హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: 40ఏళ్లుగా రంగస్థలంపై ఆధారపడి కళకళలాడిన జీవితాలు .. ఇప్పుడు సర్కారు సాయం కోరుతున్నాయి

Nagarkurnool: 40ఏళ్లుగా రంగస్థలంపై ఆధారపడి కళకళలాడిన జీవితాలు .. ఇప్పుడు సర్కారు సాయం కోరుతున్నాయి

X
(కళ

(కళ తప్పిన జీవితాలు)

Nagarkurnool: పౌరాణిక, జానపద కళలకు వస్త్ర, వేషధారణలు ఎంత ముఖ్యమో అప్పటి తరం ప్రజలకు తెలుసు. ఆ కళలు అంతరించి పోకుండా, తమ వంతుగా నేటి తరం యువతీయువకులకు పౌరాణిక, జానపదాల పట్ల ఆసక్తి కలిగేలా నాగర్‌కర్నూల్ జిల్లాలోని కళాభారతి కృషి చేస్తుంది.

ఇంకా చదవండి ...

(N.Naveen Kumar,News18,Nagarkurnool)

పౌరాణిక, జానపద (Folk drama)కళలు అంతరించిపోతున్నాయి. సినిమాలు, ఓటీటీలకే ప్రేక్షకులు పరిమితం అవుతున్నారు. భారతీయ సాంప్రదాయ కళలు కనుమరుగవుతున్నా నేటి రోజుల్లో ఎక్కడోచోట..ఆ కళలతాలూకు గుర్తులు మిగిలే ఉంటున్నాయి. పౌరాణిక, జానపద కళలకు వస్త్ర, వేషధారణలు ఎంత ముఖ్యమో అప్పటి తరం ప్రజలకు తెలుసు. ఆ కళలు అంతరించి పోకుండా, తమ వంతుగా నేటి తరం యువతీయువకులకు పౌరాణిక, జానపదాల పట్ల ఆసక్తి కలిగేలా నాగర్‌కర్నూల్(Nagarkurnool)జిల్లాలోని కళాభారతి(Kala Bharati)కృషి చేస్తుంది.

గతమెంతో ఘనకీర్తి:

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ కళాభారతి బృందం ఉంది. ఒకప్పుడు శాస్త్రీయ, సాంప్రదాయక, గిరిజన నృత్య కళల శిక్షణా కేంద్రంగా కళాభారతి విరాజిల్లింది. 1977లో కళా పిపాసి శేషబట్టర్ నరసింహ చార్యులు ఈ కళాక్షేత్రాన్ని స్థాపించారు. కళాకారులను, రంగస్థల నటులను ఎంతో ప్రోత్సహించేవారు నరసింహ చార్యులు. దాదాపు 40 ఏళ్లుగా కళలకు అంకితమైన కళాభారతి..నేడు కళ తప్పింది. కరోనా పరిస్థితులు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువై.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంది.

1977లో కళాభారతి స్థాపన:

నాగర్‌కర్నూల్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఉన్న ఈ కళాభారతి క్షేత్రాన్ని కళాపిపాసి శేషబట్టర్ నరసింహచార్యులు 1977లో స్థాపించారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నరసింహచార్యులు ప్రవృత్తిగా నాటకాలు వేసేవారు. కళామతల్లి పట్ల తనకున్న మక్కువతో దేశవ్యాప్తంగా అనేక నాటకాలు వేశారు. రంగస్థల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. నాటకాలు వేస్తున్న క్రమంలో మేకప్ సామాగ్రి కోసం, కస్ట్యూమ్స్ కోసం తరచూ కర్నూలు వెళ్లాల్సి వచ్చేది. నాటకాలు వేసిన ప్రతీసారి కర్నూలు వెళ్లడం, అక్కడ సామాగ్రిని అద్దెకు తీసుకుని.. తిరిగి నాటకం ముగిశాక అప్పగించేవారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చింతమణి, బాలనాగమ్మ వంటి నాటకాలను 3,4 రోజుల తరబడి వేసేవారు. ఇలా నాటకాలు వేస్తున్న క్రమంలో కాస్ట్యూమ్స్ కోసం కర్నూల్ వెళ్లడం ఇబ్బందిగా మారడంతో తానే స్వయంగా డ్రామా, డ్రెస్ కంపెనీని ఏర్పాటు చేయాలని నరసింహచార్యులు ఆలోచన చేశారు. అనుకున్నదే తడువు... స్నేహితులు, బంధుమిత్రుల సహకారంతో వ్యాపార దృక్పధంతో కాకుండా కళకు సేవచేయాలని ఆలోచనతో నాగర్‌కర్నూల్ పట్టణ కేంద్రలో కళాభారతి క్షేత్రాన్ని స్థాపించారు. అప్పటి నుంచి నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్కడ నాటకాలు ప్రదర్శించినా కళాభారతి నుంచే డ్రామా, డ్రెస్ మెటీరియల్ వెళుతూ ఉండేవి. దాదాపు 40 ఏళ్ల పాటు కళాకారులను ప్రోత్సహిస్తూ కళకు జీవం పోస్తూ వచ్చింది కళాభారతి.

సంప్రదాయ కళలను కాపాడే ప్రయత్నం:

భాద్యతగా భావించిన కుటుంబ సభ్యులు: తన జీవితకాలన్ని కళామతల్లికి సేవలు చేసిన శేషబట్టర్ నరసింహచార్యులు 90 ఏళ్ల వయసులో 2021 సెప్టెంబర్ 05న అనారోగ్యంతో మరణించారు. ఆయన అనంతరం వారి కుమారులైన బట్టర్ శ్రీనివాసచార్యులు కళాభారతి బాధ్యతలను స్వీకరించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేటికి కళాకారులను ప్రోత్సహిస్తూ కళాభారతిని నిర్వహిస్తున్నారు. రంగస్థల నాటకాలపై అభిమానంతో ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా కళాభారతి పేరు ప్రఖ్యాతలు ఏమాత్రం తగ్గకుండా శాయశక్తుల కృషిచేసి కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు.

కరోనా ప్రభావంతో ఆర్థికంగా క్షీణించిన కళాభారతి:

నిత్యకళ్యాణం పచ్చతోరణం అనే విధంగా ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమంతో కళకలలాడే కళాభారతి ఇప్పుడు కష్టాల్లో ఉంది. కరోనా ప్రభావం కళాభారతి క్షేత్రంపై కూడా పడటంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జనాలు గుమిగూడే అవకాశం ఉందని నాటకాలకు అనుతులు లభించకపోవడంతో నాటకాలపై కోలుకోలేని దెబ్బపడింది. కళాభారతి నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు కూడా సరిపోక దాదాపు మూసేసి పరిస్థితికి వచ్చింది. ఈ కష్టాల నుంచి గట్టేందుకు నిర్వహకులు బట్టర్ శ్రీనివాసాచార్యులు ప్రభుత్వ సాయం కోరుతున్నారు. ప్రత్యేక గ్రాంటులతో కళను బతికించుకునేందుకు లోన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చేసే సహాయం వలన నాటకరంగాన్ని కాపాడి కళాకారులను ప్రోత్సహించవచ్చని తెలిపారు.

కళాభారతి నిర్వహకులు బట్టర్ శ్రీనివాసాచార్యలు ఫోన్ నెంబర్ :7382149562

First published:

Tags: Local News, Nagar kurnool

ఉత్తమ కథలు