Home /News /telangana /

NAGAR KURNOOL INCREASING DEATHS DUE TO ELECTRIC SHOCK IN NAGARKURNOOL DISTRICT ABH BRV NNK

Nagarkurnool: ప్రాణాలు తీస్తున్న కరెంట్: వ్యవసాయ బోర్ల వద్ద యమపాశాలుగా విద్యుత్ వైర్లు

రైతు ప్రతాప్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

రైతు ప్రతాప్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఐదుగురు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్ వైర్లు తగలడంతో రైతులు ప్రమాదాల భారిన పడుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India
  (N.Naveen Kumar, News 18, NagarKurnool)

  ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఐదుగురు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. వ్యవసాయ బోర్ల వద్ద విద్యుత్ వైర్లు తగలడంతో రైతులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లలో విద్యుత్ షాక్ గురై 320 మంది చనిపోయినట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. ఇందులో సగానికి పైగా విద్యుత్ ప్రమాదాలు వర్షాకాలంలో జరిగాయని అధికారులు చెబుతున్నారు.

  రైతులు జాగ్రత్తగా ఉంటేనే: వర్షాలు కురుస్తుండటంతో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాకాల సీజన్లో ఈదురుగాలకు ఎక్కువగా విద్యుత్ వైర్లు తెగిపోతుంటాయి. ఈ తీగలను చూసుకోకుండా తాకడంతో ప్రమాదాలు చోటుచేసుకుని చనిపోతున్నారు. పొలంలో బోర్ల దగ్గర, బావి మోటార్ వద్ద, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కరెంట్ వైర్లు నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో విద్యుత్ షాక్ గురై రైతులు చనిపోతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉప్పునుతల, నాగర్‌కర్నూల్ మండలంలో విద్యుత్ షాక్ గురై ఈ సీజన్లో ఇద్దరు రైతులు మృతి చెందారు. గగ్గలపల్లి గ్రామంకి చెందిన రైతు ప్రతాపరెడ్డి పొలంలో మీటర్ దగ్గర మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో మరణించాడు. గత నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో పదికి పైగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రమాదాల్లో పశువులు కూడా మరణించాయి.

  విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: విద్యుత్ నియంత్రికల్లో స్విచ్చులు పాడై, తీగలు తెగిపోతుంటాయి. వీటిని రైతులే మరమ్మత్తులు చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక లైన్‌మాన్‌కు సమాచారం ఇచ్చి వారి ద్వారానే మరమ్మత్తులు చేయాలి.

  -పొలానికి నీరు పెట్టే సమయంలో స్మార్ట్ మోటార్లకు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. రైతులు మోటార్ ఆన్ చేయడానికి వెళ్లిన సమయంలో స్టార్టర్ డబ్బాకు ఎక్కడైనా తీగలు తగులుతున్నాయా?, ఇనుప పైపులపై ఎక్కడైనా తీగలు ఆనుకుని ఉన్నాయా? అనే విషయాన్ని గమనించాలి. అనుమానం వస్తే కనెక్షన్ నిలిపివేసి వాటిని తొలగించాలి.

  -ఐఎస్ఐ మార్కున్న మోటార్లను మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా కరెంట్ నియంత్రణ సరిగా ఉండి ప్రమాదం జరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. పొలాల వద్ద ఓటింగ్ తప్పనిసరిగా చూసుకోవాలి.

  -ఇండ్ల వద్ద దుస్తుల ఆరేసుకోవడానికి ఏర్పాటు చేసిన తీగల ద్వారా, మోటార్ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పాతకాలం ఇళ్లకు ఎర్తింగ్ లేకపోవడం వల్ల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ క్రమంలో ప్రాణాపాయం తలెత్తుతుంది.

  - రేకుల ఇళ్లలో విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వర్షం పడుతున్న సమయంలో స్విచ్ తడిగా ఉన్నాయో ఒకసారి పరిశీలించాలి, తడిగా అనిపిస్తే వాటిని తాకరదు. చేతులు తడిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను విద్యుత్ సంబంధించిన వస్తువులను ముట్టుకోకూడదు.

  - ఇంటి బయట లేదా మిద్దె పైనా దుస్తుల ఆరేయడానికి కొన్ని ప్రాంతాల్లో జే వైర్ ఉపయోగిస్తారు. వాటిని విద్యుత్ స్తంభాలకుగాని, స్టే వైర్లకుగాని కట్టకూడదు.ఎక్కడైనా ధ్వంసమైన రేకులకు విద్యుత్ తీగలు తగులుతున్నాయో తరచు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి.

  - ఇంటిలో కరెంటు వైరింగ్ పనులను అర్హత, అనుభవం ఉన్న టెక్నీషియన్ ద్వారానే చేయించాలి.

  ప్రమాదాలు జరగకుండా అవగాహన కల్పిస్తున్నాం: డీఈఈ, సురేందర్ రెడ్డి
  వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే విద్యుత్ శాఖ ఇంజనీర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు విద్యుత్ అధికారి సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఫీడర్ల వద్ద దృష్టి పెట్టాలని సూచించామని, గ్రామాల్లో వ్యవసాయ బోర్ల దగ్గర విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించినట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. రైతులు స్వయంగా కరెంట్ మరమ్మతులను చేసుకోరాదని, తప్పనిసరిగా లైన్ మెన్‌కు సమాచారం అందించాలని వారు సూచిస్తున్నారు. డీఈఈ, సురేందర్ రెడ్డి: 9440813420
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు