(N.Naveen Kumar,News18,Nagarkurnool)
కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం: జోగులమ్మ గద్వాల (Jogulamba gadwal)జిల్లాలో అన్యాక్రాంతమైన తన భూమిని కాపాడాలని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. బాధిత రైతు కథనం ప్రకారం గద్వాల జిల్లాలోని మానపాడు (Manapadu)మండలం కల్కుంట్ల (Kalkuntla)గ్రామానికి చెందిన లోకేష్(Lokesh)కు 171 సర్వే నెంబర్లో 5.20 గుంటల భూమి వారసత్వంగా వచ్చింది. ఆ భూమిని లచ్చన్న గౌడ్(Lacchanna Goud)అనే వ్యక్తి తన పేరుపై మార్చుకున్నాడు. ఈ సమస్యపై ఐదేళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. దీంతో మనస్థాపనకి గురైన రైతు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి ఒంటిపై పెట్రోల్ (PEetrol) పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులు వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహులు అడ్డుకొని వెంటనే లోకేష్‌ను 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్పందించిన అధికారులు లోకేష్ భూమిని వివరాలు స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్రమణదారులకు భూమిలో చొరబడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. లోకేష్‌కు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు.
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య:
నాగర్‌కర్నూల్ జిల్లా బలుమూరు మండలంలో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాణాల గ్రామంకు చెందిన కొర్ర పార్వతి (35) అనే మహిళ ఇటీవల వేసిన పత్తి పంట నష్టపోయింది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తలు గొడవలతో మనస్థాపానికి గురై సోమవారం పార్వతి పురుగుల మందు తాగింది. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.
పేకాటరాయుళ్ల అరెస్ట్:
జోగులాంబ గద్వాల జిల్లాలో శెట్టి ఆత్మకూరులో సోమవారం పేకాడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు రూరల్ ఎస్సై ఆనంద్ తెలిపారు. శెట్టి ఆత్మకూరు శివారులో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో దాడి చేసినట్లు చెప్పారు. అక్కడ పేకాడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 39 వేలు నగదు, 10 బైకులు, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరికొందరు పరరయ్యారని వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఎస్సై తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana News