Home /News /telangana /

NAGAR KURNOOL HUSBAND SUSPECTING HIS THIRD WIFE AND KILLED TWO CHILDREN AND ATTEMPTED SUICIDE IN NAGARKURNOOL DISTRICT SNR MBNR

Crime news : ఫస్ట్ వైఫ్ చనిపోయింది..రెండో భార్య వెళ్లిపోయింది.. మూడో భార్యపై అనుమానంతో ఏం చేశాడో తెలుసా

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Crime news: అతడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. రెండో భార్య వదిలేసి వెళ్లిపోయింది. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న తర్వాత అతనిలో అనుమానం అనే రోగం పుట్టింది. పదే పదే భార్య శీలాన్ని అనుమానిస్తూ .. అభం శుభం తెలియని పసిపిలల్లపై తన ఆక్రోశాన్ని ప్రదర్శించాడు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India
  (Syed Rafi, News18,Mahabubnagar)
  అతడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. రెండో భార్య వదిలేసి వెళ్లిపోయింది. ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న తర్వాత అతనిలో అనుమానం అనే రోగం పుట్టింది. పదే పదే భార్య శీలాన్ని అనుమానిస్తూ .. అభం శుభం తెలియని పసిపిలల్లపై తన ఆక్రోశాన్ని ప్రదర్శించాడు. ఏ భర్త భార్య పట్ల నడుచుకోనంత దారుణంగా, ఏ తండ్రి బిడ్డలను శిక్షించాలేనంత కఠిన శిక్ష విధించాడు. చేసిన పాపానికి ప్రస్తుతం చావు, బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాగర్‌కర్నూలు(Nagarkurnool)జిల్లాలో జరిగిన జంట హత్యల(Twin murders)కు కారణమైన వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నాడు.

  Telangana : డీజే సౌండ్‌కి డ్యాన్స్ చేయడం కోసం ఫైటింగ్ .. పెళ్లి బరాత్‌లో కత్తులు దూసుకున్నబంధువులు  భార్యపైన అనుమానంతో..
  ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. కొల్లాపూర్ మండల పరిధిలోని కుడికిల్ల గ్రామానికి చెందిన ఓంకార్ కు అదే గ్రామానికి చెందిన మహేశ్వరితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి చందన అనే మూడేళ్ల పాప, విశ్వనాథ్ అనే ఏడాది వయసు కలిగిన పిల్లలు ఉన్నారు. ఓంకార్‌కి మహేశ్వరి మూడో భార్య. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోయింది. మొదటి భార్య సంతానంగా ఒక కొడుకు ఉన్నాడు. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు ఓంకార్. ఆమెకు ఓ కూతురు ఒక కొడుకు ఉన్నారు. ఇద్దరి మధ్య కలహాల కారణంగానే ఆమె భర్త నుండి విడిపోయింది. ముచ్చటగా మహేశ్వరిని మూడో వివాహం చేసుకున్నాడు ఓంకార్.


  పసివాళ్లను పొట్టనపెట్టుకున్నాడు...
  మూడో భార్యకు ఇద్దరు సంతానం కలిగారు. బతుకుతెరువు కోసం విజయవాడకు వెళ్లిన ఓంకార్ పది రోజుల కిందటే ఊరికి వచ్చాడు. అప్పటి నుంచి భార్య మహేశ్వరిని అనుమానించడం, పిల్లలు తనకు పుట్టలేదనే నిందలు వేయడం ప్రారంభించాడు. ఈవిషయంలోనే భార్య, భర్తలకు గొడవ జరగడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తానంటూ నమ్మించి పిల్లలు, భార్యను తీసుకెళ్లాడు. కొల్లాపూర్ నుంచి పెద్దకొత్తపల్లి వెళ్లే దారిలోనే భార్యతో గొడవపడ్డాడు. ఆమెను చంపుతానంటూ బెదిరించడంతో మహేశ్వరి బైక్‌పై నుంచి దూకి పారిపోయింది.

  Telangana : ఇప్పుడే వస్తానని తల్లిని బస్టాండ్‌లో వదిలి వెళ్లాడు .. 10రోజుల తర్వాత ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందంటే  మూడో భార్యతో గొడవ..
  భార్య పారిపోవడంతో ఇద్దరూ పిల్లలను ఓంకార్ కోడేరు మండలం ఎట్టం గ్రామ శివారులోని గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. బైక్‌ను పక్కనే ఉన్న పొలంలో వదిలేసి పిల్లలను ఇద్దర్ని గుట్టపైకి తీసుకెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకొని రోడ్డు దగ్గరకు వచ్చి పడిపోయాడు. భర్త నుంచి పారిపోయిన మహేశ్వరి పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది.భర్త తన ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లాడని చంపుతానని బెదిరించాడని చెప్పడంతో ఓంకార్ సెల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా వెదికారు.

  Telangana : మునుగోడు టీఆర్ఎస్‌ అభ్యర్ధిగా మూడో సారి ఆయనే .. బహిరంగసభలో కేసీఆర్ ప్రకటించే ఛాన్సు  పెళ్లంపై కోపాన్ని పిల్లలపై పగ తీర్చుకున్నాడు..
  ఎట్టం గ్రామ శివారులోని గుట్టపై పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన స్తలంలో దొరికిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మడుగులో పడివున్న ఇద్దరు పిల్లను చూసి మహేశ్వరి బోరున విలపించింది. బిడ్డల్ని హతమార్చిన నిందితుడు ఓంకార్‌ కొన ఊపిరితో ఉండటంతో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కండీషన్‌ సీరియస్‌గా ఉందని డాక్టర్లు మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మహేశ్వరికి కూడా రెండో వివాహం కావడంతో ఓంకార్ నిత్యం ఆమెను ఈ పిల్లలు తనకు పుట్టలేదనే అనుమానంతో వేధించే వాడని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. ఆపరేషన్ చేయించుకోకుండా మరో కాన్పు వరకు ఉండాలని మహేశ్వరి దగ్గర ఓంకార్ పట్టుబట్టిన క్రమంలోనే దారుణం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Burtally murder, Nagar kurnool, Telangana crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు