్ వెంకటాచలయ్య కృషి మేరకు అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం దక్కాలనే ఉద్దేశ్యంతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కు పునాది వేసినప్పటికిని చీఫ్ జస్టిస్ యూ.యూ. లలిత్ ప్రోద్బలంతో ఇప్పుడు రాష్ట్రాలలోని జిల్లా కోర్టులలో ప్రారంభించుకోవడం జరిగింది. సత్వర న్యాయం దొరక్క, ఎవరు లేకబెయిల్ కొరకు దరఖాస్తు సైతం చేసుకొనేని క్రిమినల్ కేసుల్లో పేదవారు లీగల్ సర్వీసెస్ అథారిటీద్వారా దరఖాస్తు చేసుకుంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లో నియమితులైన అధికారులు కేసులు ఉచితంగాఈ కాన్సిల్ ద్వారా వాదిస్తారు. ఇక నుంచి ఇలాంటి కేసులకు త్వరితగతిన న్యాయం పొందేందుకు ఉపయోగపడుతుంది.

ఇప్పుడు ప్రారంభిస్తున్న 16 లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పనితీరు బాగుంటే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో ప్రారంభం కానున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రిన్సిపల్ షెషన్స్ కోర్టు జడ్జి జస్టిస్ డి.రాజేష్ బాబు మాట్లాడుతూ.. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా పబ్లిక్ ప్రసిక్యూటర్లు ఉచితంగాకేసులు వాదిస్తున్నప్పటికి వారికి ఇతరత్రా పనులు సైతం ఉన్నందున క్రిమినల్ కేసులు చాలా ఆలస్యం అవుతున్నందున జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా16 కోర్టుల్లో నేడు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రారంభించుకోగా అందులో నాగర్ కర్నూల్ ఉండటం సంతోషకరమైన విషయమన్నారు.లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కు మంచి మౌళిక సదుపాయాలు కల్పించడమే కాకుండా సీనియర్ న్యాయవాది అయిన మధుసూదన్ రావును ప్రధాన లీగల్ హెయిర్ కౌన్సిల్ గాను మరో న్యాయవాది శ్రీరామ్ ఆర్య ను డిప్యూటీ లీగల్ హెయిర్ గా నియమించడం జరిగిందన్నారు.

ఇందులో ప్రధాన లీగల్ హెయిర్ కౌన్సిల్ కు నెలకురూ. 75 వేల పారితోషికం, డిప్యూటీ లీగల్ కౌన్సిల్ కు రూ. 50 వేల పారితోషికం ఇవ్వడం జరుగుతుందన్నారు.అందువల్ల వీరు బాగా కష్టపడి పనిచేసి అత్యధిక మంది బాధితులకు న్యాయం చేయాలని తద్వారా నాగర్ కర్నూల్ జిల్లాకు మంచి పేరు రావడమే కాకుండా మిగిలిన జిల్లాల్లో సైతం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రారంభం కావడానికి దోహదపడతారని తెలియజేసారు.

దీనిని ఒక సవాలుగా తీసుకొని అంకితభావంతో పనిచేసి న్యాయం పొందలేకపోతున్న నిరుపేదలకు సత్వర న్యాయం అందేవిధంగా చూడాలని సూచించారు.నాణ్యతతో కూడినన్యాయం చేసేందుకు అంకితభావంతో కృషి చేయాలని, పేద ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా తమ విధులు నిర్వహించాలని కౌన్సిల్ కు సూచించారు. ప్రతిరోజు కోర్టుకు వచ్చి ఇతర కేసులు తీసుకోకుండా కేవలం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కేసులు మాత్రమే తీసుకొని చట్టాలను బాగా ఆకళింపు చేసుకొని పేద కక్షిదారులకు న్యాయం చేకూర్చాలని కోరారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు