Home /News /telangana /

NAGAR KURNOOL INCREASED DEMAND FOR SMALL SCALE INDUSTRIES IN NAGARKURNOOL DISTRICT DUE TO MANUFACTURE OF LIGHT WEIGHT CEMENT BRICKS SNR NNK BRV

Nagarkurnool: ఆ జిల్లాలో సిమెంట్ బ్రిక్స్‌కి పెరిగిన డిమాండ్ .. తయారిదారులకు చేతినిండా పనే

(Cement

(Cement Bricks)

Nagarkurnool : ఆ తరువాత ఫ్లై యాష్ బ్రిక్స్ అంటూ కొన్ని ప్రత్యామ్న్యాయ ఇటుకలు అందుబాటులోకి వచ్చినా.. వాటి మన్నిక నాణ్యతపై ప్రజలకు నమ్మకం కుదరలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఆధారంగా తేలిక మరియు నాణ్యమైన ఇటుకలు తయారు చేస్తున్నారు వ్యాపారులు

ఇంకా చదవండి ...
    (N.Naveen Kumar,News18,Nagarkurnool)
    సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో నిర్మాణ రంగం అగ్ర భాగాన ఉందని చెప్పవచ్చు. దశాబ్ద కాలంలోనే నిర్మాణ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఖర్చు ఎక్కువ, అధిక శ్రమ కలిగిన పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ వాటి స్థానంలో ప్రత్యామ్న్యాయ పద్ధతులు ఎన్నో వచ్చాయి. నిర్మాణ రంగంలో ముందుగా చెప్పుకోవాల్సింది ఇటుక గురించే. గతంలో ఇటుక(Brick)అంటే మట్టి ఇటుకలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తరువాత ఫ్లై యాష్ బ్రిక్స్       (Fly ash bricks)అంటూ కొన్ని ప్రత్యామ్న్యాయ ఇటుకలు అందుబాటులోకి వచ్చినా.. వాటి మన్నిక నాణ్యతపై ప్రజలకు నమ్మకం కుదరలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత ఆధారంగా తేలిక మరియు నాణ్యమైన ఇటుకలు తయారు చేస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం అటువంటి బ్రిక్స్‌కి మంచి డిమాండ్ ఉందంటున్నారు నాగర్ కర్నూల్(Nagarkurnool)కు చెందిన సిమెంట్ ఇటుకల(Cement bricks) వ్యాపారి చంద్రకాంత్(Chandrakant).

    సిమెంట్ ఇటుకలకు పెరిగిన డిమాండ్:
    భవన నిర్మాణాలకు వినియోగించే మట్టి ఇటుకకు బదులుగా సిమెంట్ ఇటుకను వినియోగించేందుకు గృహ యజామనులు ఎక్కవగా ఆసక్తి చూపుతున్నారు. మట్టి ఇటుకతో పోల్చుకుంటే ధర తక్కవగా ఉండటం, ఇటుక సైజ్ పెద్దగా ఉండి దృడంగా ఉండటంతో ఈ రకం ఇటుకను వినయోగానికి ఆసక్తి చూపుతున్నారు.

    Crime News : రోజూ ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని టార్చర్ పెట్టాడు .. కుదరని చెప్పడంతో ..



    సిమెంట్ ఇటుక తయారి విధానం:
    సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే గ్రేడ్-2 ఫ్లాష్‌తో ఈ సిమెంట్ ఇటుకలను తయారు చేస్తారు. దీనికి తోడుగా నాణ్యమైన సిమెంట్‌ను, ఫోమ్ ఏజెంట్ వినియోగించి తేలిక పాటి ఇటుకలను తయారు చేస్తారు. ఈ ఇటుకల తయారి కోసం చిన్నపాటి పరిశ్రమను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా మెటీరియల్ మిక్స్ చేసేందుకు ప్రత్యేక మిషన్ అవసరమవుతుంది. వీటితో పాటు ఇటుక దీర్ఘచతురస్రాకారం వచ్చేందుకు మోల్స్, మ్యాట్‌ను వినియోగిస్తారు. సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి తీసుకువచ్చిన గ్రేడ్-2 ఫ్లాష్ కావల్సిన పరిమాణంలో తీసుకొని మిక్స్ంగ్ మిషన్‌లో వేస్తారు. 21 తట్టల ఫ్లాష్‌కు 2 సంచుల సిమెంట్, 180 లీటర్ల ఫోమ్ ఆయిల్ కలిపి నీటిని జతచేస్తారు. ఫోమ్ ఆయిల్ జత చేయడం ద్వారానే సిమెంట్ ఇటుకకు లైట్ వేయిట్‌తో పాటు క్వాలిటీ వస్తుంది. ఈ మిశ్రమం మొత్తం మిషన్‌లో కలియ తిరిగి ఇటుక తయారీకి కావల్సిన మిశ్రమం సిద్ధం చేస్తుంది. ఈ మిశ్రమాన్ని మోల్స్‌లో వేస్తారు. 24 గంటల పాటు మోల్స్‌లోనే ఇటుకలను ఉంచి డ్రై అయిన అనంతరం బయటకు తీసి క్యూరింగ్ చేస్తారు. 15 రోజుల పాటు ఓపెన్ ఏరియాలో క్యూరింగ్ చేపట్టి అనంతరం కస్టమర్లకు డెలివరీ చేస్తారు.

    మట్టి ఇటుక కంటే ధర తక్కువగా:
    మట్టి ఇటుకతో పోల్చుకుంటే సిమెంట్ ఇటుక ధర తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక గృహ నిర్మాణానికి రూ.లక్ష విలువ చేసే మట్టి ఇటుక అవసరమైతే సిమెంట్ ఇటుకకు రూ.85000 వరకు అవుతుంది. మట్టి ఇటుకతో సమానంగా సిమెంట్ ఇటుక నాణ్యత ఉండటం, నీటిని పీల్చుకునే శక్తి తక్కువగా ఉండటంతో భవన నిర్మాణాలు సులభంగా పూర్తవుతాయి. సిమెంట్ ఇటుకలతో 4, 6, 9 ఇంచుల సైజులలో ఇటుకలు లభిస్తాయి. నిర్మాణాలకు అనుగుణంగా కావల్సిన సైజ్ వినియోగించవచ్చు.

    Telangana : అక్కడ మంకీపాక్స్ కంటే అవే ఎక్కువ భయపెడుతున్నాయి .. గడప దాటాలంటే గజగజ వణుకుతున్నారు



    సిమెంట్ ఇటుకలకు పెరుగుతున్న డిమాండ్:
    గత ఏడాది నుంచి సిమెంట్ ఇటుకలకు డిమాండ్ బాగా పెరిగిందని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పరమేశ్వర బ్రిక్స్ మేనేజర్ చంద్రకాంత్ చెబుతున్నారు. ఇంజనీర్లకు, మేస్త్రీలకు సిమెంట్ ఇటుకలోని క్వాలిటీని తెలియజేయడం ద్వారా ఎక్కవగా సేల్స్ జరుగుతున్నయన్నారు. ఒక సిమెంట్ ఇటుక రూ.45కు విక్రయిస్తున్నామని ఎక్కవగా బల్క్ ఆర్డ్ వస్తే ఇంకా తక్కవ ధరకు సప్లై ఇస్తామని వివరించారు. శ్రీ పరమేశ్వర సిమెంట్ ఇటుకల వ్యాపారి చంద్రకాంత్ ఫోన్ నెంబర్ 8688055666.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Nagarkurnool

    తదుపరి వార్తలు