Home /News /telangana /

NAGAR KURNOOL FISHERMEN SKILL TESTS CONDUCTED IN NAGARKURNOOL DISTRICT FOR MEMBERSHIP IN THE FISHERIES CASTE ASSOCIATION NNK BRV PRV

Fishermen Skill Test: అక్కడ మత్స్యకారుడికీ ఓ పరీక్ష ఉంటుంది తెలుసా.. పాసైతేనే మత్స్యకారుడిగా గుర్తింపు..

ప్రతీకాత్మక

ప్రతీకాత్మక చిత్రం

అంతరించి పోతున్న కుల వృత్తులను కాపాడి మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కుల వృత్తుల వారికి వివిధ రకాల పథకాలను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే మత్స్యకారులకు కూడా కొన్ని పథకాలను అందిస్తుంది ప్రభుత్వం

ఇంకా చదవండి ...
    (N. Naveen Kumar, News18, NagarKurnool)

    సాధారణంగా పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు పరీక్షలు (Exams) జరుగుతుంటాయి. ఉద్యోగాల కోసం వివిధ రకాల పరీక్షలూ ఉంటాయి. కానీ కులవృత్తిని కొనసాగించేందుకు కూడా పరీక్షలు ఉంటాయని ఎంతమందికి తెలుసు. మీరు విన్నది నిజమే. కులవృత్తులు (Caste occupations) కొనసాగించేందుకు కూడా కొన్ని పరీక్షలు ఉంటాయని ప్రభుత్వశాఖల అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే ఆ పరీక్షలు పెన్ను పేపర్ తో రాసేవి కావు. వృత్తి పరంగా తమకు వచ్చిన నైపుణ్యాలను అధికారుల ఎదుట ప్రదర్శించడమే ఈ పరీక్షల ఉద్దేశం.

    కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం..

    అంతరించి పోతున్న కుల వృత్తులను (Caste occupations) కాపాడి మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కుల వృత్తుల వారికి వివిధ రకాల పథకాలను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే మత్స్యకారులకు (For fishermen) కూడా కొన్ని పథకాలను అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana). సబ్సిడీ ద్వారా చేప పిల్లలు పంపిణీ. చేపల రవాణాకు వాహనాలు, చేపలు విక్రయించేందుకు మొబైల్ ఆటోలు, చేపల వేట కోసం వలలు ఇతర పరికరాలు, చేపల నిల్వకు కూల్ బాక్స్ లు, మోపెడ్ వాహనాలను తెలంగాణ ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ ద్వారా అందిస్తున్నారు. అయితే ఈ పథకాలకు అర్హులు కావాలంటే మత్స్యకారులు తప్పనిసరిగా స్థానిక "మత్స్యకార సహకార సంఘం"లో (member in the Fisheries Caste Association) సభ్యులై ఉండాలి. సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే పథకాలకు (For schemes) అర్హులుగా గుర్తిస్తుంది ప్రభుత్వం.



    మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు..

    మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం కోసం (membership in the Fisheries Caste Association) ప్రభుత్వం కొన్ని నైపుణ్య పరీక్షలు (Skill Tests) నిర్వహిస్తుంది. స్థానిక లేదా జిల్లా స్థాయి మత్స్యశాఖ అధికారి పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో భాగంగా మత్స్యకార కులానికి చెందిన 18 ఏళ్ళు నిండిన వారు.. కుల వృత్తిని కొనసాగించదలిచి, వారు స్థానిక సహకార సంఘంలో సభ్యత్వం కోరుకుంటే ఈ పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహించిన స్కిల్ టెస్ట్‌ (Skill test)లో పాసైతేనే సంఘంలో సభ్యత్వం (membership in the Fisheries Caste Association) ఇస్తారు.

    నైపుణ్య పరీక్షలో భాగంగా 5 రకాల స్కిల్ టెస్ట్ లు నిర్వహిస్తారు. అందులో 1. విసురుడు వల, 2. గుంజుడు వల, 3. తెప్పపై నెట్టుకుంటూ చెరువు లోపలి వలను తీసుకురావడం, 4. చిక్కుపడి, చిరిగిన వలను అల్లడం, 5. చెరువులో ఈదటం వంటి స్కిల్ టెస్ట్ లను నిర్వహిస్తారు. 'త్రీ మెన్ కమిటీ' ఆధ్వర్యంలో ఈ స్కిల్ టెస్ట్స్ ఉంటాయి. ఈ కమిటీలో ఒకరు మత్స్యశాఖ అధికారి, రెండవ వ్యక్తి కోఆపరేటివ్ సభ్యులు, మూడవ వ్యక్తి మత్స్యసంఘం అధ్యక్షులు ఉంటారు. ప్రతి సభ్యుడు (Candidate) కూడా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సంఘంలో సభ్యత్వం నమోదుకు అవకాశం కల్పిస్తారు.

    నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 172 సంఘాలు..

    నాగర్ కర్నూల్ (NagarKurnool) జిల్లా వ్యాప్తంగా మొత్తం 172 మత్స్యశాఖ సహకార సంఘాల ఉన్నాయి. వీటిలో ఇటీవల కొత్తగా 35 సంఘాలలో సభ్యత్వం కోరేవారికి ప్రభుత్వం స్కిల్ టెస్ట్ లు నిర్వహించింది. ఈ సారి కొత్తగా 800 మంది మత్స్య కారులు అర్హత సాధించారు. దీంతో వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ రకాల పథకాలు అందనున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఈ నైపుణ్య పరీక్ష వివరాలు, మత్స్యాసహకార సంఘం వివరాలు కావాల్సిన వారు జిల్లా కేంద్రంలోని జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది.

    మత్స్యశాఖ జిల్లా అధికారి. డా.లక్ష్మప్పను సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్ 9441076533.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Exams, Fishermen, Local News, Nagarkurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు