Naveen Kumar, News18, Nagarkurnool
పేరెంట్స్ మీటింగ్. ఈ కార్యక్రమాన్ని చాలా వరకు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులను ఉపాధ్యాయులు తమ పాఠశాలకు ఆహ్వానించి పిల్లల విద్య , అభివృద్ధి గురించి, వారికి నిర్వహిస్తున్న తరగతుల గురించి, వారి విద్య ఏ విధంగా కొనసాగుతుందని అంశాలను పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి తెలియజేస్తూ ఉంటారు. ఈ మీటింగ్ ద్వారా చాలా వరకు పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒక సమన్వయంతో ముందుకు కొనసాగుతూ ఉంటారు. ఈ మీటింగ్ వలన విద్యార్థుల చదువు సామర్ధ్యాలు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది. ఇందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లో కూడా ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టి తల్లిదండ్రులకు విద్యార్థుల గురించి పలు సూచనలు అందించారు. అలాగే విద్యార్థులకు ఎలాంటి బోధన అందించాలి అనే అంశాలను కూడా తల్లిదండ్రులు టీచర్లకు సూచించడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ,స్థానిక సంస్థల పాఠశాలల్లో పేరెంట్, టీచర్ మీటింగ్స్ ను ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని 825 పాఠశాలల గాను 740 పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ సమావేశం చేపట్టారు.825 పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 72,224 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి సంబంధించిన 60,608 మంది పేరెంట్స్ కు గాను నేటి పేరెంట్ సమావేశాలకు 38,556 మందిపేరెంట్స్ హాజరయ్యారని నాగర్ కర్నూలు జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి బరపటి వెంకటయ్య తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు పిల్లలు పలు పాఠశాలల్లో చదువుతున్నవారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.పిల్లల క్రమశిక్షణ, అటెండెన్స్, స్కూల్లోఆ రోజు చెప్పిన పాఠాలు, ఇతర విశేషాల గురించి పేరెంట్స్ వారి పిల్లలను అడిగి తెలుసుకోవడం ఈ సమావేశంలో జరిగింది. ముఖ్యంగా పిల్లలను రెగ్యులర్గా స్కూల్ కు పంపాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు తెలిపారు.స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ద్వారా కూడా సమావేశాలు నిర్వహిస్తు, వాటితోపాటు శనివారం నిర్వహించే అన్ని క్లాసుల స్టూడెంట్ల పేరెంట్స్ పాల్గొనేలా చూస్తున్నామని తెలిపారు. పలు పాఠశాలల్లో జరిగిన పేరెంట్ సమావేశాలకు హాజరైనట్లు అకాడమిక్ మానిటరింగ్ అధికారి బరపటి వెంకటయ్య తెలిపారు.
పాఠశాలలో టీచర్లు చెప్పిన తరగతులను ఇంటిదగ్గర హోంవర్క్ చేయించే బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుందని సూచించారు. క్రమం తప్పకుండా స్కూలుకు పంపించడం అదేవిధంగా పిల్లలను క్రమశిక్షణగా పెంచడం వంటి అంశాలను తల్లిదండ్రులకు తెలిపారు. చాలావరకు 8, 9, 10వ తరగతి పిల్లలు చెడు అలవాట్ల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, తాము పాఠశాలల్లో ఎంత చెప్పినా కానీ కొంతమంది విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడుతున్నారని, వాటిని తల్లిదండ్రులే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. వచ్చే ఏడాది పదవ తరగతికి వెళుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని ఎలాంటి ఆబ్సెంట్ లేకుండా విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే విధంగా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana