హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: హస్తకళలకు పెరుగుతున్న ఆదరణ: నేరుగా అమ్మకాలతో కళాకారులకు లాభం

Nagarkurnool: హస్తకళలకు పెరుగుతున్న ఆదరణ: నేరుగా అమ్మకాలతో కళాకారులకు లాభం

నాగర్

నాగర్ కర్నూల్‌లో ఆకట్టుకుంటున్న చేనేత హస్త కళ ప్రదర్శన

Handicrafts: పూర్వకాలం నుంచి వారసత్వంగా వస్తున్న హస్తకళలు మాత్రం ఈ మధ్య గడ్డుకాలాన్నే ఎదుర్కొంటున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీల పోటీని తట్టుకోలేక ఉనికిని కోల్పోతున్నాయి. ఐతే మారుతున్న అభిరుచులు.. జనం మూలాల వైపు చూస్తుండటంతో చేనేత హస్తకళలకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  ప్రస్తుతం అంతా మోడ్రన్ యుగనం నడుస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీకి ఈ జనరేషన్ పెద్దపీట వేస్తోంది. అలాగే పరిశ్రమలు కూడా పెద్దపెద్ద యంత్రాలను ఏర్పాటు చేసి ఆయా వస్తువులను ఆకర్షణీయంగా తయారు చేస్తున్నాయి. అలాంటి వాటికే మార్కెట్లో డిమాండ్ వస్తోంది. అంతేకాదు జనం కూడా వాటివైపే ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే పూర్వకాలం నుంచి వారసత్వంగా వస్తున్న హస్తకళలు మాత్రం ఈ మధ్య గడ్డుకాలాన్నే ఎదుర్కొంటున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీల పోటీని తట్టుకోలేక ఉనికిని కోల్పోతున్నాయి. ఐతే మారుతున్న అభిరుచులు.. జనం మూలాల వైపు చూస్తుండటంతో చేనేత హస్తకళలకు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కొత్త కళారూపాలు తయారు చేస్తూ కళాకారులూ ఆకట్టుకుంటున్నారు.

  ప్రభుత్వాలు సైతం చేనేత హస్తకళలను ప్రోత్సహిస్తూ వారికీ మార్కెటింగ్ అవకాశాలు కల్పించేలా దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంది. దీంతో తయారీదారులే నేరుగా వినియోగదారులకు వస్తువులను అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు.తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చేనేత హస్తకళలు, చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పటు చేశారు. హ్యాండ్లూమ్స్ దుస్తులను, కొండపల్లి బొమ్మలను వివిధ రకాల గృహోపకరణ వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

  ఇది చదవండి: గోదావరి తీరంలో అనుకోని పరిస్థితులు.. అల్లాడుతున్న మూగజీవాలు.. కారణం ఇదే..!

  స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని లహరి గార్డెన్స్‌లో ఈ చేనేత హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 20 మంది చేనేత కళాకారులూ ఇక్కడికి వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాదాపుగా 200 రకాల వస్తువులను అమ్మకానికి పెట్టారు. దుస్తులు, కొండపల్లి బొమ్మలు, రోల్డ్ గోల్డ్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్‌లు, ఇంట్లో వినియోగించే వంట సామాగ్రి, ఇతర అలంకరణ వస్తువులు వంటివి అమ్మకానికి ఉంచారు. దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు నాగర్‌కర్నూల్ వాసులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

  బయట మార్కెట్ కంటే సరసమైన ధరలకు ఇక్కడ ఈ వస్తువులను అమ్ముతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కళారూపంలో ఉన్న ఈ వస్తువులను కొనుగోలు చేసి కస్టమర్లు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏడాది దసరా పండుగ సమయంలో నాగర్‌కర్నూల్‌లో ఈ చేనేత హస్తకళా ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఇక్కడి ప్రజలు ఈ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారని మేనేజర్ రంగస్వామి చెప్పారు. దసరా సమయంలో ఇక్కడ వ్యాపారం చేయడం ద్వారా మంచి లాభాలు వస్తాయని వివరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagarkarnol district, Telangana

  ఉత్తమ కథలు