రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడైన గురునాథ్ రెడ్డిని కలవడం ఒకసారిగా కొడంగల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గురునాథ్ రెడ్డి గతంలో వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు షర్మిలను కలవడం, విజయముతో భేటీ కావడం ఆ పార్టీలో మారబోతున్నారని చాలావరకు ప్రచారం జరిగింది.
తాజాగా రేవంత్ రెడ్డిని హాత్సే హాత్ కార్యక్రమంలో కలవడం చర్చనీయంగా మారింది.రాజకీయంగా బద్ధ శత్రువులైన రేవంత్ రెడ్డిని గురునాథ్ రెడ్డి స్వయంగా వెళ్లి కలిశాడు. దీంతో రాజకీయం ఎటువైపుగా వెళుతున్నానని ఆయన అనుచరులు సందిగ్ధంలో పడ్డారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలు దొర అని పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ నేత గురునాథరెడ్డి వ్యవహారం ఆ నియోజకవర్గంలో కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తుంది. ఆయన దారేటో తెలుసుకోలేని సందిగ్ధంలో పడ్డారు.
షర్మిలను కలవడంతోకొడంగల్ నియోజకవర్గం నుంచి గురునాథ్ రెడ్డి లేదా ఆయాన కుమారుడు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం గతంలో జరిగింది. ఆ వెంటనే అధికార బీఆర్ఎస్ నేతలు రంగప్రవేశం చేయడంతో విజయమ్మను, షర్మిలను వారి కుటుంబపై ఉన్నఅభిమానం కారణంగానే కలిశానని, పాదయాత్ర సందర్భంగా షర్మిలకు స్వాగతం పలికానని, తాను పార్టీ మారడం లేదని మీడియాకు వెల్లడించారు. కానీ అధికార పార్టీ నేతలు తనకు ఇచ్చిన హామీ మేరకు పదవి ఇవ్వకపోవడంతో గుర్నాథ్ రెడ్డి అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.
సరైనసమయం కోసం వేచి చూస్తున్నారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు పలు ముఖ్య నాయకులు ఆయనను స్వయంగా కలిసి చర్చలు జరపడంతో ఆయనలో అసంతృప్తి ఉన్నప్పటికీ ఇదే పార్టీలో కొనసాగుతారని భావిస్తున్న తరుణంలో హాత్ సే హాత్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డిని కలవడంమళ్లీ రాజకీయ చర్చలకు దారితీసింది.
ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి మధ్య మాటల యుద్ధాలు కొనసాగాయి. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ఇలా గురునాథ్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలవడం ఇది కలా నిజమా అని కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యానికి గురికావాల్సి వచ్చింది. ఇరువురు నేతలు కొంతసేపు మాట్లాడుకోవడం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో గురించి రాజకీయ వర్గాల చర్చించుకోవడం జరిగింది.
వచ్చే ఎన్నికల్లో గుర్నాథ్ రెడ్డి లేదా అతడి కుమారులు ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. వయోభారంతో గురునాథ్ రెడ్డి పోటీలో ఉండకపోవచ్చని అంటున్నారు. నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుర్నాథ్ రెడ్డి ఇప్పటికీ 20 నుంచి 25 వేల వరకు ఓట్లు బ్యాంకు ఉంటుంది. ఇటువంటి తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్న గురునాథ్ రెడ్డి పార్టీ మారుతారా లేక ఉన్న పార్టీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ విషయాన్ని తేల్చేందుకు త్వరలో ఆయన అనుచర వర్గం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. గురునాథ్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై ఏ పార్టీకి మేలు చేస్తుందో.. ఏ పార్టీకి హామీ చేస్తుందో త్వరలో తేలనుందని ఆయన అనుచరులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana