హోమ్ /వార్తలు /తెలంగాణ /

వాడీ వేడిగా సర్వసభ్య సమావేశం.. అధికారులపై ఎమ్మెల్యేల ఆగ్రహం..

వాడీ వేడిగా సర్వసభ్య సమావేశం.. అధికారులపై ఎమ్మెల్యేల ఆగ్రహం..

X
అధికారులపై

అధికారులపై ఎమ్మెల్యేల ఆగ్రహాం

Telangana: నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గతంలో ఎన్నడు లేని విధంగా వాడి వేడిగా కొనసాగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గతంలో ఎన్నడు లేని విధంగా వాడి వేడిగా కొనసాగింది. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజులు అధికారులపై మండిపడ్డారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన తాము ప్రజల్లోకి వెళితే ప్రశ్నలు ఎదురవుతున్నాయని నిలదీశారు. పనులు చేపట్టే విషయంలో విధులు నిర్వహించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఈ అంశాలపై కలెక్టర్ ఉదయ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఉన్నతాధికారి నుంచి ఎలాంటి సమాచారం అందదని, పనులు చేపట్టడం, పనుల స్థితిగతులు, పూర్తయిన తర్వాత వాటి వివరాలు ఏవి కూడా ఎమ్మెల్యేలకు కనీసం కూడా చెప్పడం లేదని ఆరోపణలు చేశారు. దీంతో జిల్లా పరిషత్ సమావేశం ఒకసారిగా వాడి వేడిగా కొనసాగింది.

వేసవిలో అందించే సాగునీటి సదుపాయాల గురించి, వైద్య సదుపాయాల గురించి నల్లమల అటవీ ప్రాంతంలో చేపట్టే ఏర్పాట్ల గురించి, ఏమాత్రం తమకు సమాచారం లేదన్న అంశాలను లేవనెత్తారు.జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి తమ కిందిస్థాయి అధికారులను కాకుండా జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ బి. శాంతకుమారి ఆదేశించారు.

ఈ సందర్భంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ.. మండల సర్వసభ్య సమావేశానికి సంబంధిత శాఖల నుండి డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు హాజరు కావడం లేదని, దానివల్ల మండలంలో పరిష్కారం కావాల్సిన సమస్యలు జిల్లా స్థాయికి వస్తున్నాయన్నారు.అందువల్ల మండల సర్వసభ్య సమావేశాలకు అన్ని శాఖల తరపున అధికారులు హాజరు అయ్యేవిధంగా చూడాలని సూచించారు.

ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ ద్వారా ఇంకా ఎక్కడైన నల్లా కనెక్షన్లు, లైన్లు ఇవ్వని ప్రాంతాల్లో వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు తాగు నీటి సమస్య లేకుండా చూడాలని సూచించారు. అచ్ఛంపేట నియోజకవర్గంలో కొన్ని చోట్ల సరిపడా నీరు రావడం లేదని అదేవిధంగా సాంకేతిక కారణాలవల్ల అచ్చంపేటకు రావాల్సినంత నీరు రావడం లేదన్నారు.

స్పందించిన మిషన్ భగీరథ ఎస్.ఈ వెంకటరమణ వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అన్నారు.విద్యుత్ శాఖ సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ల ఏర్పాటు చాలా ఆలస్యం జరుగుతున్నదని, ఓవర్ లోడ్సమస్య లెవనెత్తుతూ విద్యుత్ శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో ఫోన్ ఇన్ స్పీకర్ పెట్టి మాట్లాడారు.ఏ సమస్య ఉన్నా త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అటవీశాఖపై సమీక్ష సందర్భంగా.. అచ్ఛంపేటలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి అటవీ శాఖకు సంబంధించిన పాతభవనాన్ని తొలగించాల్సి ఉందని, అందుకు ప్రతిఫలంగా మరోచోట స్థలం కేటాయింపు కానీ లేదా పరిహారం చెలించడం జరుగుతుందన్నారు.ఉమామహేశ్వరం వద్ద చెక్ పోస్ట్ పెట్టడం వల్ల భక్తులకు ఇబ్బందులు కలుగుతుందని అక్కడ చెక్ పోస్ట్ అవసరం లేదన్నారు.

చెంచులు ప్రతి సంవత్సరం సలేశ్వరం జాతర 15 రోజులు ఘనంగా జరుపుకుంటారని, దానిని ఈసారి రెండు రోజులకు కుదించడం సరికాదన్నారు.చెంచులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలుతీసుకోవాలని అటవీ శాఖ అధికారిని సూచించారు.చెక్ పోస్ట్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత నిధులు సంబంధిత గ్రామాభివృద్ధికి కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య కళాశాలఏర్పాటు అయినప్పటికిని వైద్యసేవలో పెద్దగా మార్పు రాలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు.మంజూరు అయిన వైద్య పోస్టులను సకాలంలో భర్తీ చేసే ప్రక్రియ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్య అధికారులను నిలదీశారు.సకాలంలో పోస్టులు భర్తీ చేయక ఉన్న డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్నారు. అలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం పరిపాటిగా మారిందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రోజువారీ అవుట్ పేషంట్ ల సంఖ్య పెరగాలని అందుకు ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల పై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సబ్ సెంటర్ల మరమ్మతుకు సంబంధించి త్వరగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని పంచాయతిరాజ్కార్యనిర్వాహక ఇంజనీరును సూచించారు.ఆర్ అండ్ బి, పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని తెలియజేసారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు