హోమ్ /వార్తలు /తెలంగాణ /

Free Treatment: నేరుగా ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు.. రోగులకు అండగా.."ఆలనా కేంద్రం’’

Free Treatment: నేరుగా ఇంటి వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు.. రోగులకు అండగా.."ఆలనా కేంద్రం’’

ఇంటి

ఇంటి వద్దే చికిత్స చేస్తున్న వైద్యులు

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆలనా పేరుతో ఇంటి వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి రోగులకు చికిత్సలు అందజేస్తున్నారు. వారికి కావాల్సిన  మందులు, ఆహారం, వైద్య సేవలు అందిస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar, India

  Naveen Kumar, News18, Nagarkurnool


  ఈ రోజుల్లో వైద్యం (Treatment) అంటే చెప్పలేనంత ఖర్చుతో కూడుకున్న పని. కార్పొరేట్ ఆసుపత్రుల్లో (Hospitals) మంచి వైద్యం అందుతున్నా..అక్కడి ఖర్చు భరించే స్థోమత సామాన్యుడికి లేదు. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి గురించి చెప్పన్నక్కర్లేదు. ప్రభుత్వాసుపత్రులకు వెళితే గంటల తరబడి వేచి ఉండాల్సిన పని. ప్రతీ అవసరానికి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని స్థితి. దీంతో వారు 'ఆలనా పాలనా'కు నోచుకోక మనోవేదనకు గురవుతున్నారు. కానీ రోజులు మారాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఆలనా పేరుతో ఇంటి వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి రోగులకు చికిత్సలు అందజేస్తున్నారు. వారికి కావాల్సిన మందులు, ఆహారం, వైద్య సేవలు అందిస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు.


  నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లా దవాఖానలో పాలియేటివ్ కేర్ ఆలనా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు (Harish rao) ఈఏడాది జనవరిలో ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 200 మందికి పైగా వ్యాధిగ్రస్తులకు వైద్యసిబ్బంది సేవలు అందించారు. క్యాన్సర్, పక్షవాతం, డయాబెటిస్, రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై మంచం పట్టిన వారిని, ఇక్కడి ఆలనా కేంద్రానికి తీసుకువచ్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వైద్య చికిత్స కేంద్రం వరకు రాలేని వారి కోసం ప్రత్యేకంగా "ఆలనా వాహనం" ఏర్పాటు చేసి ఇంటి వద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న రోగులకు, నిరుపేదలకు ప్రభుత్వం తరుపున ఉచిత వైద్యం అందిస్తూ ఉపశమనం కలిగించడంతో పాటు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు.  ఈ సేవలను మరింత విస్తరించేలా జిల్లా వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు సిబ్బంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 26 పీహెచ్‌సీలో పనిచేస్తున్న సిబ్బంది ఆమేరకు పూర్తి వివరాలను సేకరించి బాధితులకు వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 72 మంది క్యాన్సర్ బాధితులను, ఇతర వ్యాధులతో బాధపడుతూ మంచానికి పరిమితమైన 150 మందిని గుర్తించారు. వారందరికీ పాలియేటివ్ కేర్ కేంద్రం ద్వారా విడతల వారీగా వైద్యం అందిస్తున్నారు. జిల్లా దవఖానాలో ఐపీ, ఓపి వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రోగులకు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.


  ఆలనా కేంద్రం ద్వారా ఇంటికే సేవలు: శ్రీవాణి, ఆలనా కేంద్రం వైద్యాధికారి.
  ఆలనా వాహనంకు సంబంధించి రోగులకు కావాల్సిన సమాచారం అందించేందుకు 8341794917, 747607423, 743666752 నెంబర్లను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2017లో 10 ఆలనా కేంద్రాలను ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని వైద్య కేంద్రంలో ఒక వైద్య అధికారితో పాటు మరో ఐదుగురు సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇంటికే వెళ్లి సేవలు అందిస్తామని ఆలనా కేంద్రం వైద్య అధికారి డాక్టర్ శ్రీవాణి తెలిపారు. రోగుల సమస్యలు గుర్తించి తగిన చికిత్సలు అందించనున్నారు. ప్రతి రోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో 15 మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించనున్నారు. వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి, ఫోన్: 8341794917.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Free treatment, Local News, Nagarkurnool

  ఉత్తమ కథలు