Home /News /telangana /

NAGAR KURNOOL HOW TO SPRAY NANO UREA IN THE FIELD AND HOW MUCH IS REQUIRED PER ACRE FULL DETAILS HERE BRV NNK PRV

Nagarkurnool: మార్కెట్లోకి వచ్చిన నానో యూరియా: ఎలా పిచికారీ చేయాలి? ఎకరాకు ఎంత మోతాదు అవసరం?

నానో

నానో యూరియా

గులికల యూరియాకు ప్రత్యామ్న్యాయంగా మార్కెట్లోకి ఈ నానో యూరియాను తీసుకువచ్చారు. ద్రవ రూపంలో ఉండే ఈ యూరియా పంట ఎదుగుదలకు ఎంతో సహకరిస్తుందని తయారీదారు చెబుతున్నారు. అయితే ఈ యూరియా ఎలా వెయ్యాలి? ఎంత మోతాదులో..? వివరాలివే

    (N. Naveen Kumar, News 18, Nagarkurnool)

    వ్యవసాయంలో (Agriculture) రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పలు ఫర్టిలైజర్ కంపెనీలు (Fertilizer companies) నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కొత్తగా ఇఫ్కో కంపెనీ వారు నానో యూరియాను (Nano Urea) మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. గులికల యూరియాకు ప్రత్యామ్న్యాయంగా మార్కెట్లోకి ఈ నానో యూరియాను తీసుకువచ్చారు. ద్రవ రూపంలో ఉండే ఈ యూరియా పంట ఎదుగుదలకు (Crop Development) ఎంతో సహకరిస్తుందని తయారీదారు చెబుతున్నారు.

    ఏమిటీ నానో యూరియా:

    ప్రముఖ ఫర్టిలైజర్ కంపెనీ ఇఫ్కో (IFFCO) కంపెనీ నూతన ఆవిష్కరణలు చేపట్టి వ్యవసాయ అభివృద్దికి కృషి చేస్తున్నారు. పర్యవరణ పరిరక్షణకు, పంటలకు బలం చేకూర్చేలా 2021 ఆగష్టులో నానో యూరియాను ప్రవేశపెట్టారు. సాధారణంగా సాంప్రదాయ యూరియా గులికల రూపంలో ఉంటుంది. ఈ గుళికల మందును నేరుగా మొక్కలకు వెదజల్లుతారు. ఈ పద్ధతుల్లో యూరియా  (Nano Urea) భూమిలో కలిసిపోయి అనంతరం వేర్ల ద్వారా మొక్కకు చేరుతుంది. తద్వారా భూ సారం తగ్గిపోవడంతో పాటు మొక్క ఎదుగుదల ఆలస్యం అవుతుంది. ఇందుకు భిన్నంగా ఇఫ్కో కంపెనీ వారు ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను ప్రవేశపెట్టారు. ఈ యూరిమాను నీటిలో కలిపి పంప్, స్ప్రేయర్ ద్వారా పంటకు పిచికారి చేయాల్సి ఉంటుంది. 500 మి.లీ నానో యూరియా 45 కేజీల యూరియా బస్తాకు సమానం. ఒక లీటరు నీటిలో 4 మి.లీ నానో యూరియాను కలిపి మొక్కలపై పిచికారి చేయాల్సి ఉంటుంది. ఒక్కో బాటిల్ ధరను మార్కెట్ లో రూ.250గా నిర్ణయించారు.

    రైతులకు తప్పనున్న అవస్థలు:

    వ్యవసాయం మొదలు పెట్టిన ప్రతి ఏడాది రైతులకు యూరియా విషయంలో సమస్యలు వస్తూనే ఉన్నాయి. సరిపడా స్థాయిలో యూరియా అందకపోవడం వలన ప్రతి ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వం ఎంత పెద్ద మొత్తంలో సరఫరా చేసినప్పటికి మార్కెట్లో వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు యూరియాను విక్రయించిన సంఘటలను జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్బాల్లో యూరియా బస్తల కోసం దుకాణాల ఎదుట క్యూ లైన్లలో నిలబడి సమయం వృధా చేసుకున్న ఘటనలు ఉన్నాయి. 45 కిలోల యూరియా బస్తాలను తీసుకెళ్లేందుకు రైతులకు రవాణ ఖర్చులు కూడా అధికమయ్యేవి. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేలా మార్కెట్లోకి వచ్చిన నానో యూరియాతో (Nano Urea)  రైతులకు అవస్థలు తప్పినట్లయింది. వీటితో పాటు కాల్సినంత స్టాక్ ఇఫ్కో కంపెనీ అవుట్ లెట్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.

    నాగర్‌కర్నూల్‌లో ఇఫ్కో కంపెని అవుట్ లెట్:

    నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర ఇఫ్కో కంపెనీ అవుట్ లెట్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా నానో యూరియా (Nano Urea) ను సరఫరా చేసేందుకు స్టాక్ సిద్ధంగా ఉంచారు. నానో యూరియా వినియోగంపై కంపెనీకి చెందిన ఉద్యోగులు రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు. రైతులు, పొలాల దగ్గరకు వెళ్లి నానో యూరియా ఎలా వినియోగించాలి, ఎంత నీటిలో పిచికారీ చేయాలి అనే విషయాలను తెలియజేయనున్నారు.

    నాగర్‌కర్నూల్‌లో ఇఫ్కో కంపెనీ మేనేజర్ బాలాజీ

    ఫోన్: 9493548398, ఇఫ్కో ఉద్యోగి శివ ఫోన్: 9948710873
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Agriculture, Farmers, Local News, Nagarkurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు