హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: అన్నదాత ఇంట విషాదం.. పంట చేనుకు గుళికల మందు కొట్టి రైతు మృతి

Nagarkurnool: అన్నదాత ఇంట విషాదం.. పంట చేనుకు గుళికల మందు కొట్టి రైతు మృతి

మహబూబ్​నగర్​

మహబూబ్​నగర్​

పంట చేనుకు గులికల మందు చల్లిన రైతు మందు ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు

 • News18 Telugu
 • Last Updated :
 • Nagarkurnool, India

  (N. Naveen Kumar,News18,Nagarkurnool)

  రైతు మృతి: మహబూబ్‌నగర్ (Mahbubnagar) జిల్లా అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ చెందిన రైతు (Farmer) హనుమంత గౌడ్ (54) కందూరు శివారులో వరి పంట సాగు చేశాడు. ఈనెల 5న పంట చేనుకు గులికల మందు చల్లిన రైతు మందు ప్రభావం ఎక్కువగా ఉండడంతో కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. పొరుగునే ఉన్న కొందరు రైతులు ఆలస్యంగా విషయాన్ని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అనంతరం రైతు హనుమంతను చికిత్స (Treatment) నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు (Farmer died) కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

  కొరివిపాడులో వివాహిత మృతి: జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా మానవపాడు మండలం కొరివిపాడు గ్రామంలో వివాహిత తెలుగు రేణుక (26) మృతి స్థానికంగాకాలకాలం రేపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం కొరివిపాడుకు చెందిన రేణుక, కొండపల్లి గ్రామానికి చెందిన నాగరాజు దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈనెల 9వ తేదీన సరుకుల కోసం బయటకు వెళ్ళొస్తానని చెప్పిన రేణుక కొరివిపాడు స్టేజి వద్ద కిందపడి ఉంది.

  స్థానిక గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. రేణుక వద్ద పురుగుల మందు తాగిన వాసన రావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  Primitive man tombs: న్యూస్ 18 ఎఫెక్ట్: కదిలిన పర్యాటకశాఖ, ఆదిమ మానవ ప్రాంతాలకు గుర్తింపు 

  వాహనం ఢీకొని వ్యక్తి మృతి; జోగులాంబ గద్వాల జిల్లా మాల్డకల్ మండలం కేంద్రానికి సమీపంలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని గద్వాల నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టినట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. మృతి చెందిన వ్యక్తి వయసు 55 ఏళ్లు ఉంటుందని మృతడి ఆచూకీ తెలియకపోవడంతో సర్పంచ్ యాకోబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Farmer, Local News, Nagarkurnool

  ఉత్తమ కథలు