హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: ఆందోళనకరంగా ఈ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు: 10 నెలలు, 138 ప్రమాదాలు, 141 మంది మృతి

Nagarkurnool: ఆందోళనకరంగా ఈ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు: 10 నెలలు, 138 ప్రమాదాలు, 141 మంది మృతి

రోడ్డు ప్రమాద ఘటనలు

రోడ్డు ప్రమాద ఘటనలు

Telangana: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 138 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 141 మంది మృతి చెందడం జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీవ్రతకు అద్దం పడుతుంది. 2020లో 181 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 197 మంది మృతి చెందారు. 2021లో 108 రోడ్డు ప్రమాదాలు జరగగా 205 మంది మృతి

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Naveen Kumar, News18, Nagarkurnool.

రోడ్డు ప్రమాదాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. రహదారిపై ప్రయాణించేటప్పుడు మనం నిబంధనల ప్రకారం ఎంతో జాగ్రత్తగా ప్రయాణిస్తున్నా ఒక్కోసారి ఎదుటివారి తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటితో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, ఎలాంటి శిక్షణ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలవల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 138 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 141 మంది మృతి చెందడం జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీవ్రతకు అద్దం పడుతుంది.

2020లో 181 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 197 మంది మృతి చెందారు. 2021లో 108 రోడ్డు ప్రమాదాలు జరగగా 205 మంది మృతి చెందినట్లు గణాంకాల ద్వారా తెలుస్తుంది. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, స్వచ్చంద సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించి రహదారి రక్షణలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త నిబంధనలను అమలు చేస్తుంది.

రోడ్లపై ప్రత్యేక సూచనలు ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదాల నివారణ కోసం పోలీసులు, రవాణా శాఖ పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.దీంతో పాటు మోటార్ వాహన నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠిన చర్యలు చేపట్టనున్నారు. జిల్లా పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, చారగొండ మండలాల్లోని జాతీయ రహదారితో పాటు అచ్చంపేట మండలంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డేంజర్ స్పాట్లను అధికారులు గుర్తించి అక్కడ పోలీసు, రవాణా శాఖ అధికారులతో తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను చేరవేసే ప్రైవేటు వాహనాలను కట్టడి చేసి వారికి అవగాహన కల్పించడంతోపాటు జరిమానాలు విధిస్తున్నారు.

జిల్లాలోని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కలెక్టర్ ఉదయ్ కుమార్ అధ్యక్షుతన జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్పీ తో పాటు జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లా రవాణా శాఖ అధికారి రోడ్డు భవనాలు పంచాయతీరాజ్ ఇంజనీర్లు జిల్లా వైద్యాధికారి ఆర్టీసీ డిపో మేనేజర్లు సభ్యులుగా ఉన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పలు నిర్ణయాలను తీసుకున్నారు. నిత్యం ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించి సూచి బోర్డులను అవసరమైన చోట్ల స్టాపర్లను ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదాలను మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రధాన రహదారి నుంచి గ్రామాల్లోకి రోడ్లు దాటే సందర్భంలో లేక గ్రామాల నుంచి వేగంగా వస్తున్న ప్రధాన రహదారిపైకి వచ్చే సందర్భంలో ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Viral video: ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ .. ఏ రేంజ్‌లో జరిగిందో ఈవీడియో చూడండి

ఈ నేపథ్యంలో ప్రయాణ ప్రమాదాల నివారణ కోసం రోడ్ క్రాసింగ్ దగ్గర వేగాన్ని నిరోధించేందుకు వేగ నియంత్రణలు ఏర్పాట్లు చేస్తున్నారు. వేగం తగ్గించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నియంత్రించ వచ్చు. సేఫ్ ఎస్ ఆకారంలో ఉన్న రహదారిపై స్ప్రింగ్ పోల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో నిత్యం రద్దీగా ఉండే కల్వకుర్తి హైదరాబాద్ , నాగర్‌కర్నూల్ అచ్చంపేట, శ్రీశైలం, ఘాట్ రోడ్లతో పాటు నియోజకవర్గాల వారిగా ప్రాంతాలను గుర్తించి వాటిలో స్ప్రింగ్స్ పోల్స్‌ను ఒకవైపు స్టాపర్లను మరోవైపు ఏర్పాటు చేశారు. వీటితోపాటు వేగ నిర్దారణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ డ్రైవింగ్ చేయాలనీ, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అధికారులు సూచిస్తున్నారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Road accident, Telangana

ఉత్తమ కథలు