Home /News /telangana /

NAGAR KURNOOL FOREST OFFICIALS GIVE PERMISSION FOR SALESWARAM FESTIVAL IN NAGARKURNOOL DISTRICT SNR MBNR

Saleshwaram Temple: ఈసారి మూడ్రోజులే దర్శనం.. ఆ కండీషన్స్‌ పాటిస్తేనే

(సలేశ్వరం ఉత్సవాలు)

(సలేశ్వరం ఉత్సవాలు)

Nagarkurnool:నల్లమల అటవీ ప్రాంతం..దట్టమైన అడవుల్లో కొలువైన లింగమయ్యస్వామిని దర్శించుకునే భాగ్యం ఈసారి భక్తులకు కలుగుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగే ఈఉత్సవాలకు అటవీశాఖ అధికారులు భక్తులకు కొన్ని కండీషన్స్‌తో కూడిన పర్మిషన్ ఇచ్చారు. ఈసారి మూడ్రోజుల పాటే ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

ఇంకా చదవండి ...
    నల్లమల అటవీ ప్రాంతం. చుట్టూ అభయారణ్యం. అద్భుతమైన జలపాతం దగ్గర కొలువైన లింగమయ్యస్వామి పేరుతో జరిగే ఉత్సవాలే సలేశ్వరం ఉత్సవాలు. తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లాలో ఏటా జరిగే సలేశ్వరం లింగమయ్యస్వామి ఉత్సవాలు గతేడాది కరోనా కారణంగా రద్దు చేశారు అధికారులు. ఈసారి కొన్ని నిబంధనలతో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పాటించిన నిబంధనలను వెల్లడిస్తూ అటవీశాఖ (Forest officials)అనుమతులు జారీ చేసింది. ఏటా ఐదు రోజుల పాటు జరిగే ఏ ఉత్సవాల కోసం ఈసారి కేవలం మూడ్రోజులే అనుమతి ఇచ్చారు. ఈనెల 15వ తేది నుంచి 17వ తేది వరకు సలేశ్వరం (Saleswaram)లింగమయ్యస్వామి (Lingamayyaswamy) ఉత్సవాలు జరగనున్నాయి. నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లా అమ్రాబాద్ (Amrabad)మండలంలోని అటవీ ప్రాంతంలో ఈ ఉత్సవాలు ఏటా జరుగుతూ ఉంటాయి. అయితే అడవిలోని వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉత్సవాలు జరిగే మూడు రోజులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సలేశ్వరం వెళ్లే భక్తులకు అనుమతి ఉంటుందని అమ్రాబాద్ అభయ రణ్య ప్రాంత ఎఫ్‌డీఓ రోహిత్ గోపిడి (Rohit Gopidi) తెలిపారు.

    అడవిలో ఉత్సవాలు..
    హైదరాబాద్ నుంచి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంది. శ్రీశైలం-హైదరాబాద్ హైవే పై మన్ననూర్ నుంచీ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరహాబాద్ మెయిన్ సెంటర్ దగ్గరకు ముందుగా వెళ్లాలి. అక్కడి నుంచి దట్టమైన అడవుల్లో ఉండే సలేశ్వరానికి వెళ్లే మార్గం 30 కిలోమీటర్ల దూరం వరకు ఏవో వాహనాలు అందుబాటులో ఉంటాయి. రాంపూర్ పెంట నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు ఆటోలు వెళ్తాయి. అక్కడి నుంచి స్వామివారి దేవాలయానికి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం ఉండదు. కొండలు, గుట్టలు, దాటుకుంటూ మూడు కిలోమీటర్లు వెళ్తేనే సలేశ్వరం టెంపుల్ వస్తుంది.

    సలేశ్వరం ఓ దివ్యక్షేత్రం..
    నల్లమల అడవి ప్రాంతం దట్టమైన అభయారణ్యమే కాదు ఎంతో మహిమ కలిగిన సలేశ్వరం లింగమ్మస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అందుకే లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలు జరిగే రోజుల్లో ఇక్కడకు వచ్చి దర్శించుకోవాలని ఏడాది పొడవున ఎదురుచూస్తుంటారు. రవాణా సౌకర్యాలు పూర్తిగా లేని ఇలాంటి ప్రాంతానికి వచ్చే భక్తుల శ్రేయస్సుతో పాటు వారికి కల్పించే ఏర్పాట్ల విషయంపై పలు సూచనలు, ఆదేశాలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిలో ఫరహాబాద్‌ చెక్‌పోస్ట్ దగ్గర ఫారెస్ట్ అధికారులు వాహనాలు తనిఖీ చేసి అనుమతిస్తామని తెలిపారు. గతంలో రాత్రి వేళల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది. అయితే ఈసారి వాహనాల శబ్ధానికి వన్యప్రాణాలు బెదిరిపోయి వాహనాల కింద పడే అవకాశముండటంతో రాత్రి వేళల్లో వాహనాల అనుమతిని రద్దు చేశారు.

    లింగమయ్యగా మహాశివుడు..
    ఇక సలేశ్వరం ఉత్సవాల్లో కాలుష్యం చేరకుండా ఉండేందుకు ప్లాస్టిక్ వస్తువులను నిషేధించారు అటవీశాఖ అధికారులు. ఉత్సవాలకు వెళ్లే భక్తులు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అడవిలోకి తీసుకెళ్లడానికి వీల్లేదేని స్పష్టం చేశారు. దాహం తీర్చుకునేందుకు మంచినీళ్లు, ఆహార పదార్ధాలు, స్నాక్స్ వంటి వాటిని ప్లాస్టీక్‌ లేకుండా తీసుకెళ్లవచ్చని సూచించారు. అంతే కాదు సలేశ్వరం ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో అడవిలో భోజనం, మంచినీళ్లు సప్లై చేసే వాళ్లు సైతం ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.

    కండీషన్స్‌తో కూడిన పర్మిషన్..
    ఎండాకాలం, అటవీ ప్రాంతం కావడంతో పొగత్రాగడం, మద్యపానం వంటి వాటిని కూడా పూర్తిగా నిషేధించారు. మార్గం మధ్యలో భక్తులు ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. ఎండాకాలం అడవిలో వన్యప్రాణులు ఆకలి, దాహంతో ఎక్కువగా తిరుగుతాయని..అలాంటి సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఎవరూ వన్యప్రాణుల జోలికి పోవద్దని హెచ్చరించారు అటవీశాఖ అధికారులు. ఏధైనా అగ్నిప్రమాదం జరిగితే నియంత్రించేందుకు ఆమ్రాబాద్‌ అడవిలో ఫైర్ సేఫ్టీ సిబ్బందితో పాటు ఫైర్ వాచర్లు అందుబాటులో ఉంచారు. సలేశ్వరం ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు స్వామివారి అనుగ్రహం పొందాలనుకునే వారు అటవీశాఖ నిబంధనలు పాటిస్తూ వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులకు సహాకరించాలని సూచిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nagar kurnool, Saleswaram

    తదుపరి వార్తలు