Home /News /telangana /

NAGAR KURNOOL FOUR PEOPLE DIED IN SPEPERATE INCIDENTS IN WANAPARTHY DISTRICT ABH BRV NNK

Nagarkurnool: వెంటాడిన ఆర్ధిక ఇబ్బందులు: కూతురి పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య

వనపర్తి ఎస్పీ కార్యాలయం

వనపర్తి ఎస్పీ కార్యాలయం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న ఓ తండ్రి కూతురి పెళ్ళి చేయలేకపోతున్నాననే బాధతో  పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరు గ్రామంకు చెందిన

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India
  (N.Naveen Kumar, News 18, NagarKurnool)

  విద్యుత్ షాక్‌తో రైతు మృతి; ఉమ్మడి వనపర్తి జిల్లాలో వరుస విద్యుత్ ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా పొలాల్లో బోర్ల వద్ద విద్యుత్ తీగలు తగిలి రైతులు మృత్యువాత పడుతున్నారు. వీపనగండ్ల మండలం సంకినేనిపల్లి గ్రామంలో గురువారం రైతు విద్యుత్ షాక్ తో మృతిచెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం పల్లె ఆంజనేయులు (45) తన పొలం సమీపంలోలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజులు అమర్చేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో రైతు ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  కూతురి పెళ్లి చేయలేక వ్యక్తి ఆత్మహత్య:
  ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న ఓ తండ్రి కూతురి పెళ్ళి చేయలేకపోతున్నాననే బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం మద్దూరు గ్రామంకు చెందిన గుర్రం నాగరాజు (40) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు. ఇటీవలే కుమార్తె వివాహం నిశ్చయమైంది.పెళ్లి చేయడానికి డబ్బులు సమకూరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆంజనేయులు...పొలానికి వెళ్లి పురుగుల మందు తాగాడు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. నాగరాజుకు భార్య పావని, కూతురు, కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  భార్య కాపురానికి రాలేదని యువకుడి ఆత్మహత్య: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. కదిరా ఎస్సై భగవంతు రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం దేవరకద్రకు చెందిన గోపి వెంకటేష్ (22)కు కొన్ని నెలల క్రితమే వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో నెల క్రితం భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనోవేదనకు గురైన వెంకటేష్ జూలై 15న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం వెంకటేష్‌ను హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  వలస కూలి అనుమానాస్పద మృతి:జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద తాండ్రపాడులో వలస కూలి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన గొల్ల కృష్ణయ్య (40) 12 ఏళ్ల క్రితం పెద్ద తాండ్రపాడుకు చెందిన నాగమ్మ దండు నరసప్ప వద్ద గొర్రెల కాపరిగా పనిలో చేరాడు. అప్పుడప్పుడు సొంత ఊరికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి వచ్చేవాడు. ఈ క్రమంలో బుధవారం కృష్ణయ్య కనిపించడం లేదని ఇంట్లో నుంచి రూ.25000 తీసుకొని వెళ్ళాడని నాగమ్మ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా తమ ఇంటికి కూడా రాలేదని సమాధానం ఇచ్చారు. గురువారం ఉదయం మళ్లీ ఫోన్ చేసి కృష్ణయ్య కాలువలో పడి చనిపోయాడని సమాచారం ఇచ్చారు. కృష్ణయ్య మృతి పై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు దండు నరసప్ప, నాగమ్మలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  Read This: Rajanna Sircilla: అన్నదమ్ముల మధ్య పోరు తప్పదా!: ఆసక్తిగా ఆ నియోజకవర్గ పాలిటిక్స్ 
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు