రిపోర్టర్ : నవీన్
లొకేషన్ : నాగర్ కర్నూల్
ఒక వంటగదికి ఒకే విద్యుత్ మీటర్ ఉండేలా నిబంధనలు అమలు చేస్తుంది. విద్యుత్ శాఖ ఇప్పటికే అదనంగా ఉన్న విద్యుత్ మీటర్ ల సమాచారాన్ని విద్యుత్ సిబ్బంది రీడింగ్ సమయంలో సేకరిస్తున్నారు. కొత్త నిబంధనల మేరకు రెండు పడకల గదులు హాలు ఒక వంటగదిఉన్న ఇంటికి ఒకటే విద్యుత్ మీటర్ ఉండాలి. అంతస్తు ఉండి ఇల్లు అద్దెకు ఇస్తే అందులోను వేరువేరు గుంట గదులు ఉండాలి. ఇలా ఉంటేనే అదనపు మీటర్ కు అనుమతి ఉంది.
దీంతోపాటు మోటారు కనెక్షన్స్ ఉంటే మీటర్లోనే ఉండాలి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అధికారులు ఆ మీట్లను తొలగిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లలో1,91,3 47 గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో సుమారు పదివేలకి పైగా అదనపు మీటర్లు ఉండవచ్చని సర్వే మేర అంచనా వేస్తున్నారు. దీంతో అదనం మీటర్ రీడింగ్ తీయగా ఒక్కో మీటర్ కు 15000 నుంచే 2000 రూపాయలవరకు బిల్లు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు.
దీంతో సంస్థకు స్లాబ్ ప్రకారం బిల్డింగ్ లో నాగర్ కర్నూల్ జిల్లలో నెలకు కోటి నుంచి రెండు కోట్ల వరకు ఆదాయం నష్టపోతున్నట్లు తెలుస్తుంది. ఒకే మీటరు కింద ఉంటే రీడింగ్ తిరిగి ఉంటే స్లాబ్ రేటు సుమారు 7 నుంచి 8 రూపాయల వరకు పెరగడంతో ఆదాయం కోట్లలో పెరుగుతుంది. విద్యుత్ శాఖ రెవెన్యూకు,విద్యుత్ వినియోగదారునికి ఉన్న వ్యత్యాసాన్ని సరి చేసేందుకు ఈ చర్యలు చేపడుతుంది.
ఇందులో భాగంగానే ఒకే వంటగదికి ఉన్న ఇంటికి ఒక మీటర్ పద్ధతిని కఠినంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఓకే ఇంటికి రెండు మూడు మీటర్లు ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి విద్యుత్ శాఖ అధికారులు మొదట నోటీసులు జారీ చేస్తారు. 15 రోజులు గడిచిన తరువాత సిబ్బంది వచ్చి వాటిని తొలగిస్తారు. అయితే ఒకటే మీటర్ వ్యవస్థ ఎప్పటి నుండో ఉన్నా రాజకీయ వర్గాల పైరవీలతో అమలు కాలేదని ఇకనుంచి ఈ పద్ధతిని అమలు చేయడంతో పాటు మీటర్ లేకుండా ఏ ఇంటికి సర్వేసు కూడా ఇవ్వకూడదని ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఎన్ని మీటర్లు ఉన్నా విద్యుత్ వినియోగం మేరకు స్లాబ్ ప్రకారం వచ్చే బిల్లులను మాత్రం తాము చెల్లిస్తున్నామని విద్యుత్ చౌర్యానికి ఎవరు పాల్పడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. గతంలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పట్టణాలను ఎంపిక చేసుకొని ప్రయత్నించగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పుడు దానిని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధం అవుతుంది. దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంటుందో వేసి చూడాల్సి ఉంది.
రెండు మీటర్లు పెట్టి రేంజ్ ఓవర్ ఏర్పాటుచేసి విద్యుత్ వాడుకునేలా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వినియోగదారులకు ఊరట లభిస్తుంది. కానీ విద్యుత్శాఖకు ఆదాయం భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు నెలకు 200 యూనిట్లు వినియోగం ఉందనుకుంటే వారు రెండు మీటర్లు పెడుతున్నారు. తద్వారా ఒక్కోమీటర్ కు 100 యూనిట్లు వినియోగదారుని బిల్లుతో మొదటి స్లాబ్ లోనే ఉంటుంది.
అదే మీటర్ కు 200 యూనిట్లు వాడితే నాలుగో స్లాబ్ లో రేటు బిల్లు వేలల్లో వస్తుంది. అందుకే కొందరు వినియోగదారులు రెండు మీటర్లు పెట్టుకొని రేంజ్ ఓవర్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక మీటర్ 50 యూనిట్లు వాడకం పూర్తి కాగానే వెంటనే ఈ రేంజ్ ఓవర్ ప్రస్తుతం ఉన్న మీటర్ నుంచి విద్యుత్ ఆపేసి మరో మీటర్ ద్వారా విద్యుత్ను వినియోగించడం చేస్తున్నారు. దీని ద్వారా వినియోగదారులకు చాలావరకు బిల్లులో తక్కువగా చూపిస్తుంది. ఈ విధానాన్ని స్వస్తి పలికేందుకు విద్యుత్ శాఖ చర్యలు చేపట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana