హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: యథేచ్చగా సారా తయారీ

Nagarkurnool: యథేచ్చగా సారా తయారీ

సారాయిని పడేస్తున్న అధికారులు

సారాయిని పడేస్తున్న అధికారులు

Nagarkurnool: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకవైపు ఎక్సైజ్ అధికారులు సారా తయారీ కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పుటికి మరోవైపు సారాయి గుప్పుమంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Naveen Kumar, News18, Nagarkurnool

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకవైపు ఎక్సైజ్ అధికారులు సారా తయారీ కట్టడి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన అక్కడక్కడ ఈ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రం నుంచి సారాను తరిమేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఇందుకు అనుగుణంగా సారా తయారు దారులను నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఎక్సైజ్ శాఖ వరస దాడులు నిర్వహించడంతోపాటు ముడి పదార్థాలైన బెల్లం పట్టిక తదితర వాటి అమ్మకాలపై ఆంక్షలు విధించింది.

పునరావాస పథకం కింద రాయితీ రుణాలను పంపిణీ చేసి ప్రక్రియ ఉపాధి చూపించింది. ఇన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికి ఫలితాలేవి కనిపించడం లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం నమోదవుతున్న లెక్కల ప్రకారం చూస్తే మొదటి స్థానంలో నాగర్కర్నూల్ రెండవ స్థానంలో వనపర్తి తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ప్రధానంగా నాగర్ కర్నూల్ జిల్లాలో సారా తయారీ జోరుగా సాగుతుంది. ఇందులో కూడా అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, తెలకపల్లి మండలాల్లో పరిధిలో ఉండే గ్రామాలు తండాలు శివారు ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలు కొండ ప్రాంతాల్లో అక్రమ బట్టిలు ఏర్పాటు చేసి బెల్లం ఇప్ప పూల సారాను తయారు చేస్తున్నారు.

ఇక వన వనపర్తి మండల కేంద్రంతో పాటు మహబూబ్నగర్ మండలం నవాబుపేట హన్వాడ, జడ్చర్ల ప్రాంతాల్లో పల్లెల సమీపంలో గుడారాలు తయారీ కొనసాగుతుంది. ఒకవైపు ఎక్సైజ్ అధికారులు దాడులు జరుపుతున్నప్పటికీ గుడుంబా తయారీ విధానం పూర్తిగా కట్టడి కావడం లేదు. ముఖ్యంగా నవాబుపేట మహబూబ్నగర్ మండలాలలోని కొన్ని తండాలో జోరుగా ఈ తయారీ విధానం నడుస్తుంది. బెల్లం కొరత ఉండడంతో బెల్లం చక్కెరను వాడుతున్నట్టు అధికారుల దాడుల్లో వెలుగులోకి వచ్చాయి.

OMG: మా పెళ్లిని గుర్తించండి..సుప్రీంకోర్టుకి ఇద్దరు స్వలింగ సంపర్కులు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2021-22 అక్టోబర్ వరకు నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే నాగర్కర్నూల్ జిల్లాలో 1,3 93 కేసులు నమోదు కాగా 1400 మందిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 7100 లీటర్ల సారాను 1,86 232 క్వింటాళ్ల బెల్లాన్ని, 304 వాహనాలను సీజ్ చేసినట్టుగా అధికారులు ప్రకటించారు. వనపర్తి జిల్లాలో 625 కేసులు నమోదు కాగా 55 6 మందిని అరెస్ట్ చేశారు. 230 లీటర్లలో సారాను స్వాధీనం చేసుకోగా 29, 833 క్వింటల్లా బెల్లాన్ని 85 వాహనాలను సీజ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో 587 కేసులు నమోదు కాగా 631 మందిని అరెస్ట్ చేశారు. 1,711 లీటర్ల సారాయిని ధ్వంసం చేశారు, 5,655 క్వింటాళ్ల బెల్లాన్ని 55 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 75 కేసులు నమోదు కాగా 86 మందిని అరెస్ట్ చేశారు. 389 సారా ధ్వంసం చేశారు. 360 క్వింటాళ్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 15 వాహనాలను సీజ్ చేశారు.

ఆబ్కారీశాఖ అధికారులు సారా నియంత్రించడానికి గ్రామాలు తండాలు నివసించే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గతంలో ఎక్సైజ్ అధికారులు కేవలం సారాను అదుపు చేయడానికి మాత్రమే వాటిని అమ్మేవారిని అదుపులోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ర్యాలీలు చేపట్టి సారా తాగడం వల్ల కలిగే నష్టాలను వారికి వచ్చేటువంటి ఆధారాలకు సమస్యలను సారాను వినియోగించే వారికి తెలియజేస్తున్నారు. దీని ద్వారా చాలా వరకు ప్రజల్లో అవగాహన కలిగి సారాను దూరం చేసుకునే సందర్భాలు కూడా తలెత్తుతున్నాయి.

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సారాను నియంత్రించడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారుచేసి బృందాలను ఏర్పాటు చేశామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎక్సైజ్ శాఖ డి సి దత్తరాజ్ గౌడ్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట కల్వకుర్తి తెలకపల్లి కొల్లాపూర్ ఏరియాలో సారా తయారీ ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వనపర్తి స్టేషన్ పరిధిలో కూడా కొంతమంది ఉంది సారా తయారీ అధికంగా ఉన్న ఏరియాలను డి కేటగిరీ కిందకు చేర్చి తనిఖీలు దాడులు పెంచి కట్టడి చేస్తున్నామని వివరించారు సారా తయారీ కోసం వినియోగించేబెల్లం ఇతర పదార్థాలపై రవాణా పై దృష్టి పెట్టామని చెప్పారు.

First published:

Tags: Local News, Nagarkurnool, Telangana

ఉత్తమ కథలు