హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: మెడికల్​ కాలేజీ పేరిట రైతులను నిండా ముంచిన నేతలు.. భూ నిర్వాసితుల గగ్గోలు

Nagarkurnool: మెడికల్​ కాలేజీ పేరిట రైతులను నిండా ముంచిన నేతలు.. భూ నిర్వాసితుల గగ్గోలు

నాగర్​కర్నూల్​

నాగర్​కర్నూల్​

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు సంబంధించి భూ నిర్వాసితులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. చట్టపరంగా న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని విరమించేది లేదని రైతులు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  (Naveen Kumar, News18, Nagarkurnool)

  నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు (Medical College) సంబంధించి భూ నిర్వాసితులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. చట్టపరంగా న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని విరమించేది లేదని రైతులు (Farmers) ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు సైతం రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే సీపీఎం (CPM) రాష్ట్ర సమితి రైతు సంఘం నాయకులు సాగర్.. బాధితులను పరామర్శించి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మెడికల్ కళాశాలకు భూములు ఇచ్చిన రైతులు ఉయ్యాలవాడ వార్డులోని టిఆర్ఎస్ (TRS) నాయకుడు ఇంటిని ముట్టడించడం చర్చనీయాంశంగా మారింది. తమను మోసం చేసి భూములు లాక్కున్నారని, తమ భూములు తమకు కావాలని బాధితులు ఆందోళన చేపట్టారు. ఉయ్యాలవాడ పరిధిలోని తమ భూములను సొంతంగా అభివృద్ధి చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాస్టర్ ప్లాన్ వేశారని బాధితులు వాపోతున్నారు.

  తమ భూములకు సమీపంలో మెడికల్ కళాశాలను నిర్మిస్తే ఇక్కడి భూముల (land) ధరలకు రెక్కలు వస్తాయని, కొందరు అధికార పార్టీ నేతలు కుమ్మక్కై భవన నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా అధికారులు రాజకీయ పార్టీలు ఆడిన ఆటలో అమాయకులైన నిరుపేదలు బలయ్యారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల వస్తే నాగర్‌కర్నూల్ నియోజకవర్గం అభివృద్ధి చెందడంతో పాటు తనకు ఓటు బ్యాంకు పెరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆశపడి, ఉన్నతాధికారులు...ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (CM KCR) తన పరపతిని ఉపయోగించి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలను మంజూరు చేయించారనేది స్థానికంగా ప్రచారంలో ఉన్న ఆరోపణ.

  దళిత రైతుల భూములను ఎరగా వాడుకున్నారని..

  అందుకు అనువైన ప్రదేశాన్ని మేము ఇస్తామంటూ ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో మార్కులు కొట్టేసి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆలోచించారని ఇందుకు ఆ గ్రామంలోని దళిత రైతుల భూములను ఎరగా వాడుకున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. ఉయ్యాలవాడ శివారులోని 36 ఎకరాల్లో 33 మందికి చెందిన పట్టా భూమి ఇస్తున్నట్లు ఒప్పించారు. స్వచ్ఛందంగా భూములు ప్రభుత్వానికి ఇవ్వడంతో నష్టపరిహారం ఇచ్చే అవకాశం లేకుండా పోయింది.

  భూనిర్వాసితులకు ఆశ చూపి..

  దీంతో ఉయ్యాలవాడ ప్రాంత శివారులోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా డబ్బులు పోగేసి బాధిత రైతులకు ఎకరాకు రూ.6 లక్షల చొప్పున ముట్టజెప్పి వారిని బలవంతంగా మెడికల్ కళాశాలకు భూములు ఇస్తున్నట్టుగా ఒప్పించారు. ఇందుకు ప్రతిఫలంగా ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న భూమిలో ప్రతి కుటుంబానికి రెండు వందల గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి మెడికల్ కళాశాలలో ఉద్యోగం, దళిత బంధు, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు భూనిర్వాసితులకు ఇస్తామని ఆశ చూపారు.

  Ganesh Chaturthi 2022: ఇదెక్కడి దొంగతనంరా బాబు.. చిన్నారులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం చోరి

  ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఓ టీఆర్‌ఎస్ నాయకుడు తమను మోసం చేశాడని రైతులు ఆందోళన చేపట్టారు. తమ భూములకు డబ్బులు చెల్లించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా పోగుచేసిన రూ.3 కోట్ల 70 లక్షల నగదులో నిర్వాసితులకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి రైతుల చెవిలో పడడంతో నిండా మోసపోయామని ఆగ్రహించారు. అయితే ప్రభుత్వం నుండి కూడా పెద్ద మొత్తంలో నష్టపరిహారం అందే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలైన బీఎస్పీ, సీపీఎం నాయకులు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు.

  మెడికల్ కళాశాల ఎదుట టెంట్ వేసి నిరసన చేపట్టారు. భూములు తీసుకున్న వ్యక్తులు ఇక రైతులకు చెక్కులు ఇచ్చేందుకు ముందుకు వస్తారని పొలిటికల్ పార్టీలు తమ వ్యూహాన్ని ప్రదర్శించాయి. ఇందులో కొంతమంది వివిధ పార్టీల నాయకులను కలిసి తమ గోడును వెలుపోసుకోవడంతో అధికాస్త రాజకీయ రంగు పులుపుకొని విషయం పెద్దదయింది. రైతులు ఆందోళన చేపడుతుండగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని నిర్బంధించి అరెస్టులు చేశారు.

  Bhadradri Kothagudem: ఈ శతాబ్దంలోనే అద్భుత కట్టడం: భద్రాద్రిలోని మిథిలా స్టేడియం

  కేంద్ర ప్రభుత్వాలు నూతనంగా మంజూరు చేసిన మెడికల్ కళాశాలను నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి తీసుకురావడంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ లబ్దికోసం అమాయక దళితులను నవ్వులపాలు చేశారని దళిత సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. భూసేకరణలో భూముల కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడలో భారీ మొత్తంలో డబ్బులు సేకరించి రైతుల పేరుతో కోట్ల రూపాయలను మింగేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  ప్రభుత్వ పరంగా తమ భూములు తీసుకుంటే సంతోషించేవారని, అనవసరంగా అనామకుడి చేతిలో నిండా మోసపోయామని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనకు వివిధ రాష్ట్ర పార్టీలు మద్దతును ప్రకటిస్తున్నాయి. బీఎస్పీ పార్టీతో పాటు రాష్ట్ర సీపీఎం నాయకులు, రైతు సంఘం నాయకులు బాధితులకు అండగా నిలిచారు. బాధితుల పక్షాన పోరాడి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా అందించారు. రైతులకు న్యాయం జరిగే వరకు కోర్టు ద్వారా పోరాటం చేస్తామని ప్రకటించారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Farmers, Land dispute, Local News, Medical college, Nagarkurnool

  ఉత్తమ కథలు