Home /News /telangana /

NAGAR KURNOOL GADWALA DISTRICT CRIME REPORT

Nagarkurnool: గద్వాల జిల్లాలో హత్యలు, అదృశ్యాలు: జిల్లాలో నేటి క్రైమ్ రౌండప్

గద్వాల జిల్లాలో హత్యలు, అదృశ్యాలు

గద్వాల జిల్లాలో హత్యలు, అదృశ్యాలు

భార్యపై అనుమానంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త. మానపాడు మండలానికి చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కనిపించకుండా పోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు దుండగులు కాజేసిన ఘటన మంగళవారం బోయిన్‌పల్లి గేట్ వద్ద జరిగింది

ఇంకా చదవండి ...
  (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

  అనుమానంతో భార్యను చంపిన భర్త:
  అనుమానం పెనుభూతమై పచ్చని వారి సంసారాన్ని నాశనం చేసింది. భార్యపై అనుమానంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మాచెర్ల గ్రామానికి చెందిన మాల తాయప్పకు అయిజ గ్రామానికి చెందిన పార్వతమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం ఉన్నారు. పార్వతమ్మ (35)పై అనుమానం పెంచుకున్న భర్త తాయప్ప, గత కొన్ని రోజులుగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో పార్వతమ్మ కుల పెద్దలను ఆశ్రయించడంతో వారు పంచాయితీ నిర్వహించి భార్య, భర్తలకు సర్దిచెప్పారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తాగివచ్చిన తాయప్ప, భార్యతో మళ్లీ గొవడకుదిగాడు. అనుమానంతో పార్వతమ్మపై దాడి చేసి గొంతు నులిమి చంపేశాడు. ఎవరికి అనుమానం రాకుండా అర్ధరాత్రి పార్వతమ్మ మృతదేహాన్ని బల్గెరా గ్రామానికి చేరుకునే దారిలో పడేశాడు. సోమవారం అటుగా కొందరు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పార్వతమ్మ సోధరి సరోజ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. నిందితుడు తాయప్ప పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  ముగ్గురు పిల్లలతో మహిళ అదృశ్యం:
  జోగుళాంబ గద్వాల జిల్లా మానపాడు మండలానికి చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కనిపించకుండా పోయింది. మానపాడు ఎస్.ఐ సంతోష్ అందించిన వివరాల ప్రకారం మానపాడు మండలం కొరిపాడు గ్రామానికి చెందిన షమీబినాకు ఉండవెల్లి మండలం బస్వాపురాని చెందిన మస్తాన్ తో 2001లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో గతేడాది మస్తాన్ చనిపోవడంతో ముగ్గురు పిల్లలతో కలిసి షమీబినా తన పుట్టింటికి చేరింది. భర్త మృతి చెందడంతో మానసికంగా కృంగిపోయిన షమీబినా పిల్లల భవిష్యత్తు గురించి బంధువులతో చర్చిస్తూ ఉండేది. ఈక్రమంలో జులై 16 నుంచి షమీబినా తన ముగ్గురు పిల్లలతో కలిసి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు గాలించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మానపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

  మహబూబ్‌నగర్‌లో పెరుగుతున్న చైన్ స్నాచింగ్‌లు:
  మహబూబ్‌నగర్ పట్టణంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసును దుండగులు కాజేసిన ఘటన మంగళవారం బోయిన్‌పల్లి గేట్ వద్ద జరిగింది. బోయన్‌పల్లి గేట్ వద్ద ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం కోడూర్ గ్రామానికి చెందిన గౌనికాడి విజయ.. బోయిన్ పల్లిలో నివాసముంటున్నారు. ప్రైవేటు కళాశాలలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో 2 తులాల మంగళసూత్రాన్ని దుండగులు అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతున్నాయి. జన సంచారం ఎక్కువ లేని ప్రాంతాల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకొని దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime, Local News, Nagarkurnool, Police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు