Home /News /telangana /

NAGAR KURNOOL FIVE WORKERS DIED IN AN ACCIDENT DURING THE WORKS OF PALAMURU RANGAREDDY PROJECT IN NAGARKURNOOL DISTRICT SNR

Telangana : పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం .. ఐదుగురు కార్మికులు మృతి

palamuru accident

palamuru accident

Telangana | Accident: పాలమూరు-రంగారెడ్డి పంప్‌ హౌస్‌ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ప్యాకేజీ వన్‌లో పనులు జరుగుతుండగా క్రేన్‌ వైర్ తెగిపోవడంతో బీహార్‌కి చెందిన ఐదుగురు కార్మికులు స్పాట్‌లో మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.

నాగర్‌కర్నూల్‌ (Nagarkurnool)జిల్లా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Ranga Reddy Project) పనులు జరుగుతున్నాయి. గురువారం పంప్ హౌస్‌లోకి క్రేన్‌ సహాయంతో కార్మికులు లోపలికి దిగుతుండగా క్రేన్ వైర్(Crane wire) తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు స్పాట్‌లో మృతి(Five workers died) చెందారు. జిల్లాలోని కొల్లాపూర్‌(Kolhapur)మండలం ఏలూరు(Elur)శివార్లలోని రేగుమనగడ్డ(Regumanagadda)దగ్గర పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో పనులు జరుగుతున్న చోటే ఈ దుర్ఘటన జరిగింది.

Telangana : రగులుతున్న పోడు పోరు .. గిరిజనుల పంట పొలాలు ధ్వంసం



క్రేన్ వైర్ తెగిపోవడంతో ప్రమాదం..
ప్రమాదంలో మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడటంతో అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పంప్‌ హౌస్‌లో పడి మృతి చెందిన ఐదుగురు కూలీలు బిహార్‌(Bihar)కి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్‌కి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు జరిగిన ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Nagarkurnool, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు