హోమ్ /వార్తలు /తెలంగాణ /

టీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరంగా మారిన జూపల్లి కార్యాచరణ

టీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికరంగా మారిన జూపల్లి కార్యాచరణ

jupalli

jupalli

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అడుగులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కొల్లాపూర్ నియోజక వర్గం తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జూపల్లి కృష్ణారావు తనదైన శైలిలో రాజకీయ పావులు కలుపుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. జూపల్లి కృష్ణారావు నాలుగేళ్లుగా కార్యకర్తలను కాపాడుకుంటూ రాజకీయాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో సిట్టింగ్ లకే సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో జూపల్లికి చెందిన కార్యకర్తల్లో అలజడి మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తల ఒత్తిడి మేరకుతన వ్యూహ రచనను అమలు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

(N.Naveen Kumar, News18, Nagarkurnool)

ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అడుగులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కొల్లాపూర్ నియోజక వర్గం తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జూపల్లి కృష్ణారావు తనదైన శైలిలో రాజకీయ పావులు కలుపుతున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. జూపల్లి కృష్ణారావు నాలుగేళ్లుగా కార్యకర్తలను కాపాడుకుంటూ రాజకీయాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో సిట్టింగ్ లకే సీట్లు కేటాయిస్తామని ప్రకటించిన నేపథ్యంలో జూపల్లికి చెందిన కార్యకర్తల్లో అలజడి మొదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్యకర్తల ఒత్తిడి మేరకుతన వ్యూహ రచనను అమలు చేస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలనే ఆలోచనలతో కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉండబోతుందని చర్చలు కొనసాగుతున్నాయి. తొలిసారిగా అచ్చంపేట నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై ఆరోపణలను చేశారు. ఉద్యమ ద్రోహులు అందలమెక్కారని, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ పథకాలు దళితులకే లాభం చేకూరుతున్నాయని వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వేడి రగులుతుంది. ఇలాంటి వ్యాఖ్యలతో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు అందిస్తున్నారు.ఈ కార్యక్రమాలతో జూపల్లి కృష్ణారావు పయనం ఎటువైపుగా కొనసాగుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

మరో ప్రస్థానం పేరుతో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహిస్తూ కొత్త రాజకీయ సమీకరణాలు తెర లేపారు. అచ్చంపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయన తెలంగాణ ఆత్మగౌరవం ఉద్యమకారులకు దక్కని అవకాశాలపై గల మెత్తారు. ఉద్యమకారులను వేధిస్తున్నారని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న సమస్యలను వివరించేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఉద్యమకారులు ఆత్మగౌరవం గల కార్యకర్తలు సమావేశం నిర్వహించి తనను ఆహ్వానిస్తే వెళ్తున్నానని చెప్తున్నారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు పోరాటం చేసి వారిని అండగా ఉంటానని మాజీ మంత్రి తేల్చి చెప్పడం రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది. ఈ ఆత్మీయ సమ్మేళనాలు మున్ముందు పాలమూరు జిల్లాలో పునరేకీకరణకకు దారితీస్తాయని చర్చ నడుస్తుంది. ఆత్మీయ సమ్మేళనాలకు హాజర అవ్వాలన్నా జూపల్లి కృష్ణారావు నిర్ణయం రాజకీయంగా ఉమ్మడి జిల్లా పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆయనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనుచరులు ఏర్పాటు కావడంతో పాటు దాదాపు అన్ని గ్రామాల్లో ఆయనకుబలమైన అనుచరులు ఉన్నారు. వారంతా జూపల్లి తీసుకుంటున్న కార్యచరణపై దృష్టి సాధించారు. మరో ప్రస్థానం పేరుతో ఉమ్మడి జిల్లా సమస్యలు ఉద్యమకారులపై వేధింపులు ఆత్మగౌరవం కోసం యాత్ర చేపట్టాలని అనుచరుల నుంచి సూచనలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇతర నియోజకవర్గంలోని ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టి వేదికల ద్వారా బలమైన వాయిస్ వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతోఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే బీజేపీకి చెందిన కేంద్ర నాయకులతో పాటు కాంగ్రెస్ అగ్ర నేతలు జూపల్లికి టచ్ లో ఉన్నారని..అయితే ఆయన ఎటూ తేల్చుకుని పరిస్థితుల్లో బెరీజు వేస్తూ స్వాతంత్య్రంగా కార్యక్రమాలు చేపట్టడం ఆసక్తి కలిగిస్తుంది.

4 నెలల క్రితం కొల్లాపూర్ పర్యటనకు వచ్చిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూపల్లి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపి పార్టీలో క్రియాశీలకంగా కావాలని సూచించారు. ఈ భేటీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్లీ యధావిధిగా ఇరు వర్గాల కార్యచరణ వాదోపవాదాలతో సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో వచ్చిన పరిణామాలు అనంతరం జరిగిన టిఆర్ఎస్ వితృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్లు అని ప్రకటించడంతో జూపల్లి వర్గంలో ఆందోళన రేగింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనాలకు తీర తీశారు. అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో సంతృప్తితో మరో వారంలోపే నియోజకవర్గంలో మరో ప్రస్థానం, ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. ఈ కార్యక్రమాల తర్వాత భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని జూపల్లి వర్గీయులు చెప్తున్నారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Telangana

ఉత్తమ కథలు