హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: లక్కీ స్కీమ్ పేరుతో రూ. 3 కోట్లు కొల్లగొట్టారు.., పేదల నోట్లో మట్టికొట్టారు

Nagarkurnool: లక్కీ స్కీమ్ పేరుతో రూ. 3 కోట్లు కొల్లగొట్టారు.., పేదల నోట్లో మట్టికొట్టారు

నాగర్ కర్నూలులో స్కీమ్ పేరుతో రూ.3కోట్లకు టోకరా

నాగర్ కర్నూలులో స్కీమ్ పేరుతో రూ.3కోట్లకు టోకరా

లక్కీ స్కీం పేరుతో ఓ ముఠా మండలంలోని పలువురు నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్కీమ్ నిర్వాహకులు పరారీ కావడంతో   మోసపోయామని గుర్తించిన బాధితులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  టెక్నాలజీని (Technology) ఉపయోగించుకొని ఆన్ లైన్ మోసాలు (Online Cheating) జరుగుతున్న ఈరోజుల్లో ఇంకా మనుషులను నమ్మి మోసపోతున్న వారు కూడా ఉన్నారు. ఆన్‌లైన్‌లో జరిగే మోసాలలో ఎదుటి వ్యక్తి ఎవరో తెలియదు, అతని అడ్రస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, పట్టుకోవడం కష్టతరంగా మారుతుంది. మోసపోయామని తెలిసిన తర్వాతే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తారు. కానీ భౌతికంగా జరిగే మోసాల్లో అలాంటి సమస్యలకు ఆస్కారం ఉండదు. మోసం చేసే వ్యక్తి ముందుగానే తెలిసే ఉంటాడు, అతని గురించి వివరాలు తెలిసే ఉంటాయి. బాగా తెలిసిన వ్యక్తి అని నమ్మి డబ్బులు చెల్లిస్తారు. దానికి ముందు స్కీమ్ గురించి ఆరా తీయరు, అందులో ఉన్న మోసాన్ని పసిగట్టరు. నమ్మి డబ్బులు చెల్లించి ఇప్పటికీ మోసపోతున్నారు.

  ఇలాంటి సంఘటన నాగర్ ‌కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లింగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. లక్కీ స్కీం పేరుతో ఓ ముఠా మండలంలోని పలువురు నుంచి దాదాపు 3 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్కీమ్ నిర్వాహకులు పరారీ కావడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు తమకు న్యాయం చేయాలని ఆందోళనచేపట్టారు. లింగాల మండల కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ పేరుతో లక్కీ స్కీం ఏర్పాటు చేశారు.

  ఇది చదవండి: కూలీ పని చేసుకునే వ్యక్తి 25 కేసుల్లో నిందితుడు.., పోలీసులే బిత్తరపోయారు 

  కొంతమంది ఏజెంట్‌లను నియమించుకొని స్థానికంగా దాదాపుగా 2000 మందిని ఈ స్కీంలో చేర్పించారు. ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తామని నమ్మబలికి సభ్యుల దగ్గర నుంచి నెలకు రూ. 1000 చొప్పున 15 నెలల పాటు వసూలు చేశారు. ఇలా దాదాపుగా లింగాల మండలం వ్యాప్తంగా 3 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రతినెల 8 మందికి నగదు, కారు, బైక్ ,బంగారం, వాషింగ్ మిషన్ తదితర బహుమతులు అందిస్తామని అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ సంస్థ పేరున పుస్తకాలు ముద్రించి చీటీలు కట్టిన వారికి ఇచ్చారు.

  ఇది చదవండి: దర్జాగా హైవేపైనే స్మగ్లింగ్.. మరి పోలీసులు ఊరుకుంటారా..?

  వీటిని నమ్మి డబ్బులు కట్టిన వారికి గడువు ముగిసినా చెప్పబడిన వస్తువులు ఇవ్వలేదు. స్కీం నిర్వాహకులను నిలదీయడంతో పొంతన లేని మాటలు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో స్కీం కట్టిన బాధితులు ఆగ్రహించి స్కీం నిర్వాహకుల ఇళ్లకు వెళ్లి నిలదీయాలని పోగా అక్కడ వారు లేకపోవడంతో, ఫోన్స్ సైతం స్విచ్ ఆఫ్ వస్తుండడంతో మోసపోయామని గుర్తించి విస్తుపోయారు. బాధితులంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

  దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అన్నింటిని ఆరా తీయగా 2000 మంది పేదల దాదాపు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి ఉంటారని ప్రాధమికంగా అంచనా వేశారు. కూలీనాలీ చేసుకుని కష్టపడి సంపాదించిన సొమ్మును ఇలా మోసం చేసి కాజేశారని బాధితులు లబోదిబోమన్నారు. ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి స్కీం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagar kurnool, Telangana

  ఉత్తమ కథలు