Home /News /telangana /

NAGAR KURNOOL FARMER EARNING RS 3000 PER DAY BY SELLING DONKEY MILK IN NAGARKURNOOL NNK BRV ABH

Nagarkurnool: గాడిదల పెంపకంలో ఇంత లాభమా?: రోజుకి ఎంతొస్తుంది తెలిస్తే నోరెళ్లబెడతారు

గాడిద

గాడిద పాలు పిండుతున్న మంగమ్మ

పనిపాట లేని వారిని గాడిదలు కాస్తున్నావా అంటూ సాధారణంగా సంబోధిస్తుంటారు. కాని అలాంటి గాడిదలను కాస్తే రోజుకు వేలల్లో సంపాధించవచ్చని మీకు తెలుసా. అవును రెండు గాడిదలు ఉంటే చాలు రోజుకు రూ.3000 వరకు సంపాధించవచ్చు

  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    N.Naveen Kumar, News 18, NagarKurnool

    NagarKurnool;గాడిద పాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ 10 ఎంఎల్ పాలకు రూ.300 ధర రెండు గాడిదలు ఉంటే రోజుకు రూ. 3000 వరకు ఆదాయం, ఒక్కో గాడిద ధర రూ. 40 నుంచి 50 వేలు పిల్లలకు ఔషధంగా గాడిద పాలు పనిచేస్తాయని నమ్మకం.పనిపాట లేని వారిని గాడిదలు కాస్తున్నావా అంటూ సాధారణంగా సంబోధిస్తుంటారు. కాని అలాంటి గాడిదలను కాస్తే రోజుకు వేలల్లో సంపాధించవచ్చని మీకు తెలుసా. అవును రెండు గాడిదలు ఉంటే చాలు రోజుకు రూ.3000 వరకు సంపాధించవచ్చు. గాడిద పాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఎంతలా అంటే 10 ఎంఎల్ గాడిద పాల ధర రూ.300కు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తిలా కొందరు నేటికీ గాడిదలను కాస్తుండగా మరికొందరు వ్యాపారం కోసం గాడిదలను పెంచుతున్నారు.

    పిల్లలకు ఔషదంలా పనిచేస్తున్న గాడిద పాలు:
    గాడిద పాలను శంఖుపాలుగా పిలుస్తూ చిన్నారులకు పట్టించడం ఆనవాయితీగా వస్తుంది. 11 రోజుల వయసు నుంచి 3 ఏళ్ల లోపు చిన్నారులకు గాడిద పాలను పట్టిస్తుంటారు. శ్వాసకోస సంబంధిత వ్యాదులు తగ్గుతాయని, దగ్గు, జలుబు, ఉబ్బసం వంటి వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుకునేందుకు ఈ శంఖుపాలను పట్టిస్తారు. గాడిద పాలలో కొన్ని రకాల ఔషద దినుసులను కలిపి 3 రోజుల పాటు రోజుకు రెండు పూటల మూడు చుక్కలు చిన్నారులకు అందిస్తారు. ఈ ప్రక్రియ వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని అనాధిగా ప్రజలు నమ్ముతున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోవడంతో చిన్నారులకు పట్టిస్తున్నట్లు చెబుతున్నారు.

    గాడిద పాలతో రోజుకు రూ.3000 వరకు సంపాదన:
    గాడిద పాలను విక్రయిస్తూ రోజుకు రూ.3000 వరకు సంపాధించగలుగుతున్నామని గాడిద పాల వ్యాపారి మంగమ్మ తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం పరిధిలోని నాగనూలు గ్రామంలో వంశపారం పర్యంగా వస్తున్న కులవృత్తిని నమ్ముకొని రెండు గాడిదలను పెంచుతున్నారు మంగమ్మ. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లా పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లి గాడిద పాలను విక్రయిస్తున్నారు. 10 ఎంఎల్ పాలలో ఔషద దినుసులు కలిపి రూ.300 వరకు అందిస్తున్నారు. ఇలా రెండు గాడిదల పాలను విక్రయించి రోజుకు రూ.3000 వరకు సంపాదిస్తున్నారు. తన కుమారుడు, కోడలు కూడా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని మంగమ్మ తెలిపింది.

    Read this also; Nagarkurnool: అందుబాటులోకి వచ్చిన మెడికల్ కళాశాల: ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం




    ఒక్కో గాడిద ఖరీదు రూ.40 నుంచి 50వేలు:
    గాడిదే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఆవులు, గేదలు ఇతర పశువులతో పోటీ పడుతూ గాడిద ధర కూడా ఎక్కువగానే ఉంది. ఒక్కో గాడిద ధర మార్కెట్‌లో రూ.40 నుంచి 50వేల వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో గాడిద కొరతలు ఏర్పడటంతో వ్యాపారులు మహారాష్ట్ర నుంచి గాడిదలను కొనుగోలు చేస్తున్నారు. ఒక గేదెకు రోజుకు ఎంత ఖర్చ వస్తుందో అంతే ఖర్చు గాడిదకు కూడా వస్తుందని పెంపకందారులు అంటున్నారు. ఎండు గడ్డి, పచ్చి గడ్డి ఇతర మేతను అందిస్తేనే గాడిదలు అధికంగా పాలు ఇస్తున్నాయి. గాడిద పాల వ్యాపారి మంగమ్మ ఫోన్ నెంబర్: 8008381075
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Local News, Nagarkurnool, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు