రిపోర్టర్ : నవీన్ నాగిళ్ల
లొకేషన్ : అలంపూర్
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ ఆలయ రూపురేఖలు మారబోతున్నాయి. పురాతన కట్టడాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రసాద్ స్కీం పథకం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులతో అలంపూర్ అగ్రగామిగా నిలవనుంది. ఈ స్కీం కింద రూ.37 కోట్ల రూపాయలను మంజూరు చేయగా తొలివిడత పనుల్లో భాగంగా పర్యాటకుల కోసం రూ.20 కోట్ల 81 లక్షలతో అదునూతనమైన మూడంతస్తుల భవనం, మినీ బస్టాండ్, ఆలయాలకు ప్రహరీ, అప్రోచ్ రోడ్, విద్యుత్ దీపాలు, సీసీ కెమెరాలు, బోర్డ్ సౌకర్యం వంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
TS News: రిజిస్ట్రేషన్ చేలేదా.. పెట్రోల్ పోసి చంపేస్తాం.. ఎమ్మార్వోకి బెదిరింపులు
అయితే స్థానికంగా ఈ పనులకు ఆది నుంచి తరచూ ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేబీసీ కంపెనీ వారు పనులు శరవేగంగా చేపడుతున్నారు. భవన నిర్మాణం కోసం 1200 ఫీట్ల లోతులో రెండుసార్లు బోర్ వేసినా చుక్కనీరు పడకపోవడంతో సమీపంలోని తుంగభద్ర నదిలో మోటర్లు వేసి నీటిని తీసుకొని అతి కష్టం మీద పనులు చేస్తున్నారు. అనంతరం మిషిన్ భగీరథ నీటిపై ఆధారపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం 3.5 ఎకరాల స్థలంలో భక్తుల సౌకర్యం కోసం మూడు అంతస్తుల భవనం, తుంగభద్ర బ్రిడ్జి వద్ద 5.2 ఎకరాల్లో మినీ బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే 80% మేర జరిగిన ఈ పనులు మే నెలలో మొదటి వారంలో పూర్తవుతాయని పర్యాటకశాఖ డిఈ ధనరాజ్ తెలిపారు. ఈ భవనంలో ఫస్ట్ పేజ్ లో 500 మంది కూర్చొని చూసే విధంగా థియేటర్ నిర్మాణం, ప్రధాన భవనం గ్రౌండ్ ఫ్లోర్లో విషయాలమైన వంటగది, అన్నదాన సత్రం, డైనింగ్ హాల్, ఫుడ్ కోర్ట్, టికెట్ కౌంటర్, ఎంట్రెన్స్ లాబీ ఫోయర్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మూడు లిఫ్టులు, అలాగే తూర్పు దక్షిణ ఉత్తర వైపు విశాలమైన మెట్లు నిర్మించారు.
మొదటి అంతస్తులో ఈ ప్రాంత ప్రాముఖ్యతను చాటే విధంగా ఎగ్జిబిషన్ గ్యాలరీ, మల్టీమీడియా కళ్యాణ మండపం, డైనింగ్ హాల్ వాటికి అనుగుణంగా కార్యాలయంలో రెండో అంతస్తులు ఎల్ ఆకారంలో 19 మినీ డీలక్స్ రూములు నిర్మించారు. ఇందులో బస చేసే భక్తులకు నదీతీర ప్రకృతి అందాలు, ఆలయం కనిపించేలా భవనాన్ని తీర్చిదిద్దారు. మినీ బస్టాండ్ కల్వర్టు బిల్డింగ్ నుంచి నరసింహస్వామి ఆలయం మీదుగా పుష్కర ఘాట్ వరకు వెళ్లేందుకు వీలుగా అప్రోచ్ రోడ్డు చేపట్టారు. ఇక పక్కనే నది ఉన్నా, అందులో ఇసుక ఉన్నా వాటికి అనుమతులు రాక పనుల్లో ఆలస్యమైంది. సంగమేశ్వర ఆలయం నుంచి 120 ఫీట్ల మీద మెయిన్ రోడ్డుకు కేటాయించాల్సిన అప్రోచ్ రోడ్లో ప్రవేట్ భవనాలు ఉండడంతో పనులు నిలిచిపోయాయి. అలాగే తుంగభద్ర బ్రిడ్జి వద్ద 4.2 ఎకరాల్లో చేపట్టాల్సిన మినీ బస్ డిపో కోసం పునాదులు తీయగానే అవి తమ స్థలాలంటూ స్థానికులు అడ్డుకున్నారు. ఆస్థానంలో నదిలోని పొలాలకు నీటి పైపులు వేసుకున్న రైతులు సైతం అభ్యంతరాలు చెబుతున్నారని అధికారులు చెబుతున్నారు. మినీ బస్ డిపో దగ్గర హై వోల్టేజ్ విద్యుత్ తీగలు వెళ్లడంతో డిజైన్ మరోసారి మార్పులు చేశారు.
ఇక మినీ బస్ డిపో నుంచి బిల్డింగ్ నరసింహస్వామి ఆలయాలను కలుపుతూ పుష్కర ఘాట్ వరకు రావలసిన రోడ్డు ఆక్రమణకు గురికావడంతో పనులు నిలిచిపోయాయి. అలాగే నవబ్రహ్మ ఆలయం వద్ద ప్రహరీ నిర్మాణాన్ని సైతం తమకు పరిహారం చెల్లించాలంటూ స్థానికులు అడ్డుకుంటున్నారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ ఆలయ అభివృద్ధి పనులు చేపట్టే విధంగా అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. పనులు పూర్తయితే తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం జోగులాంబ ఆలయం వైభవం మరింత పెరుగనుంది. భక్తుల తాకిడి ఊహించని రీతిలో ఉండే అవకాశం ఉంటుందని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana