హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: మహిళల ఆర్థిక అభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు.., స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారు

Nagarkurnool: మహిళల ఆర్థిక అభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు.., స్వయం ఉపాధిలో ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారు

X
నాగర్

నాగర్ కర్నూల్‌లో మహిళలక ఉచిత శిక్షణ

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా బ్యాంకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. కుట్లు, అల్లికలు, లేటెస్ట్ ఫాషన్ డిజైన్లతో ఎంబ్రాయిడింగ్ వర్క్స్ పై ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్స్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool | Mahbubnagar | Telangana

Naveen Kumar, News18, Nagarkurnool

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా బ్యాంకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. కుట్లు, అల్లికలు, లేటెస్ట్ ఫాషన్ డిజైన్లతో ఎంబ్రాయిడింగ్ వర్క్స్ పై ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్స్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నాగర్ ‌కర్నూల్ జిల్లా (Nagar Kurnool) కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఎంబ్రాయిడింగ్ శిక్షణ తరగతులకు స్థానిక మహిళలు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఈ శిక్షణ తరగతులు జరుగునున్నాయి. శిక్షణ తరగతులకు హాజరయ్యే మహిళలకు మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం వేళ స్నాక్స్ కూడా అందించనున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసుగల మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకోవడానికి తాము ప్రోత్సహిస్తున్నామని ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ సత్తన్న చెప్పారు.

న్యూస్ 18తో ప్రత్యేకంగా మాట్లాడిన సత్తన్న ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 8000 మంది మహిళలకు ఈ కుట్లు, అల్లికల ఎంబ్రాయిడింగ్ శిక్షణ తరగతులు అందించామని చెప్పుకొచ్చారు. బ్యాంకర్స్ అసోసియేషన్ ద్వారా శిక్షణ అందుకున్న మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ ఆర్థికంగా స్థిరపడినట్లుగా వివరించారు.

ఇది చదవండి: వడ్డీపై రాయితీ మాట ఉత్తిదేనా? నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు..

ఈ శిక్షణ తరగతులు ముగిసిన తర్వాత బ్యాంకర్ల అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్ అందిస్తామని దీంతో పాటుగా ఎవరైనా మహిళలు వ్యాపారం ప్రారంభించుకునేందుకు లోన్ సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా తమ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది గృహిణిలు ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు.

అయితే ఈ శిక్షణ తరగతులకు హాజరు కావాలనుకునే మహిళలు తమ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డుతో నమోదు చేసుకోవాల్సిందిగా కోఆర్డినేటర్ సత్తన్న తెలిపారు. తాము ఎంతో మందికి ఉపాధి కల్పించామని ప్రస్తుతం తాము శిక్షణలు అందించిన ఎంతో మంది మహిళలు సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడినట్లుగా వివరించారు. ఇలాంటి సదవకాశాన్ని ఉపయోగించుకొని మహిళలంతా ఎంబ్రాయిడింగ్ పనులను నేర్చుకోవాల్సిందిగా కోరారు. 100 మంది వరకు నేర్పేందుకు తమ దగ్గర అందుబాటులో సామాగ్రి ఉన్నాయని, నాగర్‌కర్నూల్‌లోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Local News, Nagarkarnol district, Telangana

ఉత్తమ కథలు