హోమ్ /వార్తలు /తెలంగాణ /

పులి మీద సవారీ లాంటి ఉద్యోగం.. పట్టించుకోని ప్రభుత్వం

పులి మీద సవారీ లాంటి ఉద్యోగం.. పట్టించుకోని ప్రభుత్వం

ఫారెస్ట్ వాచర్స్ ను పట్టించుకోని ప్రభుత్వం

ఫారెస్ట్ వాచర్స్ ను పట్టించుకోని ప్రభుత్వం

Nagar Kurnool: అటవీ శాఖలో కీలకమైన విధులు నిర్వహిస్తున్న వారిలో వాచర్లను కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు. ఈ వాచర్లు దట్టమైన అడవిలో ఉంటూ అటవీని సంరక్షించడంలో నిమగ్నమై ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

అటవీ శాఖలో కీలకమైన విధులు నిర్వహిస్తున్న వారిలో వాచర్లను కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు. ఈ వాచర్లు దట్టమైన అడవిలో ఉంటూ అటవీని సంరక్షించడంలో నిమగ్నమై ఉంటారు. వీరిని ప్రభుత్వం కాంటాక్ట్ పద్దతిలో ఉద్యోగాల్లోకి తీసుకుంది. వీరిలో చాలామంది అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు, షెడ్యూల్ తెగల వారే ఎక్కువగా ఉంటారు. వీరు అడవిలో జంతువులతో సహవాసం చేస్తూ జీవిస్తూ ఉంటారు. ఒకసారి అడవిలోకి వెళితే వారం రోజులపాటుతిరిగి ఇంటికి రారు. కత్తి మీద సాములా నిర్వహిస్తున్న వీరి ఉద్యోగానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో చనిపోయిన వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.

నల్లమల సంరక్షణలో కీలకంగా పనిచేస్తున్న వాచర్లను ఫారెస్ట్ శాఖ పట్టించుకోవడం లేదు. కుటుంబాలను వదిలిపెట్టి నిత్యం వన్యప్రాణులు, స్మగ్లర్లు, కార్చిచ్చులతో సవాహం చేసే వాళ్లకు ఎలాంటి భద్రత కల్పించడం లేదు. చిట్టడివిలో తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి గరిపే వారికి కనీస జీతభత్యాలు కూడా ఇవ్వడంలేదు. జంతువుల దాడిలోనూ ఇతర ప్రమాదాల్లోనూ చనిపోతే కుటుంబానికి ఎక్స్గ్రేషియా, బీమా లాంటి సౌకర్యాలు కూడా అందించడం లేదు. ఇప్పటివరకు అప్పర్ ఫ్లాట్ ఏరియాలో 15 మందికి పైగా చనిపోయినట్లు అటవీ శాఖలెక్కలు చెబుతుంది. అంతేకాదు పోడు భూముల పంచాయితీలో వీలే బలవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఆదేశాల మేరకు పోడు సాగును అడ్డుకోవలసి రావడంతో స్థానిక రైతులతో శత్రుత్వం పెరుగుతుంది.

ఇది చదవండి: భద్రాచలం అడవుల్లో స్టడీ టూర్ .. వెళ్లిన వారి అనుభవం ఇదే..!

నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 2,611 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీన్ని మూడు బ్లాకులుగా విభజించారు. వీటిలోఅచ్చంపేట, అమ్రాబాద్, మున్ననూరు, దోమల పెంట, లింగాల, మద్దిమడుగు, కొల్లాపూర్ రేంజ్ లో 276 బేస్ క్యాంపులుగా విభజించారు. గతంలో నాలుగైదుకు ఉన్న పెద్దపులులు 2022న చివరి నాటికి 26కు చేరాయి. చిరుతపులులు, వెలుగుబంట్లు, మనుబోతులు, తోడేళ్లు, నక్కలు లాంటి వన్యప్రాణులు వందల్లో ఉండగా.. జింకలు, నెమళ్లు, అడవి పందులు ఇతర జంతువులుపక్షులు లక్షల్లో ఉన్నాయి. నల్లమలతో పాటు 130 కిలోమీటర్ల మేరకు పైగా పారుతున్న కృష్ణానది ఆధారంగా చేసుకొని ఇవి జీవనం సాగిస్తున్నాయి.

ఇది చదవండి: మారిన రేవంత్ పాదయాత్ర వేదిక.. కొత్త వేదిక ఇదే..!

ఐటీఆర్ పరిధి లెక్క ప్రకారం 300 వరకు ఫారెస్ట్ వాచర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం వందలోపే ఉన్నారు. దీంతో వీరిపైనే అదనపు భారం పడుతుంది. సరిపడా బీట్ ఆఫీసర్లు లేకపోవడం కూడా వీరిపైనే ఒత్తిడి పెరుగుతుంది. ఫారెస్ట్ శాఖ ఇటీవల 50 మంది వరకు బీట్ ఆఫీసర్లను నియమించగా ఒత్తిడి తట్టుకోలేక దాదాపు 25 మంది మధ్యలోని ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీన్ని బట్టి నల్లమల్లలో ఉద్యోగం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వాచర్ల ఉద్యోగం పులిపై స్వారీ లాంటిది. ఒకసారి డ్యూటీలోకి వెళ్లారు అంటే వారం రోజులపాటు అడవిలోనే ఉంటూ మద్దిమడుగు, పెంట్రాల చైన్ బేస్ క్యాంపుతో పాటు కృష్ణా తీరాన్ని గస్తికాయాలి. గున్న పెంట నుంచి మొదలయ్యే పెట్రోలింగ్ డ్యూటీ పెద్దరేవు, కసంరేవు, గీతగండి, గద్దలసిరి, ముత్యాలమ్మగడ్డ, నల్లవాగు వరకు సాగించాలి.

అడవి మధ్యలో నిర్మించిన సాసర్లలలో జంతువులకు తాగునీటిని సప్లై చేయడం, ఆర్ఎఫ్ డీలు, మట్టి రోడ్లు నిర్మాణం, సీసీ కెమెరాలు ఏర్పాటు బాధ్యత కూడా వీరిదే. ఎప్పుడు ఎక్కడ అడవి తగలబడినా ముందు వరుసలో వీళ్ళే ఉండాలి. అడవి జంతువులతో పాటు స్మగ్లర్ల దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. వాచర్లలో పెంటలు, తాండాలు, గుడాల్లో ఉండే చెంచులు గిరిజనులు, దళితులే ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరు 10, 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీరిని కాంట్రాక్ట్ కింద నియమించుకొని ఏజెన్సీల ద్వారా నెలకు 8,884 రూపాయలు జీతం మాత్రమే ఇస్తుంది.

ఇవి కూడా ఒక్కోసారి రెండు, మూడు నెలల దాకా రావు. ఈ డబ్బులతోనే బైక్ మెయింటెనెన్స్ తో పాటు కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగినా అనారోగ్యంతో చనిపోయినా పట్టించుకునే దిక్కు ఉండడం లేదు. ఏజెన్సీలు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకపోవడంతో దానికి నోచుకోవడం లేదు. వివిధ కారణాలతో ఇటీవల చనిపోయిన బయ్యన్న, బాలకృష్ణ, లక్ష్మణ్ కుటుంబాలను పట్టించుకోకపోతే ఆఫీసర్లు, సిబ్బంది చందా వేసుకొని వారికి సాయం చేశారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు