హోమ్ /వార్తలు /తెలంగాణ /

తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు.. జీవితమే మారొచ్చు.. ఈ అత్యాశే నిండా ముంచింది

తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు.. జీవితమే మారొచ్చు.. ఈ అత్యాశే నిండా ముంచింది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండు నెలలలో ఐఎంఎస్ సంస్థ తనకు దాదాపు 50 లక్షలు ఇచ్చే విధంగా శ్రీనివాసరెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే ఐఎంఎస్ ట్రేడర్స్ నుండి గడువు దాటిపోయినా సమాధానం లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలను పొందాలని అత్యాశకు పోయి చాలామంది మోసపోతూ ఉంటారు. ఇలాంటి మోసాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తుంది క్రిప్టో కరెన్సీకి చెందినటువంటి మోసాలు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వంటి షేర్ మార్కెట్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే అనతి కాలంలోనే రెట్టింపుతో తిరిగి వస్తాయని కొంతమంది ఇన్వెస్టర్లు నమ్మబలుకుతూ వస్తున్నారు. దీనిని నమ్మినటువంటి కొంతమంది అమాయకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని అత్యాశతో వారిని నమ్మి లక్షలకు లక్షలు పెట్టుబడులుగా పెడుతున్నారు.సంబంధిత నిర్వాహకులు కేటాయించిన గడువు తీరినప్పటికీ తమకు రావాల్సిన డబ్బులు రాకపోవడంతో మోసానికి గురైనట్లుగా భావించి లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

సబ్సిడీ గొర్రెల పంపిణీ కోసం గొల్ల కురుమల ఎదురుచూపులు!

క్రిప్టో కరెన్సీ పేరుతో 25 లక్షలకు టోకరా పెట్టిన ఘటన ఒకటి పోలీసులు విచారణతో వెలుగులోకి వచ్చింది. అసలు వివరాలలోకి వెళ్తే.. మహబూబ్ నగర్ వన్ టౌన్ సిఐ స్వామి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస్ రెడ్డి రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ ఏరియాలో ఉన్న ఐఎంఎస్ ట్రేడర్స్ గురించి తెలుసుకున్నాడు. ఐఎంఎస్ ట్రేడర్స్ ట్రిప్టో కరెన్సీ పేరుతో వ్యాపారం చేస్తుంటారని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి వారితో వ్యాపారం చేయాలని ముందుకు వచ్చాడు.

ఈ క్రమంలో మిర్యాలగూడకు చెందిన శ్రీనివాసరెడ్డి క్రిప్టో కరెన్సీ వ్యాపారం కోసం గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఐఎంఎస్ ట్రేడర్స్ నిర్వాహకులకు రెండు దఫాలుగా 25 లక్షల నగదుఇచ్చాడు. ఇందుకుగాను 60 రోజుల్లో రెండింతలు చేసి ఇస్తామని ఐఎంఎస్ ఒప్పందం చేసుకుంది. రెండు నెలలలో ఐఎంఎస్ సంస్థ తనకు దాదాపు 50 లక్షలు ఇచ్చే విధంగా శ్రీనివాసరెడ్డి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అయితే ఐఎంఎస్ ట్రేడర్స్ నుండి గడువు దాటిపోయినా సమాధానం లేదు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు శృనివాసరెడ్డి మోసపోయినట్లుగా గుర్తించి గురువారం ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఐ తెలిపారు.

First published:

Tags: Cheating, Cryptocurrency, Local News, Nagar kurnool

ఉత్తమ కథలు