హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ngarkurnool: రైతులను నిలువునా ముంచుతున్న కాలువ గండ్లు.., ప్రభుత్వ వైఫల్యమా? అధికారుల తప్పిదమా?

Ngarkurnool: రైతులను నిలువునా ముంచుతున్న కాలువ గండ్లు.., ప్రభుత్వ వైఫల్యమా? అధికారుల తప్పిదమా?

రైతులను ముంచేస్తున్న కల్వకుర్తి ఎత్తిపోతల కాలువలు

రైతులను ముంచేస్తున్న కల్వకుర్తి ఎత్తిపోతల కాలువలు

నాగర్ కర్నూల్ (Nagar Kurnool) వనపర్తి జిల్లాలో రైతులకు సాగు నీరు అందించేందుకు ఉన్నటువంటి ప్రధానమైన ప్రాజెక్ట్ 'కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (Kalvakurthuy Lift Irrigation). ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి నాగర్ కర్నూల్ వనపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సాగుకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  నాగర్ కర్నూల్ (Nagar Kurnool) వనపర్తి జిల్లాలో రైతులకు సాగు నీరు అందించేందుకు ఉన్నటువంటి ప్రధానమైన ప్రాజెక్ట్ 'కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (Kalvakurthuy Lift Irrigation). ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి నాగర్ కర్నూల్ వనపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సాగుకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నారు. అయితే ఈ నీటిని సరఫరా చేసేందుకు నిర్మించినటువంటి కాలువలను పూర్తిస్థాయిలో శాశ్వత ప్రతిపాదికన నిర్మించకపోవడంతో ప్రతి వర్షకాలంలో నీరు విడుదల చేసిన ప్రతిసారి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలువలకు శాశ్వత ప్రతిపాదికన కాంక్రీట్ తో నిర్మాణం చేపట్టకపోవడం, కేవలం మట్టి కట్టలతో నిర్మాణం చేపట్టడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. నీటి ప్రవాహం అధికమై, ఉదృతంగా పారుతుండడంతో కాలువ కట్టలు తెగిపోవడం ప్రతి వర్షాకాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య.

  దీంతో కేఎల్ఐ కాలువ దిగువున పొలాలు ప్రతిసారి వందలాది ఎకరాలు నీటిలో మునిగి రైతులు నష్టపోతున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితులే తలెత్తుతున్నా అటు అధికారులుగాని ఇటు ప్రభుత్వంగాని పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు ప్రతి ఏడాది తిప్పలు తప్పడం లేదు. ఐదేళ్ల కిందట హడావిడిగా నిర్మించిన కేఎల్ఐ డీ-8 కాలువలో అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి రైతుల పాలిట శాపాలుగా మారి అన్నదాతలను ప్రతి వర్షాకాలం వెక్కిరిస్తున్నాయి. భారీ వర్షాలు వచ్చాయంటే కాలువ కట్టలు ఎక్కడిక్కడే తెగిపోయి రైతుల పొలాలను నిట్టనిలువునా ముంచుతున్నాయి.

  ఇది చదవండి: క్యూ ఆర్ కోడ్ ద్వారా షీటీమ్స్ ఫిర్యాదుల స్వీకరణ.. మహిళలకు మరింత భరోసా..

  ఈ పరిస్థితులతో రైతులతో పాటు అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి వేసవి కాలం కాలువకు అవసరమున్న చోట మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అధికారులు కాలువల పరిస్థితులను గుర్తించి మరమ్మతులు చేపట్టాలి. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక కాలువలో ఉన్న నీటికి తోడు వర్షాకాలంలో వరద నీరు తోడవడంతో అక్కడక్కడ కాలువ కట్టలపై నుంచి నీరు పొంగి పారుతుంది. దీంతో మట్టికట్టలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా కెఎల్ఐ కాలువ డి-8 దగ్గర కనిపిస్తున్నాయి.

  ఇది చదవండి: ఈ రోడ్డెక్కితే డైరెక్టుగా పైకి టికెట్ తీసుకున్నట్లే.. మంత్రిని నిలదీస్తున్న జనం..! ఎక్కడంటే..!

  నాగర్ కర్నూల్ జిల్లాలోని తుడుకుర్తి గ్రామ శివారులో ప్రారంభమయ్యే ఈ కాలువ రేవెల్లి, గోపాలపేట, వనపర్తి, పానగల్, కోడేరు మండలాల్లోని 26,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. మొత్తం 34 కిలోమీటర్ల మేర పొడవు ఉండే ఈ కాలువకు అక్కడక్కడ బ్యాంకింగ్లు డ్యూటీలు నిర్మించారు. ఎక్కువగా వీటివద్దనే మట్టి కట్టలు తెగిపోతుంటాయి. వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని చాకలపల్లి శివారులో ఉన్న బ్యాంకింగ్ వద్ద ప్రతి వర్షాకాలంలో మట్టి కట్టలు తెగుతున్నాయి. కాలువలో నీరు చివరి ఆయకట్ట వరకు చేరాలని రైతులు తూములకున్న షట్టర్లను మొత్తం తెరుస్తుంటారు. దీంతో కాలువ నీరు మట్టి కట్టల పైకి ఎక్కి పారుతుంది. వీటికి తోడు వర్షం నీరు ఉదృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఏదుట్ల, రేముద్దుల, పానగల్ ప్రాంతాల్లో నీరు ఎక్కువై కట్టల పైకి ఎక్కి పారుతుంది. ఈ పరిస్థితులను గమనించిన అధికారులు అవసరం ఉన్నచోట కట్టలపై తాత్కాలికంగా మట్టిని పోస్తున్నారు. దీంతో కాలువలో నీరు నిలవడంతో మోటార్ సాయంతో వరి పొలాలకు రైతులు నీరు సరఫరా చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెకెందుకు కాలువలను పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.

  రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాము: మధుసూదన్ రావు, ఈఈ నీటిపారుదల శాఖ

  వనపర్తి పరిధిలో కాలువ సమస్యపై అధికారులు స్పందిస్తూ భారీ వర్షాలకు కాలువల నీరు ఎక్కువగా పారాడంతో కట్టలు తెగిపోతున్నాయని, వేసవిలో అవసరం ఉన్నచోట మరమ్మత్తులు చేయమని గుత్తేదారులను కోరితే స్పందించలేదని అంటున్నారు. ఇప్పుడు కట్టలు బలహీనంగా ఉన్నచోట ఎత్తు తక్కువగా ఉన్నచోట మట్టి పోయించి కొంత నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు వివరించారు. స్వయంగా వెళ్లి పరిస్థితి పరిశీలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని నీటిపారుదలశాఖ ఈఈ మధుసూదన్ రావు తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagarkarnol district, Telangana

  ఉత్తమ కథలు