హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: 24 గంటల్లో గువ్వల బాలరాజు క్షమాపణలు చెప్పాల్సిందే.. బీఎస్పీ డిమాండ్

Nagar Kurnool: 24 గంటల్లో గువ్వల బాలరాజు క్షమాపణలు చెప్పాల్సిందే.. బీఎస్పీ డిమాండ్

X
నిరసన

నిరసన తెలియజేస్తున్న ప్రజలు

Telangana: అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు జిల్లావ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అసలు సిసలైన బడుగు బలహీన వర్గాలు తామే అని ఇతర నాయకులను అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు ప్రజాసంఘాల నాయకులకు బిఎస్పి నాయకులకు ఆగ్రహాలు తెప్పించాయి.

ఇంకా చదవండి ...
  • News18
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు జిల్లావ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అసలు సిసలైన బడుగు బలహీన వర్గాలు తామే అని ఇతర నాయకులను అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు ప్రజాసంఘాల నాయకులకు బిఎస్పి నాయకులకు ఆగ్రహాలు తెప్పించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజాసంఘాల నాయకులు బిఎస్పి నాయకులు ఆందోళన నిర్వహించి గువ్వల బాలరాజు దిష్టిబొమ్మను దహనం దానం చేశారు.

వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.ప్రజాసంఘాలు బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద గల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి, గువ్వల బాలరాజు దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ మాట్లాడుతూ.. అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికారం ఉందనే పైత్యంతో, తన స్థాయి మరిచి మాయావతిని విమర్శించడం తగదని హెచ్చరించారు. మాయావతికాలి గోటికి కూడా గువ్వల బాలరాజు సరిపోడని ఆగ్రహించారు. జాతీయ నాయకురాలు అయిన మాయావతి ఎంతో త్యాగం, నిబద్దతతో బహుజన సమాజం కోసం పని చేసిన విషయం మరువొద్దని అన్నారు. మాయావతిపై అవాకులు, చేవాకులు మాట్లాడుతున్న గువ్వల బాలరాజును బిఆర్ఎస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మారిస్తే ఏం అవుతుందని మాట్లాడిన ప్రజల ద్రోహి గువ్వల బాలరాజు అని పేర్కొన్నారు. 2014లో తెరాస ఎన్నికల మేనిఫెస్టోగా దళిత ముఖ్యమంత్రి హామీ ఇస్తే, దళితులకు ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని మాట్లాడిన దళితుల ద్రోహి గువ్వల అని విమర్శించారు. నిన్న ప్రెస్ మీట్ లో మేమే అసలైన బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులం అని గువ్వల మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తూ.. మీరే అసలైన ప్రతినిధి అయితే జిల్లా కేంద్రంలో దళితుల భూములు గుంజుకుని మెడికల్ కళాశాల కట్టినప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

గువ్వల నోరు అదుపులో పెట్టుకోకపోతే, గువ్వలను జిల్లాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. 24గంటల్లో గువ్వల బాలరాజు, బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ క్షమాపణలు చెప్పాలని కోరారు. లేని పక్షంలో బిఎస్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అచ్చంపేట్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామని తెలిపారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana