హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: రొయ్య.. ఈ జిల్లాలో కొరకరాని కొయ్య.. తలసాని సార్ జర సూడుర్రి

Nagarkurnool: రొయ్య.. ఈ జిల్లాలో కొరకరాని కొయ్య.. తలసాని సార్ జర సూడుర్రి

నాగర్ కర్నూలులో రొయ్యల సాగుపై మత్స్యశాఖ నిర్లక్ష్యం

నాగర్ కర్నూలులో రొయ్యల సాగుపై మత్స్యశాఖ నిర్లక్ష్యం

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మత్స్యకారుల జీవనాభివృధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  Naveen Kumar, News18, Nagarkurnool

  తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మత్స్యకారుల జీవనాభివృధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. చేపలు పట్టుకొని జీవం సాగించే వీరి కోసం ప్రభుత్వం సబ్సిడీ ద్వారా పలు పథకాలు అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగానే చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను పెంచడంతో పాటు మార్కెటింగ్ చేసుకునేందుకు వాహనాలు, వేట సామాగ్రిని సైతం పంపిణీ చేస్తుంది మత్స్యశాఖ. దీంతో మత్స్యకారుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి. చేపల వృత్తిని నమ్ముకునే వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఇక ఇదే తరహాలో రొయ్యల పెంపకానికి కూడా ప్రభుత్వ శ్రీకారం చుట్టింది.

  నాగర్‌కర్నూల్ జిల్లాలో తొలిసారిగా రొయ్యల పెంపకాన్ని గత ఏడాది నుంచి ప్రారంభించారు. అయితే అధికారుల నిర్లక్ష్యం వలన ఈ పథకానికి ఆదిలోనే హంసపాదు అన్నచందంగా తయారైంది పరిస్థితి. రొయ్యల పెంపకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినా అధికారులు మాత్రం రొయ్యల సాగుపై మత్స్యకారులకు శిక్షణ అందించలేదు. రొయ్యలు పట్టడం, వాటిని అమ్మడం వంటి విషయాలపై మత్స్యకారులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఈ పథకం నీరుగారిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది నాగర్‌కర్నూల్ జిల్లాలో జొన్నాలబోగడ రిజర్వాయర్, సింగోటం వద్ద ఉన్న శ్రీవారి సముద్రంలో రొయ్యలను పెంచేందుకు మొదటి విడతగా ప్రయత్నాలు ప్రారంభించారు అధికారులు. అయితే పథకం పూర్తిస్థాయిలో అమలు చేసే సమయానికి మత్స్యకారులకు రొయ్యల సాగుపై అవగాహన, శిక్షణ నిర్వహించలేదని తెలుస్తుంది.

  ఇది చదవండి: భద్రాద్రి రామయ్య భక్తులకు కొండంత దైర్యం ఇచ్చిన కనకదుర్గమ్మ..!

  రొయ్యలు పెంపకంపై శిక్షణ ఎందుకు?

  చేపలతో పోలిస్తే రొయ్యలు పెరిగేందుకు కాస్త ఎక్కువ కాలం పడుతుంది. అదే సమయంలో రొయ్యల సాగులో లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది. సాధారకానికి చెందిన చేపల విలువ మార్కెట్లో కిలో రూ. 100 - రూ. 150 వరకు పలికితే రొయ్యల విలువ కిలో రూ. 400 - రూ. 500 వరకు ఉంటుంది. అలాగే చేపలను పట్టే వలలతో కాకుండా రొయ్యలు పట్టేందుకు ప్రత్యేకంగా బుట్టలు అవసరం అవుతుంది. నీటి అడుగు భాగంలో పెరిగే రొయ్యలు పట్టాలంటే జలాశయంలోని నీటిమట్టం గణనీయంగా తగ్గాల్సి ఉంటుంది. బుట్టలతో రొయ్యలు పట్టడంపై మత్స్యకారులకు శిక్షణలు అందించాల్సి ఉంటుంది.

  కానీ నాగర్ కర్నూల్ జిల్లాలో రొయ్యలు పట్టుకునేందుకు ఇప్పటివరకు ఎలాంటి శిక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నిర్లక్ష్యానికి తోడుగా గతేడాది జలాశయాల్లో విడుదల చేసిన రొయ్యల లెక్కలు చెప్పేందుకు అధికారులు సుముఖత చూపడం లేదు. నీటి అడుగున పెరుగుతాయి కదా ఎవరు గుర్తిస్తారు అనే ఉద్దేశంతో వివరాలు ఎందుకు అని అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పథకం నీరుగారిపోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Local News, Nagarkarnol district, Telangana

  ఉత్తమ కథలు