హోమ్ /వార్తలు /తెలంగాణ /

భార్యతో గొడవ.. పిల్లలను గుట్టపైకి తీసుకెళ్లి..! ఒళ్లు గగుర్పొడిచేలా భర్త అరాచకం

భార్యతో గొడవ.. పిల్లలను గుట్టపైకి తీసుకెళ్లి..! ఒళ్లు గగుర్పొడిచేలా భర్త అరాచకం

Nagar Kurnool

Nagar Kurnool

భార్యాభర్తల మధ్య కలహాలు ఇద్దరు పిల్లల చావుకు కారణం అయింది. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయిన కసాయి తండ్రి పసిపిల్లలను అతి దారుణంగా చంపి ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులో చోటుచేసుకుంది

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  భార్యాభర్తల మధ్య కలహాలు ఇద్దరు పిల్లల చావుకు కారణం అయింది. తాగిన మైకంలో విచక్షణ కోల్పోయిన కసాయి తండ్రి పసిపిల్లలను అతి దారుణంగా చంపి ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులో చోటుచేసుకుంది.

  కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామానికి చెందిన ముట్టే ఓంకార్ (35)కు కుడికిళ్లకు చెందిన మాచుపల్లి మహేశ్వరితో పెళ్లి జరిగింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఓంకార్. మొదటి భార్య మృతిచెందగా.. రెండోసారి పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన యువతిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే నిత్యం మద్యం తాగి వేధిస్తున్నాడంటూ ఆమె వదిలి వెళ్లిపోయింది. దీంతో ఓంకార్ మహేశ్వరిని మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి చందన (3) విశ్వనాథ్ (1) ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  Read This : Malicious Apps : గూగుల్‌ ప్లే స్టోర్‌లో హానికరమైన యాప్‌లు..మీ ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి చిట్కాలు ఇవే..

  మేస్త్రి పని చేసే ఓంకార్ తాగుడుకు బానిసై గ్రామంలో పలువురితో గొడవపడేవాడు. దీంతో అతడిని శాడిస్ట్‌గా భావించి గ్రామస్తులు మాట్లాడే వారు కాదు. అవమానంగా భావించిన ఓంకార్ ఇటీవల భార్య పిల్లలతో కొల్లాపూర్‌కు మకాం మార్చాడు. అద్దె ఇంట్లో ఉంటూ మేస్త్రి పని చేసేవాడు.

  పిల్లలు కనే విషయంలో ఓంకార్ తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని కొద్దిరోజులుగా మహేశ్వరి అడుగుతుండగా...ఇంకా పిల్లలు కావాలంటూ ఓంకార్ గొడవపెట్టుకునేవాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు నాగర్ కర్నూల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేయిస్తానని భార్యకు చెప్పి ఆమెతోపాటు పిల్లలను వెంటబెట్టుకుని ఓంకార్ బైక్ పై బయలుదేరాడు. గంటరావుపల్లి స్టేజి వద్దకు చేరుకోగానే భార్య భర్తలు ఇద్దరు మరోసారి గొడవపడ్డారు. దీంతో భార్యపై చేయి చేసుకున్నాడు ఓంకార్. మననస్తాపానికి గురైన మహేశ్వరి అక్కడి నుంచి పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు పోతానని భర్తను బెదిరించింది.

  ఆగ్రహానికి గురైన ఓంకార్ ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై కోడేరు మండలం గంటారావుపల్లి గ్రామ శివారులోని గుట్టల వద్దకు వెళ్లాడు. అక్కడ చిన్నారుల గొంతును కత్తితో కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను అదే కత్తితో ఆత్మహత్యకు యత్నించి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కాగా మహేశ్వరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ చేసింది. పోలీసులు ఓంకార్ ఉన్న లొకేషన్ ను.. ఫోన్ ద్వారా ట్రేస్ చేయగా ఎత్తం గ్రామ శివారులో ఉన్నట్లు గుర్తించారు.

  అనంతరం ఎస్ఐ రాము తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా రోడ్డు సమీపంలో ఓంకార్ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గుర్తించి అతడిని అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పసిపిల్లలు విగత జీవులుగా పడిఉండడం చూసిన తల్లి మహేశ్వరీ గుండెలవిసేలా రోదించింది.

  Published by:V. Parameshawara Chary
  First published:

  Tags: Local News, Nagar kurnool

  ఉత్తమ కథలు