Home /News /telangana /

NAGAR KURNOOL FLOODS AND STUDENT STRIKES AFFECTED THE EDUCATION SYSTEM IN TELANGANA NNK ABH BRV

Nagarkurnool: విద్యావ్యవస్థకు కరోనా గండం పోయి, తుఫాను, బంద్ గండాలు వచ్చాయి

విద్యావ్యవస్థకు కరోనా గండం పోయి, తుఫాను, బంద్ గండాలు వచ్చాయి

విద్యావ్యవస్థకు కరోనా గండం పోయి, తుఫాను, బంద్ గండాలు వచ్చాయి

ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొని ఈ ఏడాది విద్యా సంవత్సరం సాఫీగా సాగుతుందనుకుంటే ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్‌లు ఓ వైపు, విద్యార్థి సంఘాల బంద్‌లు వైపు తరగతులకు ఆటంకం కలుగుతుంది

    (N.Naveen Kumar, News 18, Nagarkurnool)

    తుఫాను సెలవులు, బంద్ పిలుపులతో ఈ ఏడాది కూడా పాఠశాల స్థాయిలో విద్యావ్యవస్థ కుంటుపడుతుంది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే హంసపాదు అన్నట్లుగా...తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడులు ప్రారంభై నెల రోజులు గడిచినా..పట్టు మని పది రోజుల పాటు తరగతులు జరిగింది లేదు. ఎన్నో బాలారిష్టాలను ఎదుర్కొని ఈ ఏడాది విద్యా సంవత్సరం సాఫీగా సాగుతుందనుకుంటే ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్‌లు ఓ వైపు, విద్యార్థి సంఘాల బంద్‌లు వైపు తరగతులకు ఆటంకం కలుగుతుంది. తుఫాను సమయంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వరుసగా పది రోజులు సెలవులు ప్రకటించింది. జులై మొదటి వారం నుంచి రెండో వారం వరకు ఈ సెలవులు కొనసాగగా.. అనంతరం విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యా వ్యవస్థ గాడిన పడే అవకాశం లేకుండా పోతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    కరోనాతో రెండేళ్లు వెనక్కి:
    గడిచిన రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. దీని కారణంగా 2020-21 విద్యా సంవత్సరం కోల్పోయారు విద్యార్థులు. పాఠశాలలపై ఆధారపడ్డ కరస్పాండెంట్లు నిర్వహణ భారమై ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు చూశాం. ఎంతో మంది ఉపాధ్యాయులు ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని విద్యాసంస్థలు నామమాత్రంగా ఆన్లైన్ క్లాసులను నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో తల్లిదండ్రులు వేల రూపాయలు ఖర్చు చేసి స్మార్ట్ ఫోన్లు కొనివ్వగా.. పిల్లలు వాటితో ఆన్లైన్ తరగతులను పక్కనపెట్టి వీడియో గేమ్స్‌కు అలవాటు పడ్డారు. కొందరు తల్లిదండ్రులు ఈ పరిస్థితులు చూసి ఆందోళనకు గురవుతున్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో పరిస్థితి చక్కబడుతుందని ఆశించినా... మూడు నెలలు ఆలస్యంగా సెప్టెంబర్ ఒకటో నుండి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. దీంతో అరకొర జ్ఞానంతోనే ఆ ఏడాది ముగిసింది. ఇక ఈ ఏడాది జూన్ 13 నుంచి ప్రారంభమైన విద్యాసంస్థలు నెలాఖరు వరకు పనిచేశాయి. జులై మొదటి వారం పరిస్థితి కాస్త బాగానే ఉన్నా.. అనంతరం సంభవించిన వరదల కారణంగా జనజీవనం స్తంభించింది.

    వాతావరణ పరిస్థితులు, బంద్‌లు:
    ఊహించని వాతావరణ మార్పుల కారణంగా జులై 8 నుంచి 18 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి తోడు విద్యార్థి సంఘాలు పోటీపడుతూ బంద్‌కు పిలుపునిస్తున్నారు. జూలై నెలలో ఓ విద్యార్థి సంఘం 5వ తేదీన బంద్‌కు పిలుపునివ్వగా పాఠశాలలు మూతపడ్డాయి. తిరిగి 20న మరికొన్ని విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చారు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలను టార్గెట్‌గా చేసుకుని ఈ బంద్‌లు పిలుపునిచ్చినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనాతో ఏడాది కాలం నష్టపోయిన విద్యార్థులకు ఈ ఏడాదైన పాఠశాలలు సక్రమంగా జరుగుతాయని భావించినా పరిస్థితులు ముందుకు నడిపించడంలేదు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Nagar kurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు