Home /News /telangana /

NAGAR KURNOOL FIRST SCHOOL IN NAGAR KURNOOL DISTRICT TO COMPLETE 114 YEARS SNR NNK NJ

Nagar Kurnool : ఇదే అత్యంత పురాతన పాఠశాల .. 114ఏళ్ల క్రితం కట్టింది ..ఇప్పుడెలా ఉందో చూడండి

(శతాబ్ధాల

(శతాబ్ధాల కాలం నాటి స్కూల్)

IMB High School : నాగర్ కర్నూల్ మొదటి స్కూల్ ఏదో తెలుసా? ఎక్కడుందో ఎప్పుడైనా చూశారా? 1908లోనే అప్పటి బ్రిటీష్ అధికారి డేనియల్ బర్తుల్డ్ ఇక్కడ స్కూల్‌ను ప్రారంభించాడు. 114 ఏళ్ల చరిత్ర కలిగిని ఐఎంబీ స్కూల్ గురించి మరిన్ని విశేషాలు…!

ఇంకా చదవండి ...
    (N.Naveen Kumar,News18,Nagar Kurnool)
    IMB high school: చరిత్రకు నిలువుటద్దంగా నిలుస్తుంది నాగర్ కర్నూల్(Nagar Kurnool)జిల్లా కేంద్రలోని ఐఎంబీ హైస్కూల్(IMB High School). 114 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ స్కూల్ నేటిని చెక్కు చెదరకుండా పేద విద్యార్థులను విద్యను అందిస్తుంది. క్రిస్టియన్ మిషనరీ(Christian Missionary)సహకారంతో బ్రిటీష్ అధికారి(British officer)డేనియల్ బర్తుల్డ్(Daniel Berthold)ఈ స్కూల్ ను స్థాపించారు. నాగర్ కర్నూల్ పట్టణంలో నిర్మించిన మొట్టమొదటి స్కూల్ గా ఐఎంబీ హై స్కూల్ ప్రసిద్ధిగాంచింది.

    1908లో స్థాపించిన స్కూల్..
    నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్ లో 1908లో ఐఎంబీ స్కూల్ ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా బ్రిటీష్ అధికారి బర్తుల్డ్ క్రిస్టియన్ మిషనరీ సహకారంతో ఈ స్కూల్ ను స్థాపించారు. విద్యార్థులకు అన్ని విధాల సౌఖర్యవంతంగా విశాలమైన తరగతి గదులతో స్కూల్‌ను నిర్మించారు. 114 ఏళ్ల క్రితమే పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి విద్యను అందించారు.1917లో బ్రిటీష్ అధికారి బర్తుల్డ్ నాగర్ కర్నూల్ ప్రాంతాన్ని విడిచి వెళ్లవలసి రావడంతో ఈ స్కూల్ నిర్వహణ బాధ్యతలను అప్పటి కరస్పాండెంట్ ఏనుక్ కు అప్పగించారు. నాగర్ కర్నూల్ పట్టణానికి సమీపాన గల గంగారం గ్రామానికి చెందిన కరస్పాండెంట్ ఏనుక్… స్కూల్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిఅభివృద్ధి చేశారు. ఆయన తరువాత వారి వారసులు ప్రకాశం, వారి తరువాత ప్రస్తుతం సూర్యకాంత్‌లు.. స్కూల్‌కు కారస్పాండెంట్ లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

    ఒక్కో బ్యాచ్ లో 500 మంది విద్యార్థులు..
    నాగర్ కర్నూల్ చుట్టుముట్టూ ప్రాంతంలో ఇలాంటి సౌఖర్యాలు కలిగిన స్కూల్ లేకపోవడంతోఇతర ప్రాంతల నుంచి కూడా విద్యార్థులు ఈ పాఠశాలకు వచ్చేవారు. దశాబ్దాల పాటు ఎంతో మంది విద్యార్థులు ఇక్కడి వచ్చి విద్యనభ్యసించారు. ఒక్కో బ్యాచ్‌లో 500 మంది విద్యార్థుల సంఖ్య నమోదుకావడం విశేషం. హాస్టళ్ వసతి కూడా ఉండటంతో 300 మంది వరకు విద్యార్థులు హాస్టళ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.

    గొప్పస్థాయిలో ఉన్న పూర్వవిద్యార్థులు..
    ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ఉన్న ఉద్యోగాల్లో స్థిరపడిన వారున్నారు. ఎయిడెడ్ స్కూల్ గా ఇప్పటికీ ఈ పాఠశాల నిర్వహణ కొనసాగుతూనే ఉంది. ఈ స్కూల్ ప్రస్తతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జూన్ 13 నుంచి అడ్మిషన్ ప్రక్రియ మొదలుకానుంది.

    చెక్కు చెదరిని ఐఎంబీ హైస్కూల్..
    114 ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టిన ఈ స్కూల్ ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. పటిష్ఠమైన గోడలతో, పెద్దపెద్ద స్థంభాలతో చరిత్రను చాటిచెప్పేలా ఉంది. ఈ స్కూల్ గదుల్లో..స్కూల్‌ నిర్మాణం చేపట్టిన బర్తుల్డ్ తో పాటు స్కూల్ నిర్వహణచేపట్టిన అధికారులందరి ఫోటోలు దర్శనమిస్తాయి. బ్రిటీష్ అధికారుల పాలనానాటి సంస్కృతి ఉట్టిపడేలా పాఠశాలను నిర్మించారు. ప్రధానోపాధ్యాయుల గదిలో 100 ఏళ్ల నాటి గోడగడియారం ఇప్పటికి దర్శనమిస్తుంది.

    స్కూల్‌ అడ్రస్‌: IMB చర్చ్‌ ప్రాంగణం, నాగర్‌ కర్నూల్, నల్లవెల్లి రోడ్డు, తెలంగాణ రాష్ట్రం- 509209

    ఎలా వెళ్లాలి : నాగర్‌ కర్నూల్‌లోని నల్లవెల్లి రోడ్డులోని ఎంబీ చర్చ్ ప్రాంగణంలో ఈ స్కూల్ నిర్మితమైంది. వరకు బస్సు సౌకర్యం ఉంటుంది. అక్కడ నుంచి లోకల్‌ ఆటోలో IMB చర్చ్‌ ప్రారంగణం అంటే ఏ ఆటో డ్రైవర్ అయినా తీసుకెళ్తారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nagarkurnool, School, Telangana

    తదుపరి వార్తలు