హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: దర్జాగా హైవేపైనే స్మగ్లింగ్.. మరి పోలీసులు ఊరుకుంటారా..?

Nagarkurnool: దర్జాగా హైవేపైనే స్మగ్లింగ్.. మరి పోలీసులు ఊరుకుంటారా..?

గద్వాలలో అక్రమ మద్యం పట్టివేత

గద్వాలలో అక్రమ మద్యం పట్టివేత

కర్ణాటక (Karnataka) రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు బలిగెర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇది గమనించిన ముగ్గురు వ్యక్తులు తప్పించుకునే క్రమంలో గూడ్స్ ట్రాలీ వాహనాన్ని కర్ణాటక సరిహద్దుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Gadwal, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వాహనాన్ని జోగులంబ గద్వాల జిల్లా (Gadwala District) పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఇన్చార్జ్ ఎక్సైజ్ సూపర్డెంట్ సైదులు తెలిపిన వివరాలు మేరకు కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు బలిగెర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇది గమనించిన ముగ్గురు వ్యక్తులు తప్పించుకునే క్రమంలో గూడ్స్ ట్రాలీ వాహనాన్ని కర్ణాటక సరిహద్దుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే సిబ్బంది వెంబడించి వాహనాన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అందులో 40 కాటన్ల ఓసి (90 ఎం.ఎల్) పెట్రా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలం తమ్మిళ్ళ గ్రామానికి చెందిన నరేష్, వేణుగోపాల్, తిరుమలేష్‌గా గుర్తించారు.

  ముందుగా బైక్ పై ఎస్కార్ట్ గా వస్తున్న వేణుగోపాల్, తిరుమల్లేష్ తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. గూడ్స్ వాహనం డ్రైవర్ను విచారించగా కర్నాటక నుంచి ఏపీలోని కర్నూలు జిల్లాకు మద్యం తరలిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తప్పించుకున్న ఇద్దరిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టుగా తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 1.50 లక్షలుగా ఉందని, దీన్ని ఎక్కువ రేటుకు అమ్మకుని సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు పేర్కొన్నారు.

  ఇది చదవండి: కొడుక్కి మంచి చెప్పిన ఓ తండ్రికి దక్కిన బహుమానం.., పట్టుమని 18ఏళ్లు లేవు.. ఎంతపని చేశావురా..!

  మహిళ గొంతుకోసి వ్యక్తి ఆత్మహత్య

  వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళపై దాడి చేసి ఆపై రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాదపల్లిలో నివాసముంటున్న ఓ మహిళతో, శ్రీశైలం (30) వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇటీవల శ్రీశైలం మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇక నుంచి తన వద్దకు రావద్దని ఎవరి జీవితం వాళ్లు చూసుకోవాలని మహిళ చెప్పడంతో ఆగ్రహించిన శ్రీశైలం...కత్తితో ఆమె పై దాడి చేసి గొంతు కోశాడు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తే అందరికి తెలుస్తుందని భావించిన శ్రీశైలం అక్కడి నుండి పరారయ్యాడు.

  అనంతరం రైల్వే పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు భావిస్తున్నారు. శ్రీశైలం బాదేపల్లిలో పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీశైలంకు భార్య నాగజ్యోతి, తల్లిదండ్రులు ఉన్నారు. కాగా మహిళ గొంతు కోసిన ఘటనకు సంబంధించి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. శ్రీశైలం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే ఎస్సై సయ్యద్ అక్బర్ చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Jogulamba gadwal, Local News, Telangana

  ఉత్తమ కథలు