హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: భవిష్యవాణి వినిపించిన వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకం.. కనుమరుగవుతున్న కళ

Nagarkurnool: భవిష్యవాణి వినిపించిన వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకం.. కనుమరుగవుతున్న కళ

X
ఎరుకల

ఎరుకల సోది

వీరు చెప్పే విషయాలు అన్నిసార్లు నిజం కాకపోవచ్చు కానీ, నిస్పృహల్లో ఉన్న ఒక మనిషికి నమ్మకం, దైర్యం కలిగించే విధంగా ఎరుకలి చెప్పే విధానం "నేటి ఫిలాంత్రఫిస్ట్"లకు ఏమాత్రం తీసిపోదని చెప్పాలి. అటువంటి ఎరుకలి సోది వృత్తి క్రమక్రమంగా అంతరించి పోతుంది.

ఇంకా చదవండి ...

(N. Naveen Kumar, News18, Nagarkurnool)

"సోది చెబుతామమ్మ సోదీ (Sodi) చెబుతాం.. జరిగింది చెబుతాం.. జరగబోయేది చెబుతాం.. ఉన్నది ఉన్నట్టు చెబుతాం.." అంటూ గ్రామాల్లో భవిష్యవాణి (prophecy), జ్యోతిష్యం చెప్తూ జీవనం సాగిస్తుంటారు ఎరుకల స్త్రీలు. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం ఈ ఎరుకల స్త్రీలు ఇంటింటికీ తిరిగి ప్రజలకు వారి భవిష్యవాణి వినిపించేవారు. 'ఎరుక' అంటే తెలిసింది చెబుతామనే అర్థం వస్తుంది. పూర్వం నుంచి ఈ కళ (Art) కూడా ఒక కుల వృత్తిగా కొనసాగుతూ వచ్చింది. వీరు చెప్పే విషయాలు అన్నిసార్లు నిజం కాకపోవచ్చు కానీ, నిస్పృహల్లో ఉన్న ఒక మనిషికి నమ్మకం, దైర్యం కలిగించే విధంగా ఎరుకలి చెప్పే విధానం "నేటి ఫిలాంత్రఫిస్ట్"లకు ఏ మాత్రం తీసిపోదని కచ్చితంగా చెప్పాలి. పైకి మాటల రూపంలోనే సోది చెబుతున్నా ఈ వృత్తి ఆచరించడంలో ఎంతో కళాత్మకత దాగి ఉంది. అటువంటి ఎరుకలి సోది (Erukala sodi) వృత్తి క్రమక్రమంగా అంతరించి పోతుంది. వీరికి ఆదరణ లేకపోవడంతో జీవనోపాధి కోసం ఎరుకల మహిళలు ఇతర కూలీ పనులకు వెళ్లే పరిస్ధితులు ఏర్పడ్డాయి.

అంతరించిపోతున్న ఎరుకల సోది గురించి భవిష్యత్తు తరాల వారికీ తెలియజేయడం కోసమే న్యూస్ 18 ఈ ప్రత్యేక కథనం. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం పర్వతాపురం గ్రామంలో ఎరుకలి సోది చెప్పే వలిగ తిరుపతమ్మ (Thirupathamma) ఎంతో పేరుగాంచింది. కుల వృత్తిని నమ్ముకొనే ఇప్పటికి జీవనం కొనసాగిస్తుంది. తిరుపతమ్మ కలిసి ఆమె జీవన విధానం పరిశీలించడంతో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఎరుకలి సోది ఏ విధంగా చెబుతారు.. సోది (Fortune telling) చెప్పే వారి వేషదారణ ఏవిధంగా ఉంటుంది, ఎలాంటి ప్రక్రియలతో సోది చెబుతారు.. వారి వృత్తి జీవితం ఏవిధంగా ఉంటుందనే అంశాలను వలిగ తిరుపతమ్మ కళ్లకు కట్టినట్టు చూపించారు.


ఎరుకల నాంచారమ్మ జీవన విధానం:

ఎరుక చెప్పే స్త్రీలను ఎరుకల నాంచారమ్మ అనికూడా పిలుస్తారు. ఇది వారికి ఎంతో గౌరవ ప్రదమైన పిలుపు. సోది చెప్పేందుకు వెళ్లే ముందు వారిని వారు ఎంతో ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని ఇల్లు శుభ్రం చేసి, సోది బుర్రని తుడిచి, పసుపు రాసి కుంకుమతో అలంకరిస్తారు. నుదుటన పెద్దబొట్టుతో, కొప్పు నిండా పూలు పెట్టుకొని నెత్తి బుట్ట, చేతిలో కిన్నెరను పట్టుకుని ఎరుకల నాంచారమ్మ బయలుదేరుతుంది. సమీప గ్రామాల్లోకి చేరుకొని, వీధి వీధి తిరుగుతూ చేతిలోని కిన్నెరను వాయిస్తూ "సోది చెబుతామమ్మ సోదీ చెబుతాం..... జరిగింది చెబుతాం.... జరగబోయేది చెబుతాం.... ఉన్నది ఉన్నట్టు చెబుతాం...." అంటూ పిలుస్తారు. సోది చెప్పేటప్పుడు తమ కుల దైవం ప్రతిమను బియ్యంలో పెట్టి, ఆకు వక్కలు సమర్పించి దణ్ణం పెట్టుకుంటారు. దేవతలందరినీ తలుచుకుని వాక్కు ఇవ్వమని వేడుకుంటారు.

సోది చెప్పే సమయంలో చెప్పించుకునే వారి ద్వారా చాటలో బియ్యం, తమలపాకులు, వక్కలు, పసుపు, కుంకుమ, డబ్బులు పెట్టించి సోది ప్రారంభిస్తారు. చాటలో పచ్చ జొన్నలు పోసి, వాటిని తిప్పుతూ కిన్నెరను వాయిస్తూ దేవాత మూర్తులను ఆవహనం చేసుకుంటుంది నాంచారమ్మ. ఏడుకొండల వెంకన్న స్వామి, శ్రీశైలం మల్లన్న స్వామి, బెజవాడ కనకదుర్గమ్మ, మద్దిమడుగు అంజన్న స్వామి, మేడారం సమ్మక్క, సారలమ్మలు, మైసమ్మ, ఈదమ్మ, పోచమ్మ, ఆంకాలమ్మ ఇలా 101 మంది దేవాతామూర్తులను ప్రార్ధించి వారిని వేడుకుంటూ సోది చెబుతారు.

సోదే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు:

ప్రస్తుత ఆధునిక యుగంలో మనుషులు చదువుకు ప్రాధాన్యం పెరిగి ప్రజలు అన్ని విషయాలను తేలికగా అర్ధం చేసుకోగలుగుతున్నారు. కానీ పూర్వ కాలంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. మూఢనమ్మకాలు అధికంగా ఉన్న రోజుల్లో ప్రతి విషయాన్నీ దేవుడి కార్యంగా చెబితేనే ప్రజలు శ్రద్ధ పెట్టేవారు. ఇప్పుడున్న మానసిక నిపుణులు, ఫిలాంత్రఫిస్ట్‌లకు ఏ మాత్రం తీసిపోని వారు ఈ సోది నాంచారమ్మలు. కుటుంబ సమస్యలు, జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు వెంటాడుతూ.. నిరాశానిస్పృహలో చిక్కుకున్న మనుషులకు ఓదార్పు అందించి, వారిలో కొండంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తూ ముందుగు సాగేలా సోది నాంచారమ్మలు చేసే మ్యాజిక్ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మూఢనమ్మకాలను పక్కనబెడితే సోది ద్వారా అర్ధం చేసుకోవాల్సిన విషయం ఒకటి బోధపడుతుంది. అదేంటంటే..'కృతనిశ్చయంతో మీరు మొదలుపెట్టిన పనిపై పూర్తిగా మనసు పెడితే..పంచభూతాలు ఏకమై నీకు సహాయం చేస్తాయి\".

క్రమక్రమంగా అంతరించి పోతున్న సోది వృత్తి:

గ్రామీణ ప్రజలకు జోతిష్యం చెప్పేందుకు ప్రధాన ఆధారమైన ఎరుకలి సోది వృత్తి క్రమక్రమంగా అంతరించి పోతుంది. ఎరుకలి సోది చెప్పించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎరుకలి మహిళలు ఉపాధిని కోల్పోతున్నారు. అమ్మమ్మలు, నానమ్మల నుంచి వంశ పారంపర్యంగా నేర్చుకున్న కళకు ఆదరణ తగ్గడంతో నేడు ఉపాధి కరువైందని వలిగ తిరుపతమ్మ చెబుతున్నారు. ఎన్ని గ్రామాలు తిరిగినా రోజుకు ఒక్కరు కూడా సోది చెప్పించుకోవడం లేదని చెబుతున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం

పర్వతాపురం గ్రామానికి చెందిన ఎరుకల సోది

వలిగ తిరుపతమ్మ ఫోన్ నెంబర్ 9553447927.

First published:

Tags: Culture, Local News, Nagarkurnool

ఉత్తమ కథలు