రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వనపర్తి జిల్లాలో రాజకీయ పరంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలుబిజెపి నాయకులతోటచ్ లో ఉన్నారని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలో అలర్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటలీజెన్స్ శాఖను ఉపయోగించుకొని సొంత పార్టీ నేతలపై నిఘా ఉంచారు.
ఎన్నికల నాటికిగ్రామస్థాయి నుంచి ఏ నాయకులు ఇతర పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నాయి.. ఎవరి బలాలు ఎంత, వారు పార్టీని వీడిపోతే ఏ మేరకు నష్టం చేకూరుతుందనే అంశాలను తెలుసుకునేందుకు అధికార పార్టీ నాయకులు ఇంటలీజెన్స్ వ్యవస్థను వినియోగించుకుంటున్నారు. అయితే సొంత అవసరాల కోసం ఇంటలిజెన్స్ శాఖనువినియోగించుకోవడంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
వనపర్తి జిల్లాలోని వనపర్తి, దేవరకద్ర, మక్తల్, కొల్లాపూర్, నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై మండల స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు 10 రోజులుగా ఆరాతీస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతల బలాలను బలహీనతలను అంచనా వేస్తూ ఆ పార్టీ కీలక నేతలకు రిపోర్ట్స్ అందిస్తున్నాయి. వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమందడి ఎంపీపీ మేఘరెడ్డి బిజెపికి టచ్ లో ఉన్నారన్న ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఆయన ఇటీవల 20 మంది సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. మేఘరెడ్డి దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లో పలు ప్రభుత్వ పనులు చేపట్టారు. వీటి బిల్లులను పెండింగ్లో ఉన్నాయి. దీంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తనకు ఈ ప్రభుత్వంలో పనులు కావడంలేదని అసంతృప్తిలో ఉన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇతన్ని బిజెపిలోకి తీసుకు వెళ్లేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోపక్క వనపర్తిలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డికి మంత్రి నిరంజన్ రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నిరంజన్ రెడ్డి తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ లోకనాథ్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లోకనాథ్ రెడ్డి కూడా బీజేపీ లీడర్లకు టచ్ లో ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే లోకనాథ్ రెడ్డి పార్టీ మారే ఆలోచనల లేదని చెబుతూనే బిజెపి నేతలతో మంతనాలు జరుపుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆయన పై మండిపడుతున్నారు. లోకనాథ్ రెడ్డిని పార్టీలో కొనసాగితే తాము పార్టీ వీడుతామని కొందరు నాయకులు మంత్రి నిరంజన్ రెడ్డిలుస్పష్టంగా తెలియజేశారు. దీంతోఈ విషయంలో నిరంజన్ రెడ్డిమౌనం పాటిస్తున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డి.ఎస్.పి బంటు కిషన్ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవరకద్ర నియోజకవర్గంలో ఈసారి తన పోటీ చేస్తానని తనకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులను కలుస్తున్నారు. ఇది దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి మింగుడు పడడం లేదు. బంటు కిషన్ నియోజకవర్గంలో చేస్తున్న పర్యటనలు, ఎవరెవరికి ఆయన ఫోన్ చేస్తున్నారన్న సంగతిపై ఇంటలిజెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. కిషన్తో పలువురు కీలక లీడర్లు టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్ అధిష్టానం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. పార్టీ వీడాలి అనుకున్నవారిని బుజ్జగించాలని ఎమ్మెల్యేలకు స్పష్టత ఇచ్చినట్టుగా సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana