హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagar Kurnool: పట్టాలిచ్చి 13 ఏండ్లు.. కానీ జాగా ఎక్కడో చూపించరే!

Nagar Kurnool: పట్టాలిచ్చి 13 ఏండ్లు.. కానీ జాగా ఎక్కడో చూపించరే!

నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు

నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలు

Telangana: తుంగభద్ర వరద బాధితులను సర్కారు పట్టించుకోవడం లేదు. 2009లో వచ్చిన వరదలకు అలంపూర్ టౌన్ తో పాటు మానపాడు మండలం మద్దూరు గ్రామం నీటి మునిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

రిపోర్టర్ : నవీన్

లొకేషన్ : నాగర్ కర్నూల్

తుంగభద్ర వరద బాధితులను సర్కారు పట్టించుకోవడం లేదు. 2009లో వచ్చిన వరదలకు అలంపూర్ టౌన్ తో పాటు మానపాడు మండలం మద్దూరు గ్రామం నీటి మునిగింది. ఇందులో నిర్వాసితులైన వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో సర్కారు ఇండ్ల జాగాలకు సంబంధించిన పట్టాలను అందించింది. కానీ ఇప్పటివరకు భూమి ఎక్కడని చూపించడం లేదు. పైగా పట్టాలు ఇచ్చిన జాగాలో ప్రభుత్వ ఆఫీసులు కడుతుంది.బాధిత ప్రజలు దీంతో ఆందోళనకు దిగారు.13 ఏళ్ళు గడుస్తున్న జాగాలు చూపించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2009లో తుంగభద్ర నదికి వచ్చిన వరదలకు అల్లంపూర్ అతలాకుతలమైంది. ప్రజలు కట్టుబట్టలతో సహా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి వరదల నుంచి ప్రాణాలను కాపాడుకున్నారు. అలంపూర్ పట్టణంలో 882 కుటుంబాలకు కాను 42 ఎకరాల్లో ఇల్లు కట్టుకునేందుకు భూములను చూపించి కేటాయించి పట్టాలను అందజేశారు.

మానవపాడు మండలంలో 150 కుటుంబాలకు గాను 32 ఎకరాల్లో భూమిని కేటాయిస్తూ పట్టాలను ఇచ్చారు. ఈ పట్టాలు ఇచ్చి 13 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒకరి కూడా భూమిని చూపించలేదు.ఆ భూముల్లో ప్రభుత్వంఇప్పటికే రైతు వేదిక కట్టింది.ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ ఆఫీసు కట్టేందుకు పునాదులు తీశారు. దీనితో పట్టాలు పొందిన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాసిల్దార్ మున్సిపల్ ఆఫీస్ ల వద్ద ధర్నాలు చేపట్టారు. వరదల్లో నిండా మునిగి తీవ్రంగా నష్టపోయామని పాత ఇల్లు కూలిపోయిన తమకు పరిహారం కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. ఇండ్ల పట్టాలు ఇచ్చినజాగాలో సర్కారు ఆఫీస్ లను ఎలా కడతారని మండిపడుతున్నారు. తమకు వెంటనే ప్లేసులు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంలో ప్లాట్లు పట్టాలను ఇవ్వాలని లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రభుత్వం పట్టా ఇచ్చిన ఏడాదిలోగా నిర్మాణం జరగాలని లేదంటే ఆటోమేటిక్గా పట్టా రద్దువుతుందని అంటున్నారు. అయితే తుంగభద్ర బాధితుల భూమి వ్యవహారంకలెక్టర్ పరిధిలో ఉందని తాసిల్దార్ ఆర్డీవో వివరణ ఇస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో పట్టాల పంపిణీకి గైడ్లైన్స్ లేవని, అందువల్ల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని, విషయాన్ని ఉన్నత అధికారులదృష్టికి తీసుకెళ్తామని స్థానిక ఏవో యాదగిరి సమాధానం ఇస్తున్నారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలు రాకపోతే తామంతా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బాధితులు హెచ్చరిస్తున్నారు. 13 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులను పార్టీల నాయకులను వేడుకుంటున్నా కానీ తమకు భూమిని కేటాయించకుండా తీరా ఇప్పుడుభూమిని అంతా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేపట్టేందుకు వినియోగిస్తున్నారని మండిపడుతున్నారు. కట్టుబట్టలతో పూర్తిగా నష్టపోయిన తమను ప్రభుత్వం మరొకసారి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు